1. బాబా ఎంతటి దయామయుడు!
2. ప్రతి చిన్న సమస్యను తీరుస్తున్న బాబా
బాబా ఎంతటి దయామయుడు!
నా పేరు శ్రీనివాసరావు. నేను మా చిన్న కుమారునికి పీజీ మెడికల్ సీటు వస్తే శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల మా కుమారునికి మంచి కాలేజీలో పీజీ మెడికల్ సీటు వచ్చింది(ఆ అనుభవాన్ని ఇదివరకే మీతో పంచుకున్నాను). తర్వాత నేను, నా భార్య పద్మావతి శిరిడీ వెళదామని 2023, డిసెంబర్ నెలలో ట్రైన్ టికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్న నా మిత్రునికి చెప్పి, సహాయం చేయమని అడిగాను. నా మిత్రుడి ద్వారా కూడా డిసెంబర్ నెలలో టికెట్లు దొరకలేదు. కానీ అతను 2024, జనవరి 3న శిరిడీ వెళ్లి, 5న తిరిగి వచ్చేలా టికెట్లు బుక్ చేశాడు. దాంతో మేము జనవరి 3న బయలుదేరి 4వ తేదీన శిరిడీ చేరుకొని నా తండ్రి బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా దయతో 10 నిమిషాలపాటు తమకు ఎదురుగా నిల్చొని ప్రశాంతంగా తమను దర్శించుకొని అవకాశమిచ్చారు. తర్వాత ఆలోచిస్తే, కొత్త సంవత్సరంలో బాబా తమను దర్శించుకునే అవకాశమిచ్చారని అర్థమై బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఆ రోజు గురువారం. పారాయణ గ్రూపులో ఉన్న నేను, నా భార్య ఆరోజు చేయాల్సిన పారాయణను శిరిడీలోని బాబా సన్నిధిలో పూర్తి చేసాము. గురువారం తమ సన్నిధికి రప్పించుకొని ఆ గొప్ప అవకాశాన్ని బాబా మాకు ఇచ్చారు. ఇకపోతే, నేను రోజూ 'శ్రీసాయి స్తవనమంజరి' చదువుతాను. ఆ నియమం ప్రకారం ఆ రోజు సాయి సన్నిధిలో చదువుదామని తెలుగు పుస్తకం కోసం అక్కడ(పారాయణ హాల్) అంతా వెతికాను. కానీ అక్కడ మరాఠీ, హిందీ పుస్తకాలు తప్ప తెలుగు పుస్తకం ఒక్కటి కూడా దొరకలేదు. అందువల్ల నేను చాలా నిరాశ చెంది, "బాబా! తెలుగు పుస్తకం దొరికేట్టు చేయండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, సమీపంలో ఉన్న ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి అక్కడున్న పుస్తకాలలో నుండి ఒక తెలుగు పుస్తకం తీసి నాకు ఇచ్చారు. నేను చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎందుకంటే, నేను అక్కడున్న పుస్తకాలన్నీ వెతికాను. ఒక్క తెలుగు పుస్తకం కూడా కనబడలేదు. అలాంటిది నేను అడగకుండానే ఆ పెద్దాయన వచ్చి నాకు ఆ పుస్తకం ఇచ్చాడు. పైగా అతను తెలుగువాడు కాదు, మరాఠీ అతను. ఆ రూపంలో నా తండ్రే వచ్చి నాకు సహాయం చేశారని నా నమ్మకం. నేను సంతోషంగా స్తవనమంజరి పఠించాను. అదేరోజు రాత్రి చావడి ఉత్సవాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశాన్ని కూడా బాబా మాకు ఇచ్చారు. మరుసటిరోజు 5వ తేదీ, ఉదయం 6గంటలకు మేము బాబా దర్శనానికి వెళితే బాబా చక్కటి దర్శనాన్ని ప్రసాదించారు. తరువాత మేము బయటకు వచ్చి గురుస్తాన్ వద్దకి వెళ్ళాము. నేను నా మనసులో, "బాబా! మీరు మా వెంట ఉంటే, వేపాకు దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తర్వాత నేను, నా భార్య ప్రదక్షిణ మొదలుపెట్టాము. దాదాపు సగానికి పైగా ప్రదక్షిణ పూర్తైన సమయంలో నేను మనసులో, "బాబా! మా ప్రదక్షిణ పూర్తి కావొస్తుంది. మీరో మాతోనే ఉంటే వేపాకు దొరికేలా చేసి మీరున్నారని నిరూపించు తండ్రీ" అని వేడుకున్నాను. తర్వాత ప్రదక్షిణ మరో రెండు అడుగులలో పూర్తవుతుందనగా చెట్టుపై నుండి ఒక వేపాకు నా భార్య తలపై రాలుతూ నా కంటపడింది. వెంటనే నేను ఆ ఆకును గాలిలోనే దొరకపుచ్చుకున్నాను. బాబా ఎంతటి దయామయుడు. 'నేను మీతోనే ఉన్నాన'ని నాకు ఋజువు ఇచ్చారు. ఆ తర్వాత మరో రెండుసార్లు బాబా దర్శనం చేసుకొని మధ్యాహ్నం 12.50కి మా తిరుగు ప్రయాణం ట్రైన్ ఉండటంతో మా గదికి వెళ్ళాము. తీరా గది ఖాళీ చేద్దామంటే గది తాలూకు రశీదు కనపడలేదు. మేము చాలా కంగారుపడ్డాము. ఎందుకంటే, మేము శిరిడీ నుండి నగర్సోల్ వెళ్లి 12.50కి ట్రైన్ ఎక్కాల్సి ఉండగా అప్పటికే ఉదయం 11 అయింది. గది ఇచ్చినవాళ్లు ఇబ్బందిపెడతారేమోనని చాలా భయపడ్డాను. సరిగ్గా అప్పుడే బాబా చేసిన ఒక పెద్ద మిరాకిల్ గుర్తొచ్చింది. అదేమిటంటే, ముందురోజు 4వ తేదీన బాబా దర్శనానంతరం మేము మా గదికి వచ్చి పడుకునే ముందు నాకు ఎందుకోగాని గది తాలూకు రశీదు ఫోటో తీద్దామనిపించి ఫోన్లో ఫోటో తీశాను. దాన్ని చూపిస్తే గది ఖాళీ చేయడానికి ఏ ఇబ్బంది పెట్టకుండా ఒప్పుకున్నారు. ముందురోజు నేను ఆ రశీదు ఫోటో తీయకుంటే చాలా ఇబ్బందిపడేవాళ్ళము. బాబానే మరుసటిరోజు రానున్న ఇబ్బందికి, ముందురోజే ఆ ప్రేరణనిచ్చి సహాయం చేసారని అర్దమై నాకు రోమాంచితమైంది. వెంటనే ఒక వ్యాన్ మాట్లాడుకొని నగర్సోల్‌కి బయలుదేరాము. మధ్య దారిలో ఓ చోట వేరే వాహనాలు ప్రమాదానికి గురికావడం వల్ల మేము వెరే దారిలో ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడు నేను, “ట్రైన్ అందేలా చూడమ”ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మేము స్టేషన్‌కి చేరుకొని ట్రైన్ ఎక్కిన 5 నిమిషాలకి ట్రైన్ కదిలింది. బాబా దయ లేకుంటే మేము ట్రైన్ తప్పిపోయేవాళ్ళము. ఇలా బాబా అడుగడుగునా మాతో ఉన్నామని నిరూపిస్తూ చక్కటి దర్శనాన్ని అనుగ్రహించి మా శిరిడీయాత్రను పూర్తిచేయించి, క్షేమంగా తిరిగి మా ఇంటికి చేర్చారు. మా పిల్లల విషయంలో ఎంతో సహాయం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలానే తమ సహాయాన్ని అందిచమని, పిల్లలకి మంచి బుద్ధి, భవిష్యత్ ఇవ్వమని, మా అందరి ఆరోగ్యాలు బాగుండేలా, అలాగే బంధుమిత్రులు అందరూ మంచిగా ఉండేటట్లు దీవించమని ఆ తండ్రి బాబాని వేడుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా"
ప్రతి చిన్న సమస్యను తీరుస్తున్న బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
సాయిబంధువులంధకీ నమస్కారం. నా పేరు సౌజన్య. మాకు మూడున్నర సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. తనకి బాబా అంటే చాలా ఇష్టం. తనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాస్తానంటే తను, "అమ్మా! బాబా నా దెబ్బ తీసేస్తాడు" అని తన బుజ్జి మాటలతో చెప్తాడు. ఇంత చిన్న వయసులోనే మా బాబు బాబా అనుగ్రహం పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి మా బాబు హఠాత్తుగా నిద్రలేచి ఏడ్చాడు. పడుకోమంటే నొప్పి వస్తుందని ఏడ్చాడు. ఆ నొప్పి ఏమిటో సరిగా చెప్పలేకపోయాడు. నేను వెంటనే, "బాబా! నా బాబు ఏడవకుండా మంచిగా నిద్రపోయేలా చూడు" అని బాబాని ప్రార్థించాను. ఒక అరగంటలో బాబు పడుకున్నాడు.
2024, దసరా సెలవులకి ముందు ఏడవకుండా మంచిగా స్కూలుకి వెళ్ళే మా బాబు సెలవుల తర్వాత ఒక 15 రోజులు వరకు స్కూలుకి వెళ్లాలంటే ఏడ్చేవాడు. అప్పుడు నేను, "బాబా! నా బాబు ఏడ్వకుండా స్కూలుకి వెళితే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజే బాబు ఏడవకుండా స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇది బాబా దయకాక ఇంకేంటి?.
ఒకరోజు రాత్రి నాకు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల చెస్ట్‌లో నొప్పి వచ్చింది. అప్పుడు నేను నమ్మకంతో బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయవల్ల నొప్పి తగిపోయింది. "బాబా! ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ సదా మమ్మల్ని కాపాడుతునందుకు వేల కోటి నమస్కారాలు".
Meeru kakapote ma samasyalanu inkevaru teerchagalaru thandri!!! Annintiki meere unnaru baba!! Meeru kakapote maku dikkevaru Sai. Sada mamalni ilage kaapatudu undandi!! Om SaiRam??
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteBaba, bless Aishwarya 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, I am totally surrendered at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteBaba thagudu mani pinchu thandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam🙏
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏 Raksha Raksha Sri Sai raksha
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteKaapadu thandri nine nammukunnanu baba🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba pillalaki mere raksha baba
ReplyDeleteBaba ,naa situations ni edurkune paristhiti maku prasadinchandi thandri....Mee padale dikku Naku karuninchi anugrahinchandi Baba🥺🥺🥺🥺🥺
ReplyDeletesaibaba, maa sai madava bharam antha meede baba. Tammudiki manch udyogam vachhelaga cheyandi baba.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDelete