సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నారాయణ కృష్ణ పెండ్సే


నారాయణ కృష్ణ పెండ్సే కు  ఒకసారి "సాయిబాబా" చూపించిన చమత్కార లీల కధను చదవండి.

పెండ్సే భార్య పరమ సాధ్వి. భావికురాలు. ఉదార హ్రదయం గలది. ఆమెకు సాయిబాబా యొక్క సందర్శనాన్ని చేసుకోవలెనని కోరిక కల్గింది. ఆమె తన భర్తకి నమస్కరించి “షిర్డిలో  సాయిబాబా అనే మహాత్ములున్నారని, వారి దర్శన భాగ్యం శుభమని అందరు అనుకుంటుంటే వింటున్నాం కదా. మనముభయులం కూడా ఆ గ్రామానికి వెళ్లి ఆ సత్పురుషుని చరణాలలో లీనమైపోదాం” అని మనవి చేసింది. పెండ్సే ఆమెతో “చూడు! షిర్డిలో గొప్ప మహత్యం గల సత్పురుషులు ఎవరూ  లేరు. అతడు ఒక మహమ్మదీయుడు, వెఱ్రి వెంగలప్ప వలే ఉంటూ దొంగ నాటకాలు, దొంగ వేషాలు వేసి ప్రజలను దోపిడీ చేయాలని అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు. అజ్ఞానులు  అతన్ని దేవునివలె ఆరాధిస్తున్నారు అంతే అక్కడ ఇంకా ఏమిలేదు. నువ్వు మొండి పట్టు పట్టకు. నా మాట విను. ఎక్కడైనా ఉప్పులో మధురత్వం ఉండగలదా? రేకు ముక్క బంగారం కాగలదా చెప్పు! నువ్వు అతని పిచ్చిలో పడకు. అతడు షిర్డిలో ఇంటింటా రొట్టె ముక్కలను అడుక్కుని తన పొట్ట నింపుకునే భికారి” అని చెప్పారు. అయినా ఆ సాద్వి మనసు కుదుట పడలేదు. 

ఆమె సాయిబాబా పాదాలలో మస్తాకాన్నుంచడం ఎప్పుడెప్పుడా అని ఎంతో తపన పడిపోసాగింది.  ఆమె భాగ్యం పండింది. బాబాకు దయ కలిగింది. పెండ్సే ప్రభుత్వ పని మీద షిర్డీ వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల శాంత మూర్తి గుణవతి అయిన తన భార్యను వెంటబెట్టుకుని షిర్డీ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ప్రభుత్వ కార్యాలయం పనిలో మునిగిపోయాడు. కాని ఆ సాద్వి తన కార్యాన్ని సాధించుకుంది. సాయినాధుని దర్శనం చేసుకొని వారి పాదాలపై మస్తకాన్ని  అర్పించింది. ఆమె మనసులోని తపన పోయి ఆమెకు శాంతి చేకూరింది. ఆ విచిత్రానుభూతిని భర్తకి తెలియజేస్తూ నేను సాయి దర్శన భాగ్యాన్ని పొంది వచ్చాను. నిజంగా వారు గొప్ప పుణ్యరాసి. ఆ మహాత్ముని నిందించకండి. వెళ్లి వారిని దర్శించుకోండని ప్రార్ధించింది. 

భార్య బలవంతం మీద అప్పా కులకర్ణి తోపాటు పెండ్సే సాయి దర్శనానికి వెళ్లారు. అతనిని చూచిన వెంటనే సాయి మహారాజు “ఇక్కడికి ఎవరూ రాకండి. వచ్చారంటే రాయి పుచ్చుకొని కొడతాను. నేనొక బూటకపు మనిషిని. వెఱ్రి వాణ్ణి. హీనమైన ముసల్మాను జాతివాణ్ణి నా దర్శనానికి రావద్దు. మీ ఉచ్చమైన బ్రాహ్మణ వర్ణం మైల పడిపోతుంది” అంటూ గర్జించారు. పెండ్సే మనసు కరిగిపోయింది. ఈ మహారాజు నిజంగా త్రికాలజ్ఞుడు, జ్ఞానరాసి. నేను అన్నదంతా వీరికి తెలిసిపోయింది. వాయుదేవుడు సర్వత్ర వ్యాపించి ఉన్నట్టు వీరి జ్ఞానం సర్వవ్యాప్తమై ఉందని అర్ధం చేసుకున్నారు. ఈ విధంగా అప్పా సహాయంతో సాయి సత్పురుషుని సందర్శన లాభాన్ని పొందారు.

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 31

1 comment:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo