సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీకృష్ణ పురుషోత్తమ్ పాటిల్



ఒకప్పుడు శ్రీకృష్ణ పురుషోత్తమ్ పాటిల్ తన పూర్వీకుల ఇంటిని మరమ్మత్తు చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతని సోదరులు వాళ్ళల్లో వాళ్ళు పొట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో అతను మనశ్శాంతి కోల్పోయి అక్కల్‌కోట వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడు ప్రయాణమయ్యేలోపు ఒక స్నేహితుడు అతనిని కలిసి, ‘ముందుగా శిరిడీ వెళ్లి, తరువాత అక్కల్‌కోట వెళ్ళ’మని సలహా ఇచ్చాడు. అందుకతను అంగీకరించి శిరిడీ ప్రయాణమయ్యాడు. మరుసటిరోజు ఉదయానికి కోపర్‌గాఁవ్ చేరుకున్నాడు. అక్కడినుండి ఎంతో ప్రయాసతో ఉదయం 10 గంటలకు శిరిడీ చేరుకున్నాడు. ఆరోజు గురుపూర్ణిమ అయినందున దీక్షిత్, చందోర్కర్ మొదలైన భక్తులు బాబాను పూజిస్తున్నారు. అతను కూడా బాబా దర్శనం చేసుకొని, బాబాను పూజించి, ఆయన ముందు కూర్చున్నాడు. బాబా అతనిని చూస్తూ, “అరె, ఎందుకు చింతిస్తావు? నువ్వు ఎవరికీ హాని చెయ్యలేదు, కాబట్టి భగవంతుడు నీకు హాని కలుగజేయడు. ఆయన నిన్ను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఎంతకాలం ఆ పాపిష్ఠి జనులు నీలుగుతారో నేను చూస్తాను” అని అన్నారు. తరువాత బాబా కొంచెం గంధం, బియ్యం, కొన్ని పూరేకులు తీసుకుని అతని నుదుటిపై, కణతలపై పూసి, “ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు)” అన్నారు. ప్రక్కనే ఉన్న శ్యామా బాబాను, “ఈరోజు మాకు ఏ లీల చూపబోతున్నారు?” అని అడిగాడు. అందుకు బాబా, “ఇది సాధారణమైన ప్రాపంచిక లీల” అన్నారు. తరువాత బాబా శ్రీకృష్ణ పాటిల్‌ను వాడాకు వెళ్ళమని పంపించారు. అక్కడ అతనికి ఎవరూ తెలియకపోయినప్పటికీ నానా అతన్ని సాదరంగా ఆహ్వానించి జాగ్రత్తగా చూసుకున్నాడు.

తరువాత అతను అక్కల్‌కోట వెళ్లదలచి సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబాకు రెండు రూపాయలు దక్షిణ సమర్పించాడు. బాబా అతనిని మరో రెండు రూపాయలు అడుగుతూ, “నువ్వు నాలుగిస్తే ఎనిమిది పొందుతావు. నువ్వు ఏదైతే నాటుతావో అదే పొందుతావు. నువ్వు నాటకపోతే సమృద్ధమైన పంటను ఎలా  పొందగలవు?” అని అన్నారు. తరువాత అతను బాబా అనుమతి తీసుకొని అక్కల్‌కోట వెళ్ళాడు. అక్కడినుండి తిరుగు ప్రయాణానికి డబ్బులు తక్కువైనందున అతడు పూనా వరకే టికెట్టు తీసుకున్నాడు. తోటి ప్రయాణీకుడొకడు అతనితో, “పూనా వెళ్ళవద్దు. అక్కడ ప్లేగు ప్రబలి, నగరమంతా నిర్మానుష్యంగా ఉంద”ని చెప్పాడు. తరువాత ఆ ప్రయాణీకుడు వెళ్లి ముంబాయికి ఒక టికెట్ తీసుకొని, అతనికిచ్చి, “నువ్వు డబ్బులు మనీ ఆర్డర్ ద్వారా నాకు పంపవచ్చ”ని అన్నాడు. అంతేకాదు, ఆ ప్రయాణికుడు టీ కూడా తీసుకొచ్చి అతనికిచ్చాడు. తరువాత రైలు ప్లాట్ ఫారం మీదికి వస్తుండగా, రైలు ఎక్కేందుకు వారిద్దరూ ముందుకు కదిలారు. హఠాత్తుగా ఆ ప్రయాణీకుడు జనసందోహంలో అదృశ్యమయ్యాడు. పాటిల్ ఆ ప్రయాణికుడి కోసం అంతా వెతికాడు కానీ, అతనెక్కడా కన్పించలేదు. అప్పుడతను ‘ఆ వ్యక్తి మరెవరో కాదు, బాబానే’ అని గ్రహించాడు. బాబా చూపిన ప్రేమకి ఆనందంతో అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.

మరుసటి సంవత్సరం అతడు బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాడు. ఆరోజు ఒక గ్రామస్తుడు ఒక బుట్టనిండా జామకాయలు తెచ్చి బాబాకు సమర్పించాడు. బాబా భక్తులందరికీ ఒక్కొక్క జామకాయ ఇచ్చి, పాటిల్‌కి మాత్రం ఐదు జామకాయలు ఇచ్చి, ఇంకొకరోజు ఉండమని చెప్పారు. తరువాత అతడు బయలుదేరటానికి అనుమతి అడిగినప్పుడు బాబా అతన్ని ఆశీర్వదించారు. అతడు తన ప్రయాణంలో ఫైఅధికారి అనుమతి లేకుండా శిరిడీ వెళ్లినందుకు, అనుకున్నదానికంటే ఒకరోజు అదనంగా ఉన్నందుకు కలత చెందాడు. ఫైఅధికారి కోప్పడతాడని, ఉద్యోగం కూడా పోవచ్చని ఆందోళనతో తిరిగి విధులలో చేరడానికి భయపడ్డాడు. కానీ అతను ఆశ్చర్యపోయేలా, అతని ఫైఅధికారి నవ్వుతూ, “డ్రాయింగ్ డిపార్టుమెంటులో ప్రతి ఒక్కరూ హెచ్చించిన జీతాన్ని పొందారు. నువ్వు మాత్రం వాళ్లందరికంటే ఐదు రూపాయలు అదనంగా ప్రమోషన్ ఏజెంట్ నుండి పొందావు” అన్నాడు. అది విన్న అతను ఆశ్చర్యపోతూ, బాబా ఐదు జామకాయలు తనకెందుకు ఇచ్చారో అర్థం చేసుకున్నాడు. బాబా దయకు కృతజ్ఞతతో అతను ఆనందభరితుడయ్యాడు.

 (Source: Shri Sai Leela Magazine Year 4 ank 2 vaishak shake 1848 Ank 2 1926, Baba’s Divine Symphony by Vinny Chitluri and Shri Sai Satcharitra Chapter 13 Ovi Nos.132 and 133)
http://www.saiamrithadhara.com/mahabhakthas/shri_krishna_purushottam_patil.html 

6 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏
    మధురం మధురం శ్రీ సాయి లీలామృతం
    సుమధురం సాయి దివ్య నామం!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om sai ram, e roju mee leelalu chadvutunte na manasulo badhalaki Samadanam la anipisthunnai tandri, enno samasyalatho na manasuki shanti ledu, pls tandri nenu edaina tappu cheste manasu purthi ga kshaminchamani korukuntunnanu tandri, na tappulni kshaminchi na khastalni teerchandi tandri pls naaku manashanti ni evvandi, na anubhavalani thoti sai bhaktulatho panchukuntanu tandri pls.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo