హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇంకా ఇలా తెలియజేస్తున్నారు...
ప్రతి చిన్న కోరికను నెరవేర్చే కరుణామూర్తి శ్రీసాయి:-
ఆ రెండు రోజులలో బాబా సమాధి, ద్వారకామాయి, చావడిల దర్శనాలు బాగా జరిగాయి. కానీ శరత్‌బాబూజీగారి సాయిపథం, లక్ష్మీబాయిషిండే ఇల్లు, మహల్సాపతి ఇల్లు, శ్యామా ఇల్లు చూడటం కుదరలేదు. ముఖ్యంగా, సాయిపథం దర్శించలేదని చాలా బాధగా అనిపించింది. నిజానికి నేను శిరిడీ వెళ్ళినరోజే నాకు తెలిసిన ఒక సాయిబంధువుకు ఫోన్ చేసి, 'సాయిపథంకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది?' అని వివరాలు తెలుసుకున్నాను. కానీ సాయిపథం దర్శించలేకపోయాను. సరే, ఇప్పుడు కుదరలేదు, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాను. సాయంత్రం 6 గంటలకు బస్సు ఎక్కడానికి ట్రావెల్స్ దగ్గరకి వచ్చాము. వాళ్లు, "బస్సులో ఎ.సి. పనిచేయటం లేదు" అన్నారు. 'చిన్నపిల్లలతో ఎ.సి. లేకుండా ఎలా వెళ్తామ'ని అందరూ పెద్ద గొడవ చేశారు. ట్రావెల్స్ వాళ్లకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మేము పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు మరుసటిరోజు, అంటే 17వ తేదీ ఉదయానికి బస్సు సిద్ధం చేయమని ట్రావెల్స్ వాళ్లకి చెప్పి ఒప్పించారు. అందరూ 'ఏమిటి ఇలా అయ్యింది?' అని అనుకుంటూ ఉంటే, నాకు మాత్రం 'బాబాని మళ్ళీ దర్శించుకోవచ్చు' అని చాలా హ్యాపీగా ఉంది. కానీ, 'బస్సు ఉదయం కాకుండా సాయంత్రం ఉంటే, అప్పుడు ఉదయం కూడా బాబాని దర్శించుకోవచ్చు, వీలైతే నేను చూడాలనుకున్నవన్నీ చూడొచ్చ'ని అనుకున్నాను. అదే బాబాకి చెప్పుకొని పడుకున్నాను. ఉదయాన ట్రావెల్స్ వాళ్లు, 'బస్సు సాయంత్రం బయలుదేరుతుంది' అని అన్నారు. బాబా నా కోరిక మన్నించారని నేను హ్యాపీగా ఖండోబా మందిరం, సాయిపథం, సాయిభక్తుల ఇళ్ళు అన్నీ చూసుకుని, మళ్ళీ ఒకసారి సమాధిమందిరం, ద్వారకామాయి, చావడి దర్శించుకున్నాను. చాలా ఆనందం పొందాను. సాయిపథంలో చాలా ప్రశాంతంగా అనిపించింది.
తొలిసారి 'నందదీప' దర్శనం:-
తరువాత మందిర ప్రాంగణం నుండి బయటకు వచ్చేశాం. అప్పుడు నాకు ఇంకొక్కసారి లెండీతోటకు వెళ్దామనిపించి సెక్యూరిటీ అతన్ని అడిగితే, అతను 4వ నెంబర్ గేటుగుండా లోపలకి పంపించారు. లెండీతోట అంతా చూసుకుంటూ ఒకవైపుగా వెళ్ళినప్పుడు, అక్కడ రావిచెట్టు, వేపచెట్టు మరియు అక్కడ ఒక దీపాన్ని చూశాను. అక్కడ బోర్డు చూస్తే 'నందదీపం' అని ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అప్పటివరకు నందదీపం అంటే గురుస్థాన్ వద్ద ఉన్న దీపమనే అనుకునేదాన్ని. ఆ రెండూ వేరువేరు అని నాకు అస్సలు తెలియదు. కానీ ఇన్నాళ్ళకు, అదీ శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యే క్షణంలో బాబా తమ స్వహస్తాలతో వెలిగించిన ఆ పవిత్రజ్యోతిని నాకు చూపించి, నా అజ్ఞానాన్ని తొలగించి నన్ను ధన్యురాలిని చేశారు. మనం ఏదీ ఆయనను అడగకుండానే, చిన్నపిల్లాడి చేయిపట్టుకొని అన్నీ చూపించినట్లు మనకు చూపిస్తారు. అంతటి ప్రేమమూర్తి మన బాబా.
అలా ఒక్కరోజు అనుకున్న మా శిరిడీ ప్రయాణం 3 రోజులు అయ్యింది. అపుడు అనిపించింది, కూతురి పెళ్ళిచేసిన బాబా వెంటనే తనను ఎలా పంపిస్తాడు? అందుకే అమ్మ లాంటి బాబా తన దగ్గర కూతురుని 3 రోజులు వుంచుకుని పంపారు. చక్కగా ఆయన రూపం కళ్లలో నింపుకుని ఆనందంతో తిరిగి వచ్చాను. మరో విషయం, ఎప్పుడూ విపరీతమైన అల్లరి చేసే మా పిల్లలు కూడా శిరిడీలో అల్లరి చేయలేదు. చాలా చక్కగా ఉన్నారు.
బాబా చక్కటి భోజనం పెట్టించారు:-
బాబా అనుగ్రహంతో వేళ కాని వేళ గురువుగారి బుక్స్ అనుగ్రహించుట:-
ఉదయం సాయిపథానికి వెళ్ళినప్పుడు గురువుగారి బుక్స్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ అక్కడ బుక్ స్టాల్ తెరచిలేదు. నేను ఫోన్ చేసి ఒక సాయిబంధువును అడిగితే, సాయిపథంలో సత్సంగం ఉన్న సమయాలలో (అంటే, ఉదయం 9 నుండి 10.30 మరియు సాయంత్రం 6 నుండి 8) బుక్ స్టాల్ తెరచి ఉంటుందని చెప్పారు. నాకు ఆ సమయాలలో వెళ్ళే అవకాశం లేదు. సరే, 'వీలైతే మధ్యాహ్నం ఒకసారి వెళ్తాను, బాబా అనుగ్రహం ఉంటే బుక్స్ దొరుకుతాయి' అని అనుకున్నాను. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాయిపథానికి మళ్ళీ వెళ్లాను. బుక్ స్టాల్ మూసివేసి ఉంది. దానితో నేను చాలా నిరాశచెందాను. అక్కడ సాయిపథంలో ఒక అబ్బాయి ఉంటే తనని అడిగాను, 'స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు?' అని. తను, "సాయంత్రం 4 తరువాతే తీస్తారు, ఈ సమయంలో అసలు తీయరు" అని చెప్పాడు. "సాయంత్రం బస్సుకి మేము వెళ్ళిపోతున్నాం, అందువలన నాకు మళ్ళీ రావడం కుదరదు" అని చెప్పాను. అప్పుడతను, 'సరే, ఇలా రండి!' అని ఒక ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక అతను భోజనం చేస్తూ ఉన్నారు. అతనితో బుక్స్ కావాలని అడిగితే, 'ఇప్పుడు కుదరదు' అన్నారు. అప్పుడు నేను, "సాయంత్రం ఊరికి వెళ్లిపోవాలి, మళ్ళీ రాలేను. నాకు గురువుగారి బుక్స్ కావాలని ఆశగా వచ్చాను" అని చెపితే, అతను ఒక 15 నిమషాలు వేచి ఉండమన్నారు. తరువాత కొద్దిసేపట్లో అతను వచ్చి బుక్ స్టాల్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన బుక్స్ అందించారు. నాకు ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేను. ఎంతో ఆశపడ్డ గురువుగారి బుక్స్‌ను బాబా అనుగ్రహించారు. సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.బాబా ఇచ్చిన వేపాకులు:-
తరువాత మళ్ళీ లంచ్ చేసిన తరువాత అందరం సమాధిమందిరం దర్శనానికి వెళ్ళాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తరువాత మావారికి గురుస్థాన్‌లో ఉండే వేపచెట్టు ఆకుల యొక్క విశిష్టత గురించి చెబుతూ, "ఇంతవరకు ఒక్క ఆకు కూడా దొరకలేదు" అన్నాను. అప్పుడు మావారు, "కొంచెంసేపు గురుస్థాన్ దగ్గర కూర్చుందాం" అన్నారు. మేము కూర్చున్న తరువాత నేను, 'బాబా! ఇప్పటివరకు ఒక్క వేపాకు కూడా దొరకలేదు, కనీసం ఒక్క ఆకు దొరికినా అదృష్టం కదా' అని అనుకున్నాను. అలా అనుకున్న కాసేపటికి పెద్దగా గాలి వీచింది. చాలా ఆకులు క్రింద రాలాయి. కానీ మావారు, "ఇవి చెట్టు నుండి రాలినవి కావు. రేకుల పైన, నెట్ పైన ఉన్నవి క్రింద పడ్డాయి" అన్నారు. అంతే! మరుక్షణం మళ్ళీ పెద్దగాలి వీచింది. దానితో చెట్టు నుండి పచ్చటి ఫ్రెష్ ఆకులు క్రింద పడ్డాయి. మావారు, "అర్చనా! బాబా నీ ప్రతి కోరికా తీర్చేస్తున్నారు" అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను, మావారు, మా బాబు చాలా వేపాకులు తెచ్చుకున్నాము.తొలిసారి 'నందదీప' దర్శనం:-
తరువాత మందిర ప్రాంగణం నుండి బయటకు వచ్చేశాం. అప్పుడు నాకు ఇంకొక్కసారి లెండీతోటకు వెళ్దామనిపించి సెక్యూరిటీ అతన్ని అడిగితే, అతను 4వ నెంబర్ గేటుగుండా లోపలకి పంపించారు. లెండీతోట అంతా చూసుకుంటూ ఒకవైపుగా వెళ్ళినప్పుడు, అక్కడ రావిచెట్టు, వేపచెట్టు మరియు అక్కడ ఒక దీపాన్ని చూశాను. అక్కడ బోర్డు చూస్తే 'నందదీపం' అని ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అప్పటివరకు నందదీపం అంటే గురుస్థాన్ వద్ద ఉన్న దీపమనే అనుకునేదాన్ని. ఆ రెండూ వేరువేరు అని నాకు అస్సలు తెలియదు. కానీ ఇన్నాళ్ళకు, అదీ శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యే క్షణంలో బాబా తమ స్వహస్తాలతో వెలిగించిన ఆ పవిత్రజ్యోతిని నాకు చూపించి, నా అజ్ఞానాన్ని తొలగించి నన్ను ధన్యురాలిని చేశారు. మనం ఏదీ ఆయనను అడగకుండానే, చిన్నపిల్లాడి చేయిపట్టుకొని అన్నీ చూపించినట్లు మనకు చూపిస్తారు. అంతటి ప్రేమమూర్తి మన బాబా.
అలా ఒక్కరోజు అనుకున్న మా శిరిడీ ప్రయాణం 3 రోజులు అయ్యింది. అపుడు అనిపించింది, కూతురి పెళ్ళిచేసిన బాబా వెంటనే తనను ఎలా పంపిస్తాడు? అందుకే అమ్మ లాంటి బాబా తన దగ్గర కూతురుని 3 రోజులు వుంచుకుని పంపారు. చక్కగా ఆయన రూపం కళ్లలో నింపుకుని ఆనందంతో తిరిగి వచ్చాను. మరో విషయం, ఎప్పుడూ విపరీతమైన అల్లరి చేసే మా పిల్లలు కూడా శిరిడీలో అల్లరి చేయలేదు. చాలా చక్కగా ఉన్నారు.
బాబా చక్కటి భోజనం పెట్టించారు:-
నేను ప్రతి గురువారం 6 గంటలకి మా ఇంటికి దగ్గరగా ఉండే బాబా గుడిలో పల్లకి సేవకి వెళ్తూ ఉంటాను. సాధారణంగా నేను ఇంటినుండి వర్క్ చేస్తూ ఉండటం వలన సాయంత్రం 6 గంటలకి కాల్స్ అయిపోయిన తరువాత గుడికి వెళ్లి ఒక గంటసేపు ఉండి వస్తాను. ఏప్రిల్ 26న పిల్లలు లేకపోవటం వలన ఆఫీసుకి వెళ్లాను. ఆఫీస్ నించి ఇంటికి వెళ్ళటానికి ఒక గంట సమయం పడుతుంది. ఆరోజు బాబా నాకోసం కాల్స్ తొందరగా ముగించారు. 5 గంటలకే కాల్ అయిపోయింది. అపుడు బయలుదేరితే పల్లకి సేవ టైంకి వెళ్ళగలను. కానీ ఆఫీసులో ఇంకా ఏదో పని చెయ్యాలని వెళ్ళలేదు. ఇక చూడండి, ఒక గంటసేపు ఎంత కష్టపడ్డా ప్రోగ్రాంలో ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు, "ఎపుడూ వెళ్ళే బాబా పల్లకి సేవకి వెళ్ళలేదు, అందుకే వర్క్ అవటం లేదు" అని అనిపించింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా బాబాను చూడాలని ఆఫీసు నుండి బయలుదేరాను. వెళ్ళేదాకా ఏమీ తినకుండా, గుడిలో బాబా ప్రసాదం తినాలని నా కోరిక. దారిలో, "బాబా! అందరికీ అన్నం పెడతావు, నీ బిడ్డల్ని పస్తులు ఉండనివ్వవు కదా! మరి నేను ఇంటికి వెళ్ళగానే మంచి ఫుడ్ పెడతావా?" అని అనుకున్నాను. గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని ప్రసాదం తిన్నాను. తరువాత ఇంటికి వచ్చేసరికి మా ఫ్లోర్‌లో చిన్నపాప పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆ పాప వాళ్ళ అమ్మ నన్ను రమ్మని పిలిచింది. సాధారణంగా మా అపార్ట్‌మెంట్‌లో పుట్టినరోజు ఫంక్షన్లు ఎవరు చేసినా భోజనం పెట్టరు. అలాంటిది ఆవిడ నాకు పఫ్, కేకు, చిప్స్‌తో పాటు అన్నం కూడా తినమని బలవంతం చేసింది. దారిలో నేను అనుకున్నానుగా, బాబా నాకు చక్కటి భోజనం పెట్టించారు.