సాయి వచనం:-
'అందరూ భగవదంశలే! అందువల్ల ఎవరూ ఎవరినీ ద్వేషించకూడదు. అందరిలోనూ ఈశ్వరుడు వసిస్తాడు. ఇది మరువవద్దు.'

'మనస్సు వివిధ రూపాలు ధరించడం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేదా బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుంది' - శ్రీబాబూజీ.

దామోదర్ నారాయణ్ సబ్నిస్


1913లో దామోదర్ నారాయణ్ సబ్నిస్‌ అనే భక్తుడు అహ్మద్‌నగర్‌లో మామల్తదారుగా (రెవెన్యూ అధికారిగా) పనిచేస్తుండేవాడు. అతను మెండుగా ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండి, సాధుసత్పురుషుల దర్శనాన్ని ఇష్టపడేవాడు. అతడు తరచూ సంగమనేర్, కోపర్‌గాఁవ్, శిరిడీ సందర్శిస్తుండేవాడు. తనతో పాటు తన కుటుంబాన్ని గూడా శిరిడీ తీసుకొస్తుండేవాడు. అక్కడినుండి అతను పనిమీద సాకోరి తదితర పొరుగు గ్రామాలకు వెళ్తుండేవాడు. కుటుంబం మాత్రం శిరిడీలోనే ఉండేది. అప్పటికి చాలా చిన్నపిల్ల అయిన అతని కుమార్తె శాంతాబాయి బాబాతో ఆడుకునేది.

ఒకసారి శాంతాబాయి మామయ్య అనారోగ్యం పాలయ్యాడు. అతనిని చూడటానికి వెళ్లేందుకు శాంతాబాయి తల్లి బాబాను అనుమతి అడిగింది. అప్పుడు బాబా, "చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు వెళ్ళడం ఎందుకు?" అన్నారు. బాబా ఆ మాటలన్న సమయంలోనే తన సోదరుడు చనిపోయాడని తరువాత ఆమెకు తెలిసింది.

ఒకసారి దామోదర్‌కు రాహురిలో అత్యవసమైన పని ఉండి, బయలుదేరడానికి బాబాను అనుమతి అడిగాడు. బాబా తమ చేతిని పైకెత్తి సైగల ద్వారా వెళ్లవద్దని సూచించారు. కానీ అతను బాబా సలహాను పట్టించుకోకుండా గుర్రపుబండిలో బయలుదేరి వెళ్ళాడు. గుర్రాలు వేగంగా పరుగుతీయడంతో కొద్దిసేపటి తరువాత బండి బోల్తాపడి అతను ముందు చక్రాల ముందుపడ్డాడు. అదేసమయంలో ద్వారకమాయిలో ఉన్న బాబా ఎటువంటి కారణం లేకుండా అరుస్తూ తిట్టసాగారు. బాబా దయవల్ల దామోదర్ మరణం నుండి తప్పించుకొని కేవలం గాయాలతో బయటపడ్డాడు.

రేపటి భాగంలో శాంతాబాయి అనుభవాలు... 

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1984 (దీపావళి ఇష్యూ).
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ.

9 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya ssi🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om sai Sri Sai jaya jaya sai
    Om sai Sri Sai jaya jaya sai
    Om sai Sri Sai jaya jaya sai
    Om sai Sri Sai jaya jaya sai
    Om sai Sri Sai jaya jaya sai,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om sai ram anni vishayallo anta bagunde la chayandi, andaru bagunde la chayandi tandri pls.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo