అప్పట్లో సంవత్సరానికి ఒకసారి భరద్వాజ్ గోత్ర గౌరవసూచకంగా మహామండలి నిర్వహించబడుతుండేది. 1915వ సంవత్సరంలో ఆ మహామండలికి అధ్యక్షత వహించి, అధ్యక్షునిగా వ్యవహరించమని శ్రీ ధబోల్కర్ ను అహ్వానించారు. ఆ విషయమై అతడు తన అలవాటు ప్రకారం బాబాను అనుమతి అడుగగా, ఆయన అనుమతించలేదు. మరుసటి సంవత్సరం కూడా బాబా తమ అనుమతినివ్వలేదు. ఇక అప్పటినుండి అతను ఆ ఆలోచన వదులుకున్నాడు. అయితే బాబా అతనికి కలలో దర్శనమిచ్చి, "వచ్చే సంవత్సరం అధ్యక్షుడిగా వ్యవహరించు" అని చెప్పి తమ అనుమతిని ప్రసాదించారు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1917లో రత్నగిరి జిల్లా, వెంగుర్ల తాలూకా బబోల్ గ్రామంలో మహామండలి నిర్వహించడానికి నిశ్చయించి దానికి అధ్యక్షునిగా వ్యవహరించమని శ్రీ ధబోల్కర్ గారిని మళ్ళీ అహ్వానించారు. అప్పటికి చాలారోజుల ముందుగానే బాబా తనకి అనుమతినిచ్చి ఉన్నందున అధ్యక్షుడిగా వ్యవహరించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు ధబోల్కర్. కానీ అతనికి పెద్ద సమస్య ఎదురైంది. అదేమిటంటే తన కూతురు మానసిక దౌర్బల్యం వల్ల ఎప్పుడూ అతనిని అంటిపెట్టుకుని ఉండేది. అతని మాట తప్ప వేరెవరి మాట ఆమె వినేది కాదు. కానీ బాబా చెప్పి ఉన్నందువల్ల బబోల్ గ్రామానికి వెళ్లి అధ్యక్షునిగా వ్యవహరించడం అతనికి తప్పనిసరి. కాబట్టి అతను ఆ కార్యక్రమానికి వెళ్లి నాలుగురోజులలో తిరిగి వచ్చాడు. అద్భుతమేమిటంటే అతను లేని నాలుగురోజులలో ఆమె మానసికి పరిస్థితి చాలా సాధారణంగా ఉండి ఒక మామూలు మనిషిలానే వ్యవహరించింది. ఆయన తిరిగి రావడంతోనే ఆమె మానసిక రోగం తిరగబెట్టింది. దానికితోడు మూర్చపోవడం కూడా మొదలైంది. ఎవరూ ఆమెను నియంత్రించలేకపోయేవారు. పైగా ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా కావడంతో ధబోల్కర్ తీవ్రంగా కలత చెందాడు. కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందోనని ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉండేవారు. దయార్ద్ర హృదయుడు, యోగక్షేమాలను చూసే ఒక తండ్రిగా తన కుమార్తెను పరీక్షించడానికి ముగ్గురు ప్రముఖ గైనకాలజిస్టులని రప్పించాడు ధబోల్కర్. వాళ్ళు ముగ్గురూ, "క్షేమంగా బిడ్డ బయటకు రావాలంటే సిజేరియన్ చేయవలసిందే, కానీ తల్లి ప్రాణానికి ప్రమాదమ"ని చెప్పారు. అది విన్న ధబోల్కర్ కు ఏమి చేయాలో తోచలేదు. ఆ మరుసటిరోజే ఒక వైద్యుడు ఎవరూ పిలవకుండానే తనంతట తానే వచ్చి, "భగవంతుని ప్రార్ధించి, ఆయన సహాయం కోరమ"ని సలహా ఇచ్చాడు. ధబోల్కర్ కి అదెంతో సులభమైన విషయం. వెంటనే అతను, "తల్లికి, బిడ్డకు సహాయం చేయండి బాబా" అని వేడుకున్నాడు. ప్రార్ధించిన కొద్దిసేపట్లో వైద్యులు, సర్జరీ అవసరం లేకుండానే ఆమెకు సుఖప్రసవం అయింది. కొంతకాలం తరువాత తల్లి, బిడ్డ శిరిడీ సందర్శించారు. పరమ దయాళువైన బాబా, "అంతా శుభం జరుగుతుంద"ని ఆశీర్వదించారు. అప్పటినుండి ఆమె బాధలన్నీ తీరిపోయాయి.
సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ, రచన: విన్నీ చిట్లూరి.
ఓం సాయినాథాయనమః🌹🙏🏻🌹
ReplyDeleteఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sree Sai Nadhaya Namaha
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha