సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అనంతరావు దండేకర్


ముంబాయి నివాసి అనంతరావు బాబాను సశరీరులుగా ఉన్నప్పుడు దర్శించిన అదృష్టవంతుడు. అతనిలా చెప్పాడు: "బాబా నన్ను 'భోండూ' (సాధారణ మనస్తత్వం) అని పిలిచేవారు. అందువల్ల ఇతర భక్తులు నన్ను 'భోండూజీ' అని పిలిచేవారు. ఆ రోజుల్లో శిరిడీ ప్రయాణం చాలా శ్రమతో కూడుకున్నది. నేను కోపర్‌గాఁవ్‌ వరకు రైలులో వెళ్లి, అక్కడినుండి ఎడ్లబండిలో గానీ, గుఱ్ఱపుబండిలో గానీ శిరిడీ వెళ్ళేవాడిని. శిరిడీలో బస చేసినప్పుడు నా దేవుని సన్నిధిలో ఉన్నానన్న భావనతో నేనెంతో ధన్యుడినైన అనుభూతి కలిగేది. నేను శిరిడీలో ఒక వారం రోజులు, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ రోజులు ఉండేవాడిని. బాబా చుట్టూ ఒకరకమైన దైవిక ప్రకాశం ఉండేది. నాకు సంబంధించినంతవరకూ బాబా తప్ప వేరే దైవం లేదు.

నేను శిరిడీలో ఉన్న సమయంలో తరచూ నా దైవం పాదాలు ఒత్తేవాడిని. అవి పట్టులా మృదువుగా ఉండి, గంధపు పరిమళాన్ని కలిగి ఉండేవి. ఒకసారి నేను బాబా పాదాలు ఒత్తుతున్నప్పుడు ఆయన తమ పాదాలను దూరంగా జరిపి, నా చేయి పట్టుకుని, “భోండూ, ఆపు! లేచి ఇంటికి వెళ్ళు" అని అన్నారు. నేను, "కానీ బాబా, నేను నిన్ననే వచ్చాను. అప్పుడే మీరు నన్ను వెళ్ళమంటున్నారా?" అని ఎదురు సమాధానం చెప్పాను. అప్పుడు బాబా, "భోండూ, వెంటనే నువ్వు ఇంటికి వెళ్లు. నీ రాక కోసం ఒకరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు" అని అన్నారు. తరువాత ఆయన పిడికెడు ఊదీ నాకిచ్చి, "అల్లా భలా కరేగా (అల్లా మేలు చేస్తాడు)" అని ఆశీర్వదించారు. నేను ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇంటికి తిరిగి వెళ్ళాను. విషయం ఏమిటంటే, నా భార్య అకస్మాత్తుగా చాలా అనారోగ్యానికి గురై, నన్ను ఇంటికి పంపమని బాబాను ప్రార్థించింది. బాబా సర్వజ్ఞుడు కాబట్టి నా భార్య ప్రార్థనను విని, ఆమెకోసం ఊదీ పంపారు. నేను చేసిన మొదటి చికిత్స ఏమిటంటే, ఆమె నుదుటిపై ఊదీ పూయడం. తరువాత కొంత ఊదీని ఆమె నోట్లో వేశాను. మరుసటిరోజుకల్లా ఆమె కోలుకుంది. బాబా సర్వజ్ఞత్వానికి ఇది ఒక నిదర్శనం.

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; కొత్త వాల్యూమ్. ఎడిషన్, 2002.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo