సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

"ఆవో! చాంగ్ దేవ్ మహారాజ్!"


"ఆవో! చాంగ్‌దేవ్ మహరాజ్!"

పుంతంబా సమీపంలో నివసించే శ్రీగంగగిర్ మహరాజ్ గొప్ప మహాత్ముడుగా ప్రఖ్యాతుడు. ఆయన గృహస్థుగా ఉంటూనే నిస్వార్థంగా వివిధ ప్రదేశాల్లో నామసప్తాహాలు, సత్సంగాలు నిర్వహిస్తుండేవారు. ఒకసారి కాపూస్‌వాడ్‌గాఁవ్ దగ్గర నామసప్తాహం పూర్తిచేసి కొందరు శిరిడీ గ్రామస్థుల ఆహ్వానముపై శిరిడీ వచ్చారు. శిరిడీలో 7 రోజులపాటు భగవన్నామ సప్తాహం, సత్సంగం, హోమం, అన్నదానం మొదలైన కార్యక్రమాలు నిర్వహించాడు. దైవచింతనగల మహల్సాపతి తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తాహం పూర్తయిన తరువాత అక్కడున్న వారందరికీ భోజన ప్రసాద వినియోగం జరుగుతూంది.

ఆ సమయంలో శ్రీసాయిబాబా రెండు చేతులతోనూ మట్టి కుండలు పట్టుకొని మసీదువైపు వెళుతున్నారు. అక్కడే ఉన్న గంగగిర్ మహరాజ్, బాబాను చూచి, “ఈ మహరాజ్ ఎవరు?” అని ప్రక్కనే ఉన్న మహల్సాపతిని అడిగాడు. “ఆయన సాయి మహరాజ్!” అని సమాధానమిచ్చాడు మహల్సాపతి. “ఆయన గొప్ప రత్నం. మీకింకా ఆయన సంగతి తెలియలేదు. ఆయన్ను జాగ్రత్తగా సేవించుకోండి!” అంటూ బిరబిరా బాబా వెళ్తున్న వైపు నడిచాడు శ్రీగంగగిర్. మహల్సాపతి, తదితరులు ఆయన్ను అనుసరించారు. 

త్వరగా మసీదు చేరాలనే ఉద్దేశంతో, హడావుడిగా అడ్డత్రోవన మసీదు చేరారు గంగగిర్ మహరాజ్. అప్పటికే మసీదు చేరిన బాబా కుండలు క్రిందపెట్టి, ప్రక్కనే వున్న ఇటుకరాయిని చేతిలోకి తీసుకొని, మసీదు మెట్లు ఎక్కుతున్న గంగగిర్ మహరాజ్ ను ఉద్దేశించి “ఇలాకాదు! అట్లా పోయి ఇట్లా రా!" అని మసీదు ముందుండే బాటవైపు చూపారు. (బాబా లెండీకిగానీ మరెక్కడికిగానీ వెళ్ళినా దూరమయినాసరే ప్రధాన రహదారి గుండానే వెళ్ళేవారు! దగ్గరని అడ్డదోవన ఎప్పుడూ నడిచేవారు కాదు.) వెంటనే శ్రీగంగగిర్ వెనక్కి వెళ్ళి, చుట్టూ తిరిగి మామూలు దారిలో మసీదు చేరాడు.

శ్రీగంగగిర్ దగ్గరకు రాగానే బాబా “ఆహ్! చాంగ్ దేవ్ మహరాజ్!” అంటూ మసీదులోకి ఆహ్వానించారు. ఆ తరువాత బాబా, శ్రీగంగగిర్ మహరాజ్, మహల్సాపతి చిలిం త్రాగుతూ చాలాసేపు మాట్లాడుకొన్నారు.

చాంగ్దేవ్ మహరాజ్ 13వ శతాబ్దంలో అత్యంత ప్రఖ్యాతుడైన గొప్ప హఠయోగి. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్ దర్శనంతో, ఆయనకున్న యోగశక్తుల వ్యామోహం జ్ఞాన గర్వం పటాపంచలవుతుంది. శ్రీజ్ఞానదేవులు ఆ యోగికి చేసిన బోధ 'చాంగ్దేవ్ ప్రశస్తి' పేరున ప్రఖ్యాతం.

బాబా శ్రీగంగగిర్ మహరాజ్ను చాంగ్ దేవ్ గా ఎందుకు సంబోధించారో ఆ సద్గురుమూర్తికే ఎఱుక!

సోర్సు : సాయిపథం  వాల్యూం - 1

4 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo