ఈ భాగంలో అనుభవం:
- దారి చూపడానికి బాబాయే వచ్చారా!
సాయిభక్తుడు ఆయుష్‌ధార్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఎన్నో అనుభవాలతో ఎంతో నేర్చుకుంటూ సాగే సద్గురు సాయితో ప్రయాణం అద్భుతమైనది. ఎల్లప్పుడూ నాతో ఉంటున్నందుకు ముందుగా నేను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను జమ్మూ నగరానికి చెందినవాడిని. నేను నా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ మహారాష్ట్రలో పూర్తిచేశాను. నేనిప్పుడు చెప్పబోయేది చాలా ఆసక్తికరమైన అనుభవం.
"నేను ఎప్పుడూ నా భక్తుల సంక్షేమాన్ని చూసుకుంటాను", "పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నా వద్దకు లాక్కుంటాను" అని బాబా చెప్పారు. 2017, జులైలో నా అడ్మిషన్ అనే ఒక చిన్న సాకుతో నన్ను, నా తల్లిదండ్రులను శిరిడీ రప్పించుకున్నారు బాబా. నేను, మా అమ్మ, నాన్న మరియు మా కజిన్ కలిసి ఒక అర్థరాత్రి కారులో శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అంతకుముందు మేమెప్పుడూ మా సొంత కారులో శిరిడీ వెళ్లనందున ఆ మార్గం గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. అయితే మా కజిన్, "ఆందోళన చెందడానికి ఏమీలేదు, మనం GPS సహాయం తీసుకుందామ"ని చెప్పారు. సరేనని మేము నవీ ముంబాయి నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరాము. ఆ సమయంలో భారీవర్షం పడుతోంది. మేము, "బాబా! మమ్మల్ని సురక్షితంగా శిరిడీ చేర్చండి" అని బాబాను ప్రార్థిస్తూ ప్రయాణం సాగిస్తున్నాము. మూడు, నాలుగు గంటల పాటు మా ప్రయాణం సజావుగా సాగింది. ఆ తరువాత నుంచి మేము శిరిడీ చేరుకోవాల్సిన సమయం పెరగడం మొదలైంది. మాకు అంతా అయోమయంగా తోచింది. మేము GPSను అనుసరిస్తూ భయానక ప్రదేశాలగుండా ప్రయాణిస్తున్నాము. కానీ గత్యంతరం లేక GPSను అనుసరిస్తూనే, బాబాను స్మరిస్తూ ఉన్నాము. మేము ప్రయాణించాల్సిన దూరం తగ్గడం లేదు. దాదాపు మేము శిరిడీ నుండి ఒక గంట ప్రయాణ దూరంలో ఉన్నప్పుడు GPS సరైన మార్గాన్ని చూపించడం మానేసింది. గుంతలు నిండిన ఇరుకైన మార్గంలో, ఎక్కడా ఏ మాత్రం వెలుగు కనపడటం లేదు, వాహనాల కదలిక లేదు. అటువంటి ప్రదేశంలో మేము చిక్కుకున్నాము. అప్పుడు సమయం తెల్లవారుఝామున 4 గంటలైంది. నిజానికి మేము కాకడ ఆరతికి హాజరవ్వాలని అనుకున్నాము. కానీ మేమింకా దారిలోనే ఉన్నాము. దిక్కుతోచని ఆ స్థితిలో ఏమి చేయాలో అర్థంకాక సహాయం కోసం బాబాను ప్రార్థిస్తూ, సురక్షితంగా తన దర్బారుకు చేర్చుకోమని సాయితల్లి పేరును గట్టిగా జపిస్తున్నాము. కొన్ని నిమిషాల తరువాత ఎదురుగా ఒక కాంతి కనిపించింది. అది ఒక ద్విచక్రవాహనం. క్షణాల్లో ఆ వాహనం మమ్మల్ని సమీపించింది. దానిపై తెల్లని షర్ట్, ప్యాంట్, తలకు గాంధీటోపీ ధరించిన ఒక వృద్ధుడు ఉన్నాడు. అతను, "మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?" అని అడిగారు. నా కజిన్, “శిరిడీ సమాధిమందిరానికి వెళ్ళాలి, దయచేసి మీరు మాకు మార్గం చూపించగలరా?" అని అంది. అందుకతను, "ఒహ్హ్! చింతించకండి. మీరు దారితప్పారు. కారు వెనక్కి తిప్పి ఈ రహదారి వెంబడి తిన్నగా 5 కిలోమీటర్లు వెళ్ళండి. ఈ మార్గం మిమ్మల్ని బాబా మందిరానికి చేరుస్తుంది. కావాలంటే మీరు నన్ను అనుసరించవచ్చు, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నేను మందిర ప్రాంగణంలో ప్యూనుగా పనిచేస్తున్నాను" అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే నా మనస్సుకు 'స్వయంగా బాబాయే మాకు సహాయం చేయడానికి వచ్చార'ని అనిపించింది. మేము అతనిని అనుసరించడం మొదలుపెట్టాము. అతను చాలా వేగంగా వెళ్తున్నాడు. మేము అతని వేగాన్ని అస్సలు అందుకోలేకపోతున్నాము. ఎలాగో మొత్తానికి మేము శిరిడీలోకి ప్రవేశించాము. ఒక్కసారి అతను వెనక్కి తిరిగి చూశాడు. మేము అతనిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్యలో ఉన్న దూరాన్ని అధిగమించేలోపు అతను మరి కనిపించలేదు. అంతలోనే గాలిలో కలిసిపోయినట్లు అతనెలా అదృశ్యమైపోయారు? వావ్! ఏమా అనుభవం! మేము ఆశ్చర్యపోయాము. బాబా చూపిన కృపకు అతిశయించిన ఆనందంతో ధన్యవాదాలు తెలుపుకున్నాము.
మొత్తానికి బాబా కృపతో మేము సుమారు 5 గంటలకు శిరిడీ చేరుకున్నాము. ఆరతికి హాజరై, బాబా దర్శనం చేసుకుని సాయంత్రం శిరిడీ నుండి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాము. నాసిక్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని మూసేశారు. అందువలన మేము మరో మార్గం పట్టుకోవలసి వచ్చింది. ఆ ప్రయత్నంలో మేము మళ్ళీ దారి తప్పిపోయాము. వెనక్కి తిరిగి వస్తూ బాబాను సహాయం కోసం ప్రార్థిస్తూ, ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఎవరినైనా సహాయం అడుగుదామని అనుకున్నాము. అప్పుడు రాత్రి 12 అయింది. పెట్రోల్ బంక్ దగ్గర ఎవరూ లేరు. ఏమి చేయాలో అర్థంకాక బాబాను తలచుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒక ట్రక్ వచ్చి ఆగింది. అతను మా సమస్యను విని, "చింతించకండి. నేను భీవండి వెళ్తున్నాను. మీరు నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని జాతీయ రహదారి వరకు తీసుకెళ్తాను. అక్కడనుండి మీరు ఎడమవైపు తీసుకుని ముంబాయి చేరుకోవచ్చు” అని చెప్పాడు. బాబా మళ్ళీ మాకు తమ సహాయాన్ని అందిస్తున్నారని గ్రహించి మా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. మేము దారితప్పిన రెండు సందర్భాలలోనూ గమ్యం చేరుకోవడంలో ఆయన మాకు సహాయం చేశారు. ఆయన దయవల్ల ఆ గ్రామీణ రహదారులపై మేము ఏ దురదృష్టకర పరిస్థితి ఎదుర్కోకుండా బయటపడ్డాము. బాబా తన భక్తులను శిరిడీకి రప్పించుకున్నప్పుడు, వారి క్షేమాన్ని కూడా ఆయన చూసుకుంటారు. ఇలాంటి దైవిక అనుభవాలు నాకు చాలా ఉన్నాయి, వాటిని ఇంకోసారి మీతో పంచుకుంటాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2613.html?m=0

Baba Please help me.
ReplyDeleteఓం సాయిరాం🌹🙏🌹
ReplyDeleteOm Sri Sai Ram thaatha.. 🙏🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః
ReplyDeleteom sairam
ReplyDeleteom sairam
om sairam
om sairam
🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDelete