సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 424వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 57వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను సన్యాసం తీసుకోవాలని రాధాకృష్ణమాయి పూర్తిగా కోరుకున్నారని నాకనిపించేది. కానీ బాబాను ఎన్నోసార్లు అడిగినప్పటికీ ఆయన నన్ను సొలిసిటర్ పరీక్ష ఇవ్వమనీ, ఉద్యోగం చేయమనీ రెండు మూడుసార్లు చెప్పారు. అందువల్ల నేను సందిగ్ధంలో పడిపోయాను. రాధాకృష్ణమాయి సాయిబాబాతో తాదాత్మ్యం చెంది ఉండేవారు. ఆ అనుభవాన్ని కూడా బాబానే కలిగించారు. ఇది నేను చూశాను. అందువల్ల బాబా వివేకం కోసమే సొలిసిటర్ పరీక్ష ఇవ్వమనీ, ఉద్యోగం చేయమని చెప్పారని నాకనిపించింది.

‘శ్రీఉపాసనీలో నాకు సాయిబాబానే కనిపించార’ని బాపూసాహెబ్ జోగ్ నాకు చెప్పారు. అందువల్ల దీనిమీద శ్రీఉపాసనీ ఉద్దేశ్యం కూడా తెలుసుకోవాలన్న ఆలోచన నా మనసులో కలిగి సకోరిలో శాశ్వతంగా ఉండిపోయిన శ్రీగోవింద కమలాకర్ దీక్షిత్‌కు ఉత్తరం రాశాను. దానికి దీక్షిత్ వద్దనుంచి, “నేను మీ లేఖను శ్రీ ఉపాసనీ మహరాజ్‌కి చదివి వినిపించాను. ఆయన ‘కొద్దిరోజుల్లో ఉజ్జయిని వచ్చి అక్కడ తాను ఒకరోజు ఉంటాననీ, అప్పుడక్కడ తనని కలిస్తే దీనికి సమాధానం ఇస్తాన’ని వ్రాయమన్నారు” అని సమాధానం వచ్చింది. అయితే ఆ లేఖలో నేను ఉజ్జయినిలో ఎక్కడ కలవాలో దాని గురించి కొంచెం కూడా తెలియజేయలేదు. పైగా శ్రీఉపాసనీతో నాకున్న పరిచయం కూడా కొత్తదే. “నా శంకలకు సమాధానం గురువుతో కాక వేరే ఎవరితోనో ఎందుకు చెప్పించుకోవాలి? అలా చేస్తే అది గురుభక్తికి అల్పత్వం అవుతుంది” అనిపించింది. అలా అనిపించటానికి విశేష కారణం ఏమిటంటే, 1916లో పారమార్థిక విషయం గురించి ఒకసారి ఒక కఠిన సందర్భం వచ్చింది. అప్పుడు దాన్ని గురించి రాధాకృష్ణమాయిని అడిగిన మీదట బాబా, “ఆమెనెందుకు అడుగుతావు?” అని నన్ను కోప్పడ్డారు. ఈ అనుభవం తరువాత ఏ కఠిన సమస్యకైనా సమాధానం అన్యులను అడగటం సరికాదని నిశ్చయించుకుని నేను ఉజ్జయిని వెళ్ళలేదు.

1922 దసరా తరువాత శ్రీఉపాసనీ పరిచయం ఎక్కువైంది. సాయిమహారాజు తమ కృపతో నా జీవశివులను ఐక్యం చేసి పరమాత్మతో తాదాత్మ్యం చెందించారు. జ్ఞానావస్థను, సహజావస్థనూ ఒకేసారి నాకు ప్రాప్తింపచేశారు. అందువల్ల ఆవశ్యక సాధన గురించి ఆయన నాకొక ఆలోచన ఇచ్చారు. అది నిశ్చయం. కానీ నాతో శ్రవణ, మనన, నిధి, ధ్యాన, సమాధి మొదలైన కఠిన సాధనలను సరైన పద్ధతిలో చేయించలేదు. అందువల్ల సాయిబాబా నాకు ఇచ్చిన జ్ఞానరత్నాల నిజమైన విలువ, గొప్పతనం శ్రీఉపాసనీ సమాగమంతోనే తెలిసి వచ్చింది. అలా కాకపోయివుంటే కోతి చేతిలోనో లేదా మూర్ఖుడి చేతిలోనో రత్నాన్ని పెడితే దాన్ని రాయి అనుకుని విసిరేసినట్లే బహుశా నాకు దొరికిన జ్ఞానరత్నాలను కూడా పోగొట్టుకునేవాడిని.

నేను కాకాసాహెబ్ దీక్షిత్‌ని ఒకసారి, "శ్రీఉపాసనీ చరిత్రలో, నేనొకసారి దీక్షిత్ వాడాలో భోజనం చేస్తున్నాననీ, అప్పుడు దీక్షిత్ నన్ను ఆ వాడాలో భోజనం చేయకూడదని శ్రీమాధవరావుకి పోస్టుకార్డు రాశారనీ, ఆ కబురు రావటంతో వెంటనే నేను కోపంతో బయటకు వెళ్ళిపోతూ “ఒకవేళ నా భోజనం ఆపేయించటం రేపటినుంచి జరగబోతుంటే దానికి ప్రారంభం ఈరోజునుంచే ఎందుకు కాకూడదని చెప్పాననీ” రాసి ఉంది. అది ఎంతవరకు నిజం?" అని అడిగాను. దానికి కాకాసాహెబ్, “వామనరావ్! మీకిది నిజమనిపిస్తోందా?” అన్నాడు. నేను, “ఈ మాట మీ స్వభావానికి విరుద్ధంగా ఉంది. అందువల్ల పుస్తకంలో రాసిన ఘటనలో ఎంతవరకూ నిజముందో తెలుసుకోవటం కోసం నేను ఈ మాట మిమ్మల్ని అడిగాను” అన్నాను. దానికి ఆయన, “ఆయన (శ్రీఉపాసనీ) తామసికుడు. ఆయన మాటలు కొన్ని మంచివి కూడా. మీరు చెపుతున్న పుస్తకాన్ని నేను చూశాను. అందులో వాళ్ళు తమ మనసులో ఉన్న మాటలు కూడా రాశారు. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అసలు మీకూ వాళ్ళకీ ఎలా కుదురుతుంది? మీరు వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా అంగీకరిస్తారు?” అని అన్నారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏

    ReplyDelete
  3. Om Sri Sai Ram thaatha 🙏🙏..
    Bhāvyā srēē

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo