సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1768వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా రాకతో మనశాంతి 
2. దివ్యపూజ చేస్తాననుకున్న రోజే లభించిన బాబా అనుగ్రహం
3. ప్రార్థించినంతనే అనుకూలంగా మార్చిన బాబా

బాబా రాకతో మనశాంతి 


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సునీత. నేను, నా కుటుంబం ఏసయ్యను తప్ప ఎవరినీ ప్రార్థించింది లేదు. కానీ మొట్టమొదటిసారి సాయిబాబాని నమ్మి ప్రార్థిస్తే, ఆయన మాపై ఎంతో దయ చూపారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఐదేళ్లు అప్పులు, అనారోగ్య సమస్యలతో నేను చాలా బాధపడ్డాను. దేవుడు నా మొర ఆలకించలేదు, నా కష్టాన్ని తీర్చలేదు. అలాంటి స్థితిలో ఉన్న నాకు 2023, ఫిబ్రవరి 1న బాబా గుడి కనిపించింది. యేసుని తప్ప ఏ దేవుడిని స్మరించని నేను ఎందుకో తెలీదు ఆ గుడిని చూడగానే మనసులో వేదనతో బాబాని స్మరించుకున్నాను. అంతే, నా బాధంతా ఒక్కసారిగా పోయినట్లు అనిపించింది. అప్పటినుంచి సాయిని నమ్మి పూజిస్తూ గురువారం బాబా గుడికి వెళ్తుండేదాన్ని. ఇలా ఉండగా సెప్టెంబరు నెలలో బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ కలలో బాబా మా ఇల్లు అమ్మేసి నా అప్పులన్నీ తీర్చి, నన్ను ఆరోగ్యవంతురాలిగా చేసినట్టు కనిపించింది. అది నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే, నేను ఎప్పుడూ ప్రార్థించే నా దేవుడు నన్ను ఆదుకోలేదు. అందువల్ల ఈ బాబా నన్ను ఆదుకుంటాడా అనిపించింది. కానీ భలే విచిత్రంగా మా ఇల్లు అమ్ముడుపోయి నా అప్పులు తీరి, నా ఆరోగ్య సమస్యలు కూడా సమసిపోయేలా చేసి మనశాంతితో ఉండేలా బాబా చేసారు. ఇప్పుడు మా కుటుంబసభ్యులందరం బాబాని నమ్మి కొలుస్తున్నాము. నాకు ఇప్పుడు బాబాయే తల్లి, తండ్రి. నేను ఆయన్నే నమ్ముకుంటున్నాను. ఎంత నమ్మకం అంటే బాబాయే నా జీవితం, ఆయనే నా సంతోషం అన్నంతగా. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా నాకు ఇప్పుడు సాయిబాబానే. నా సాయితండ్రికి చెప్పినంతనే బాధలను తీర్చి నన్ను ఆనందంగా ఉంచుతున్నారు.


2023, నవంబర్ 12న రెండు సంవత్సరాల నా మనవరాలు బాగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడింది. చిన్నపాపని నేనలా చూడలేకపోయాను. పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తూ మధ్య దారిలో  సాయిబాబా గుడికి వెళ్లి, "బాబా! పాపకి త్వరగా తగ్గిపోతే, మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో జ్వరం, జలుబు, దగ్గు తగ్గిపోయి పాప చక్కగా ఆడుకుంది. అలా బాబా మా మనవరాలికి మంచి ఆరోగ్యం ప్రసాదించారు. నిజంగా సాయిబాబా ఉన్నారు. ఆయన్ని తలుచుకుంటే చాలు, ఆయన నా పక్కనే ఉన్నట్లు ఉంటుంది. "ధన్యవాదాలు సాయితండ్రీ. నాకున్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేర్చు తండ్రీ. మీరు నా ఆ కోరికను తీరుస్తారని నమ్మకంతో, సహనంతో, ఓర్పుతో ఉన్నాను తండ్రీ". నా కోరికను తీర్చమని సాయితండ్రికి చెప్పాల్సిందిగా సాయిబంధువులందరికీ మనవి చేసుకుంటున్నాను.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


దివ్యపూజ చేస్తాననుకున్న రోజే లభించిన బాబా అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! శ్రీసాయి దివ్య చరణాలకు నమస్కారలు. నా పేరు ప్రమీల. నేను సాయి అనుగ్రహం వల్ల చాలా మేలు పొందాను. మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఒక ఉద్యోగానికి ఎంపికైంది. కానీ నెలలు గడుస్తున్నా జాయినింగ్ ఆర్డర్స్ రాలేదు. చివరికి నేను, "త్వరగా ఆర్డర్స్ రావాల"ని బాబాకి మొక్కుకొని 'సాయి దివ్యపూజ' చేయాలని నిశ్చయించుకున్నాను. నేను 2023, డిసెంబర్ 28, గురువారం సాయి దివ్యపూజ మొదలుపెట్టాలనుకోగా అదేరోజు మా అమ్మాయి, "ఆర్డర్స్ వచ్చాయ"ని చెప్పింది. అది విని నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే సాయి దివ్యపూజ 21 వారాలు చేస్తానని సంకల్పించుకొని పూజ చేసాను. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అనుగ్రహం ఎల్లవేళలా మాపై ఉండాలి తండ్రీ".


ప్రార్థించినంతనే అనుకూలంగా మార్చిన బాబా


నేను ఒక సాయి భక్తుడిని. 11ఏళ్ల క్రితం నేను నా జూనియర్‌కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాను. తను నా సహాయం పొందాక నాకు దూరం జరిగి నేను ఏ సహాయం అడిగినా చేయకపోవడమే కాకుండా నా గురించి తప్పుడు ప్రచారం చేశాడు. ఈ విషయమంతా అతని సోదరుడే ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాకు చాలా బాధేసి, "నాకు సహాయం చేయమ"ని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల కొద్దిరోజుల్లో నాకు అతనితో స్నేహం కుదిరి ఒకరికొకరం మంచిగా సహాయం చేసుకోసాగాము. కానీ మళ్లీ హఠాత్తుగా అతనిలో మార్పు వచ్చింది. అప్పుడు నేను, "బాబా! అతను నాపట్ల అలా ఉండొద్దు. నాకు సహాయం చేసే విధంగా ఉండాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా చేసిన చమత్కారం చూడండి. రెండురోజుల్లో అతను నా సహాయం తీసుకొని, నాకు కూడా సహాయం చేశాడు. ఇప్పుడు మునపటిలా మళ్లీ మా ఇద్దరికీ స్నేహం కుదిరింది. అంతా సాయి దయ. "ధన్యవాదాలు బాబా. ఇకముందు మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉండేలా అనుగ్రహించండి బాబా".


24 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  4. Omsaisri Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  5. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  7. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  9. Baba, bless Aishwarya 🙏🙏

    ReplyDelete
  10. I am totally surrendering at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  11. Om sai ram, amma health bagunde la chudu tandri

    ReplyDelete
  12. Om Sri Sai Raksha 🙏🙏🙏. Please bless my daughter, Bhagwan 🙏🙏🙏

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  15. saibaba, maa madava bharam antha meede baba. Tammudiki manchi udyogam ravali baba. maa attagariki naa meeda kopam povali baba.

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  17. Baba ,naa thappulu emaina vunte kashaminchi mammalni anugrahinchandi please...Na valla migatha vallaki bhada vesthundi nannu nammina vallu ebbandi paduthunnaru.... Meru dayatho vallaki naa valla kaligina kastam nundi bayataki vachela cheyandi please 🥺🥺🥺🥺🥺

    ReplyDelete
  18. Baba ma pillalu bagundali baba please

    ReplyDelete
  19. Baba bless my child 🙏 ❤

    ReplyDelete
  20. Baba ennalu swamy e pariksha mammulanu mee daya hrudayam to mammulanu kalapandi Baba nenu mimmulanu namminanu baba eka anta needaya baba 🙏🙏🙏🙏om sai Ram 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo