ఈ భాగంలో అనుభవాలు:
- మాటపడకుండా బాబా కాపాడారు
- సాయిబాబా ఆశీస్సులతో తీరిన ఉద్యోగ సమస్య
మాటపడకుండా బాబా కాపాడారు
USA నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను గత 9 సంవత్సరాలకు పైగా బాబా భక్తుడిని. కష్టసమయాల్లో ఆయనెప్పుడూ నా చేయి పట్టుకుని నాకు ధైర్యాన్నిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్నారు.
నేను ప్రస్తుతం ఉద్యోగరీత్యా చాలా కఠినమైన సమయాన్ని అనుభవిస్తున్నాను. నేను ఏమి చేసినా అవన్నీ నన్ను గందరగోళంలో పడేస్తున్నాయి. నా మేనేజర్ కూడా దానిని గమనించి, నన్ను నేను మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ఆ తరువాత నేను చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద సమస్యలు సృష్టిస్తున్నాయని వినేసరికి నామీద నాకున్న కాస్త విశ్వాసాన్ని కూడా కోల్పోయాను. నా మెదడు పనిచేయడం మానేసింది. నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను.
తరువాత ఒక ఉదయం నేను నిద్రలేస్తూనే గత రాత్రి నా మేనేజరుకు పంపాల్సిన ఒక డాక్యుమెంటుని పంపడం మర్చిపోయానని గుర్తించి, అది గమనించిన ఆమె ఏమంటుందోనని భయపడ్డాను. ఉదయం 9:30 గంటలకు సమావేశముండగా 8:30 కి నేను ఆ డాక్యుమెంట్ ఆమెకు పంపించాను. నా తప్పు క్షమించమని బాబాకి చెప్పుకుని, నాకు రక్షణనివ్వమని, నా టీమ్ లోని మిగతా సభ్యులకు నేను చేసిన ఈ తప్పు గురించి తెలియకుండా ఉండేలా చేసి అంతా సజావుగా సాగేలా చూడమని అభ్యర్థించాను. అప్పటికే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నందున, నా టీమ్‌ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు. టీమ్‌లో ఒక సీనియర్‌ని అయివుండి ముఖ్యమైన పనిని మరచిపోయానని ఎలా చెప్పాలో అర్థంకాక చాలా ఆందోళనపడ్డాను. బాబాను ఏదైనా అద్భుతం చేయమని ప్రార్థించి, నాకే ఇబ్బందీ లేకపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని ఆయనకు వాగ్దానం చేశాను.
తరువాత చాలా ఆందోళనపడుతూ ఆఫీసుకి వెళ్ళాను. బాబా మొత్తం పరిస్థితిని సజావుగా నిర్వహించారు. నా మూర్ఖత్వాన్ని ఎవరూ గ్రహించలేదు. ఆ డాక్యుమెంట్ విషయంలో నాకు సానుకూలమైన స్పందన లేనప్పటికీ, దానిని సమయానికి పంపనందుకు నన్ను ఏమీ అనలేదు. నన్నసలు పిలవనేలేదు. "థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ బాబా. గత కొన్నేళ్లుగా కఠినమైన జీవితాన్ని గడుపుతూ కూడా నేను ఈ ప్రపంచంలో జీవించివున్నానంటే అందుకు మీరే కారణం. దయచేసి ఉద్యోగంలో, నా వ్యక్తిగత జీవితంలో కఠినమైన సమయాన్ని అధిగమించేలా, నా విశ్వాసాన్ని తిరిగి పొందేలా నాకు సహాయం చేయండి. దయచేసి మీ ఆశీస్సులు సదా నాపై ఉండేలా అనుగ్రహించండి".

సాయిబాబా ఆశీస్సులతో తీరిన ఉద్యోగ సమస్య
బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నాకు 15 సంవత్సరాలకు పైగా సాయిబాబాతో అనుబంధం ఉంది. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్, గైడ్, తండ్రి, దైవం, గురువు అన్నీ. నాకున్నదంతా బాబా పెట్టిన భిక్షే. నా జీవితంలో ఆయనిచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. వాటి గురించి నేను ఏమి చెప్పగలను? వాటిలో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నా భర్త ఐదేళ్లకు పైగా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడి రాజకీయాల కారణంగా మావారు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అందువలన కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. తన స్నేహితులు, సహోద్యోగులు ఇతర సంస్థలలో మంచి స్థాయిలో ఉద్యోగాలు పొందారు. కానీ నా భర్తకు ఇంటర్వ్యూ పిలుపు కూడా రాలేదు. ఆ కారణంగా తను చాలా నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. దాంతో తన కోపాన్ని నాపై చూపిస్తుండేవారు. నేనేమీ చేయలేక చాలా నిస్సహాయంగా ఉండేదాన్ని. "నా భర్తకి మంచి ఉద్యోగం వచ్చేలా సహాయం చేయమ"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు.
అలా కొన్ని రోజులు గడిచాక నేను మహాపారాయణ బృందంలో చేరాను. వారి సూచనల మేరకు నేను ప్రతి గురువారం శ్రద్ధగా సాయి సచ్చరిత్ర పారాయణ చేయటం ప్రారంభించాను. దాంతో పాటు ప్రతి గురువారం సాయి మందిరానికి వెళ్ళడం కూడా మొదలుపెట్టాను. అలా వెళ్ళినప్పుడు ఒక గురువారంనాడు నేను బాబా ముందు కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! నా భర్తను ఆశీర్వదించి, ఈరోజు ముగిసే సమయానికల్లా నాకు ఏదైనా అద్భుతం చూపించండి" అని బాబాను వేడుకున్నాను. అదేరోజు మధ్యాహ్నం నా భర్త నాకు ఫోన్ చేసి, తనకి ఒక సంస్థ నుండి ఫోన్ కాల్ వచ్చిందని, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారని చెప్పారు. దయామయులైన బాబా ఆశీర్వదించి చూపిన మొదటి అద్భుతమది. తరువాత ఇంటర్వ్యూకు సంబంధించిన రౌండ్లన్నీ కఠినంగా జరిగినప్పటికీ బాబా దయవల్ల నా భర్త బాగానే చేశారు. మరుసటి గురువారం కంపెనీవాళ్ళు ఫోన్ చేసి మావారు ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. మరుసటి గురువారంనాటికి జీతానికి సంబంధించిన చర్చ కూడా పూర్తయి, త్వరలోనే ఆఫర్ లెటర్ పంపిస్తామని చెప్పారు. అధికారికంగా ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు కానీ బాబా దయవలన అన్నీ సానుకూలంగా ముగిశాయి. త్వరలోనే ఆఫర్ లెటర్ వస్తుందని నాకు పూర్తి విశ్వాసముంది.
బాబా మాతో ఎప్పుడూ ఉన్నారని తలచుకుంటే నా కళ్ళనుండి ఆనందభాష్పాలు వస్తున్నాయి. బాబాకు మన స్వచ్ఛమైన ప్రేమ, శ్రద్ధ, సబూరి కావాలి. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ దయను వివరించడానికి మాటలు లేవు. మీరు నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన ప్రతిదానికీ నా ధన్యవాదాలు".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2616.html?m=0

🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete