సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీసాయి సన్నిధిలోనే భర్త కొరడా ఝుళిపిస్తే........


శ్రీ కేల్కరు తన అల్లుడైన రావుసాహెబ్ హెచ్.వి.సాఠే  కొరకు శిరిడీ గ్రామంలో 20 ఎకరాల భూమిని కొన్నారు. కొన్ని దినములు పిదప శ్రీసాఠే శిరిడీకి వచ్చి ఆ భూమిని చూడవలెనని ఆశపడ్డారు. మామగారైన కేల్కరును తనతో వచ్చి ఆ భూమిని చూపమని కోరారు. తన భార్యను కూడా తనతో ఆ భూమిని చూచుటకు రమ్మనగా, ఆమె కూడా తండ్రిని సంప్రదించకనే - అంగీకరించింది. గుర్రాల బగ్గివచ్చి సిద్దంగా ఉంది వారి ప్రయాణానికి.

కేల్కరు సందిగ్ధంలో పడవలసి వచ్చింది. అప్పుడాయన ఇంటిలోనే సాఠే గారి అన్న భార్య ఉన్నది. ఆమె భర్త మరణించారు. ఈ భూమి విషయం ఆమెకు తెలిసిన యెడల దానిలో తన భర్తకు కూడా భాగం ఇవ్వమని ఆమె అడిగే అవకాశం ఉంది. అందువలన ఆ భూమిని ఆ రోజు ఎవరూ చూచుటగానీ, ఆమెకు చెప్పుటకానీ కేల్కరుకు ఇష్టం లేదు. భూమి వద్దకు తాను రాలేనని చెప్పివేసాడు.

శ్రీసాఠే  తన భార్యను తనతో రమ్మని కోరగా, అపుడామె తండ్రిని అడుగగా, కేల్కరు ఆమెను వెళ్ళవద్దని సలహా యిచ్చాడు. ఆమె భూమి వద్దకు వెళ్ళిన, తోడికోడలు ఆ విషయం తెలుసుకొనవచ్చునని ఆయన సంశయం. అందుకే కుమార్తెనూ వెళ్ళవద్దన్నాడు. తాను గుర్రాల బగ్గీని  తీసుకొనివచ్చి, "భూమిని చూద్దాము రమ్మ"నగా, అటు మామగారూ, ఇటు భార్య, ఇద్దరూ వచ్చుటకు నిరాకరించగా, సాఠే   కోపానికి అడ్డులేకపోయింది. ఆ ఉద్రేకంలో గుర్రాలబండి నడిపేవాని వద్దనున్న కొరడా లాగుకొని ఝళిపించి, భార్యను కొట్టుటకు అడుగు ముందుకు వేసాడు. ఇంతలో మేఘుడు అరచుచూ అక్కడకు వచ్చాడు చాలా వేగంగా. పరమశివునికి నందీశ్వరుడెట్లో శ్రీసాయిబాబాకు మేఘుడు అట్టి నమ్మినబంటు. “అయ్యా - శ్రీ సాయిబాబా మిమ్ములను తక్షణమే రమ్మన్నారు” అని అరచాడు. ఎత్తిన కొరడాను దించి దానినవతలకు విసరివేసి, శ్రీసాఠే బాబా మసీదులోకి ప్రవేశించాడు.

ఆయనను చూడగానే శ్రీసాయిబాబా - “ఏమైంది సాఠే - ఏమైంది?" అని బిగ్గరగా అరచారు. శ్రీసాఠే తాను చేయబోయిన పనికి సిగ్గుపడి తలదించుకున్నాడు. దానినంతా శ్రీ సాయిబాబా అప్పటికే తెలుసుకున్నారని బాధపడ్డాడు. శ్రీసాయి నిదానంగా మళ్ళీ అన్నారు... “నీవిప్పడే ఆ భూమిని చూడాలని తొందరపడుతున్నావెందుకు? అది అక్కడే ఉంటుంది. నీవు చూచినా, చూడకున్నా - కొంచెమైనా మారదు, తరగదు” అని.

సరియైన సమయంలో తనను పిలిపించి తాను చేయబోయిన క్రూరమైన పనినుండి తప్పించినందుకు శ్రీసాఠే మనసులో శ్రీసాయికి నమోవాక్కులర్పించుకున్నాడు. అతని భార్య కూడా తన భర్త చేతిలో కొరడా దెబ్బలు తినకుండా తప్పించినందుకు శ్రీసాయిబాబాకు ప్రణమిల్లింది.

ఆ విధంగా శ్రీసాయి తన భక్తులు ఎక్కడ ఏమి చేయబోతున్నదీ గ్రహించి తాను మసీదులోనే ఉండి వారిని అదుపులో ఉంచుతూ కష్టాల నుండి తప్పించేవారు, ఈనాటికీ సమాధి నుండే అలాగే చేస్తున్నారు కూడా.

సోర్సు : సాయిపథం  వాల్యూం - 1

6 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ 🙏🏻

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo