సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాపూరావు బోరవ్కే


బాపూరావు బోరవ్కే చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అతని వయస్సును అవకాశంగా చేసుకొని అతని బంధువులు తన పూర్వీకుల ఆస్తిని దుర్వినియోగం చేశారు. ఫలితంగా అతడు SSC పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కోసం ఎదురుచూడవలసి వచ్చింది.

అతనికి ఉన్న ఒకే ఒక బంధువు, సాయిబాబా భక్తుడు అయిన అతని మేనమామ షిర్డీలో ఉండేవాడు. అందువలన బాపూరావు శిరిడీ వెళ్ళడానికి రైలులో కోపర్గాఁవ్ వరకు వెళ్ళాడు. అతని వద్ద కేవలం మూడు అణాలు మాత్రమే మిగిలాయి. అందువలన అక్కడ నుండి టాంగాలో శిరిడీ వెళ్ళడానికి తగినంత ధనం లేక టాంగాలో స్థానాన్ని పొందలేకపోయాడు. అందువలన అతను నడుచుకుంటూ శిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకొని నమస్కారాలు అర్పించాడు.

అతని మేనమామ అతనిని చాలా బాగా ఆదరించాడు. అందుచేత అతను తన మేనమామతో ఉంటూ మేనమామ యొక్క చెఱకు పంటను అభివృద్ధి చేసాడు. దానితో పొరుగున ఉన్న పంటభూమి యజమాని బాపూరావు బోరవ్కేను భాగస్వామ్యంలోకి తీసుకున్నారు. బోరవ్కే అప్పటినుండి రెండు పంటభూములనూ చూసుకోసాగాడు. తరువాత కొన్ని సంవత్సరాలు చెఱకు పంటలు చాలా బాగా పండాయి. ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అందువలన రెండు సంవత్సరాలలోపు బాపూరావు లక్షరూపాయలు సంపాదించాడు. అదంతా శ్రీసాయిబాబా కృపవలననే సాధ్యమైందని శిరిడీ సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేసి, అందులో నారింజ మరియు బత్తాయి పంటలు అభివృద్ధి చేశాడు. అంతేగాక, ప్రతిరోజూ బాబా దర్శనం చేసుకొని తన కృతజ్ఞతలు తెలిపేందుకు వీలుగా అక్కడే ఒక బంగళాను నిర్మించుకొని స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. శిరిడీ నుండి కొన్ని ఫర్లాంగుల దూరంలో రాహతాకు వెళ్ళే మార్గంలో నేటికి కూడా పండ్లతోటలతో ఉన్న ఈ బంగ్లాని చూసి శ్రీసాయి కృపను జ్ఞాపకం చేసుకోవచ్చు.

1930లో శ్రీరామనవమి ఉత్సవాలలో, కుస్తీ ప్రదర్శన పెద్ద విజయం సాధించింది. అందుకు మూలకారణం బాపూరావు రఘోజి బోరవ్కే, తాత్యా గణపతి పాటిల్, వామన్ మన్కు, రాంచంద్రదాదా, బయాజీ సఖారం మరియు ఇతర గ్రామస్తులతో కలిసి విభేదాలు పరిష్కరించి గ్రామస్తులందరినీ ఒక్కటిగా చేయడంలో సహాయం చేశారు. బాబా దయతో పండుగ ఘనవిజయం సాధించింది. ఈ సమాచారాన్ని కీ.శే. శ్రీదాసగణు మహరాజ్ శ్రీసాయిలీలా మేగజైన్‌లో ప్రచురించబడిన 1930 శ్రీరామనవమి ఫెస్టివల్ రిపోర్టులో వెల్లడించారు.

ఈరోజు వరకు, ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శ్రీబాపూరావు బోరవ్కే వారసులు శ్రీసాయిబాబా సమాధికి మరియు శిరిడీలోని అబ్దుల్‌బాబా సమాధికి వారి పొలాల నుండి పువ్వులను అందిస్తారు.

(source: శ్రీసాయిలీలా మేగజైన్, మార్చి-ఏప్రిల్ 2011)

2 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃🌺😊🌼🌹❤🌸

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo