ఈ భాగంలో అనుభవం:
- బాబా ప్రసాదించిన పునర్జన్మ
నా పేరు అంజనా గుప్తా. మాది వరంగల్ జిల్లా నర్సంపేట. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని అనిపించింది. అందుకే మొదటినుంచి పంచుకోవాలన్న సదుద్దేశంతో నా మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను.
నాకు మా కజిన్ ద్వారా సాయిబాబా పరిచయమయ్యారని చెప్పవచ్చు. మొదటిసారిగా (1992-1993) బాబా ఫోటో రూపంలో మా ఇంటికి వచ్చారు. కానీ, 'అప్పటినుండి నేను బాబా భక్తురాలిన'ని మాత్రం చెప్పలేను. అందరి దేవుళ్ళతో పాటుగా బాబాను కూడా ఒక దేవుడిగా భావించి పూజలు చేసేదాన్ని. 1994లో, "దగ్గరలోనే సాయిబాబా గుడి కట్టారు" అని ఎవరో చెబితే చూసొద్దామని నేను, మావారు వెళ్ళాము. అప్పటికింకా బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. అక్కడ బాబా ఏడడుగుల ఫోటో రూపంలో ఉన్నారు. ఆ ఫోటోని చూసిన తర్వాత నాకెందుకో ఎవరో దగ్గరి బంధువుని చూస్తున్న అనుభూతి కలిగింది. అక్కడ గుడిలో ఉన్న అంకుల్, ఆంటీ ఇద్దరూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారు అప్పటికే వారి బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకోసం 'టీ' తెప్పించారు. అయితే 'టీ' వచ్చేసరికి వాళ్ళు వెళ్లిపోవడంతో ఆంటీ మమ్మల్ని టీ త్రాగమని బలవంతపెట్టారు. మాకు, "బాబా దర్శనం కోసం వచ్చాము, టీ తాగడానికి కాదు కదా" అని అనిపించింది. కానీ అక్కడున్న అంకుల్ ఏమన్నారంటే, "ఏ ఆహారమైనా ఎవరికి చెందాలో వారికి మాత్రమే చెందేలా చేస్తాడు బాబా. ఈ 'టీ'ని బాబా ఎందుకు మీకు చెందేలా చేస్తున్నారో ఆయనకే తెలియాలి. మీరు బాబా సమక్షంలో ఉన్నారు, బాబా ప్రసాదంగా భావించి ఈ టీ స్వీకరించండి" అని చెప్పారు. ఆ మాటలు నా మనసులో బాగా నాటుకుపోయాయి. ఆ తరువాత, "మరో మూడు నెలల్లో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంది" అని చెప్పారు. ఆ మూడు నెలల లోపల వీలైనప్పుడల్లా నేను, మావారు ఆ గుడికి వెళ్ళి బాబాను దర్శించుకుని వస్తుండేవాళ్లం. బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగే సమయంలో మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలలో, విశేషమైన పూజలలో నేను నాకు చేతనైన సేవ చేశాను. అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకున్నరోజు లేనేలేదు, బాబా నా తోడు లేని ఘడియ లేదు. ఏది చేసినా బాబా స్మరణతోటే, ఏది తిన్నా బాబా స్మరణతోటే. బాబా అనుగ్రహంతో నా జీవితంలో ఎన్నో అనుభవాలు జరిగాయి.
బాబా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన దగ్గరినుండి నేను ప్రతిరోజూ సంధ్య ఆరతికి హాజరయ్యేదాన్ని. నేను ఆరతి పాడుతుంటే అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంధ్య ఆరతి సమయానికి నాకోసం ఎదురుచూసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఒకవేళ సంధ్య ఆరతి సమయానికి వెళ్ళలేకపోతే నేను చాలా బాధపడేదాన్ని, ఎంతో ఏడ్చేదాన్ని. "బాబా! ఎందుకు నేను ఆరతికి వెళ్ళలేకపోయాను? నేనేం తప్పు చేశాను?" అని ప్రశ్నించుకునేదాన్ని. ఆ విధంగా జీవితం సాగుతూ నాలుగైదు సంవత్సరాలు గడిచాయి. అనుకోకుండా నాకు ఉద్యోగం రావడం, ఆరతి సమయానికి బాబా గుడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ప్రతిక్షణం బాబాను స్మరించుకుంటూనే గడిపేదాన్ని.
అయితే హఠాత్తుగా నా జీవితంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. 1999 సెప్టెంబరు నుండి 2000 జనవరి వరకు నా జీవితంలో 'ఎందుకు బ్రతికి ఉన్నానా?' అని ఏడవని క్షణం లేదు. నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో మంచానికే పరిమితమయ్యాను. ఆ సమయంలో కూడా నేను బాబా స్మరణ, బాబా ఊదీ పెట్టుకోవడం మరచిపోలేదు. నాకు ఇద్దరూ మగపిల్లలే. పైగా వాళ్ళు చాలా చిన్నపిల్లలు. వాళ్ళకేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. వాళ్లను చూస్తే దుఃఖం ఆగేది కాదు. వారికి చేసిపెట్టాల్సిన సమయంలో నేను మంచంలో పడుకొని, వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో నాకు కావలసిన పనులు చేయించుకునేదాన్ని. అది నా మనసును ఎంతగానో కలచివేస్తుండేది. ఒకరోజు నా జీవితం మీద నాకు విరక్తి కలిగి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు రాత్రి నా భర్త, పిల్లలు అందరూ పడుకున్నాక నా చీర కొంగుతో ఉరి వేసుకున్నాను. కానీ, దయామయుడైన సాయితండ్రి తన పిల్లలని అలా గాలికి వదిలేయడు కదా! కొంగు బిగుసుకుంది, గొంతునొప్పి తెలుస్తోంది, స్పృహ కోల్పోతున్నాను. అప్పుడు బాబా నాకు ప్రత్యక్ష దర్శనమిచ్చారు. బాబా చిరిగిన లాల్చీ ధరించి, సుమారు 70 సంవత్సరాల వృద్ధునిలా కనిపించారు. బాబా నాతో, "ఏంటి, నీకేం కావాలి? ఇప్పుడు ఏమైందని అంతగా విరక్తి చెందుతున్నావు? ఒకసారి నాతో రా!" అని నా చెయ్యి పట్టుకుని బయటి ప్రపంచంలో జరుగుతున్న యాక్సిడెంట్లను, హాస్పిటల్లో పడివున్న పేషెంట్లను, కాళ్ళు చేతులు లేనివాళ్లను, మతిలేనివాళ్లను... ఇలా ఎంతోమందిని చూపించారు. అలా చూపిస్తూనే ఊదీని నా మోకాళ్ల నుండి పాదాల వరకు రాస్తూ ఉన్నారు. అలా రాస్తూనే, "మీ ఇంట్లో ఊదీ ఎక్కడ ఉంటుంది?" అని అడుగుతున్నారు. నేను, "బాబా! మీరు నా కాళ్ళకు ఊదీ రాయడం ఏమిటి? అది తప్పు. మేము మీ పాద సేవ చేసుకోవాలి కానీ మీరు మాకు ఊదీ రాయడం ఏమిటి?" అని పెద్దగా అరుస్తూ స్పృహలోకి వచ్చాను. నా అరుపు విని మా వాళ్ళు లేచి వచ్చారు. నా గొంతుకు ఉన్న ఉరి అప్పటికే వదులైపోయింది. మా వాళ్ళు దగ్గరకు వచ్చి ముడి విప్పదీసి నన్ను క్రిందకు దించి, 'ఇలాంటి పని చేయటం సరైనది కాద'ని చెప్తూ ఏడవడం ప్రారంభించారు. కాసేపటి తరువాత, "అదంతా సరే గానీ, నువ్వు ఎందుకంత గట్టిగా అరిచావు?" అని అడుగుతూనే, "నువ్వు అరవకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు కదా!" అని మళ్ళీ ఎంతో ఏడ్చారు. ఇదంతా ఆ బాబా దయ కాక మరి ఇంకేమిటి? ఆ విధంగా బాబా నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలైనా మీతో పంచుకుంటుంటే, ఇప్పటికీ అప్పటి ఆ సన్నివేశం నా కళ్ళకు కట్టినట్లే ఉంది. బాబా నా పైన, నా కుటుంబం పైన అనుగ్రహవర్షాన్ని కురిపించారు.
ఈ అనుభవంతో మా కుటుంబానికంతటికీ బాబా పెద్దదిక్కుగా మారారు. మా కుటుంబమంతా సాయిభక్తులుగా మారిపోయాము. ఆరోగ్యం బాగయ్యాక నేను ముందుగా సాయిబాబా గుడికి వెళ్లి, బాబా చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి, ధునిలో కొబ్బరికాయ సమర్పించుకొని బాబాకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలా నాకు పునర్జన్మనిచ్చిన బాబా ప్రపంచాన్ని నాకు క్రొత్తగా చూపించారు. అంతకుముందు నా ప్రపంచమంతా ఇంటికే పరిమితమై ఉండేది. అలాంటి నా జీవితంలో ఈ అనుభవం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు, రెండు రూపాయల బొట్టుబిళ్ళల ప్యాకెట్లు కావాలన్నా మావారి మీద ఆధారపడే నేను ఈ అనుభవం తర్వాత మావారి బట్టల దగ్గర నుండి అవసరమైన షాపింగ్ అంతా నేనే చేసేదాన్ని. ఎల్ఐసి ఏజెంటుగా చేశాను, చదువు కొనసాగించాను. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేదాన్ని, సంఘసేవ చేసేదాన్ని. ఇలా ఒకటని కాదు, నేను చేయలేని పనంటూ లేదన్నట్లు సమస్తం చేసేదాన్ని. చూశారా, ఎంత మార్పో! దీనినిబట్టి నిజంగా బాబా నాకు పునర్జన్మనిచ్చారంటే ఎవరైనా సంశయం లేకుండా నమ్మవచ్చు. ఇలాంటి లీలలు బాబా నా జీవితంలో చాలానే చేశారు. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లాగ్ నడిపిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను.

🙏🌹💐🙏🌹💐🙏🌹🙏🌹💐🙏
ReplyDeleteప్రభవించినావు మానవమూర్తి వై
ప్రసరించినావు ఆరని జ్యోతి వై!
మారుతి నీవే గణపతి నీవే
సర్వ దేవతల నవ్యాకృతి నీవే
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి!!
🙏💐🙏 ఓం సాయిరాం 🙏💐🙏
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē
సాయిశ్వరనీపాధాలకువందనం
ReplyDeleteOm sai sri sai jaya jaya sai, sai sarvantharyaami
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
om sairam
ReplyDeleteom sairam
hare hare krishna
sai sai ram
Om Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDeleteసాయి నీ లీలలు అమోఘం అపురూపం అనిర్వచనీయం. ఏ విధంగా తీర్చుకోగలం అయ్యా నీ రుణం. నీ సహాయం లేని క్షణం మేము ఊహించుకోలేం .సదా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ తండ్రి
ReplyDelete