సాయి వచనం:-
'ఎన్నడూ వాదించకు. పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు.'

'బాబా తలచుకొంటే మనమెక్కడున్నా సమాధానమివ్వగలరు' - శ్రీబాబూజీ.

జోసెఫ్ ఫౌజ్‌దార్


జోసెఫ్ ఫౌజ్‌దార్ క్రైస్తవ మతస్తుడు. ఇతడు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివాసముండేవాడు. అతనెప్పుడూ శిరిడీ వెళ్ళలేదు. కానీ ముంబైలోని తన స్నేహితుల ద్వారా సాయి గురించి తెలుసుకున్నాడు. అతని వద్ద సాయిబాబా చిత్రపటం ఉన్నప్పటికీ ఎప్పుడూ పూజించలేదు. అయితే అతను సాయిబాబాను ఒక గొప్ప శక్తిసంపన్నుడైన సాధుసత్పురుషునిగా భావించేవాడు.

ఒకసారి అతను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసును పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడు సహాయం కోసం సాయిబాబాని ప్రార్థించాడు. సాయిబాబా అతనికి కలలో దర్శనమిచ్చి ఆ కేసు విషయంలో ఎలా ముందుకుపోవాలో మార్గనిర్ధేశం చేసారు. ఆయన సూచనల ప్రకారం అతడు నడుచుకొని ఆ కేసుని విజయవంతంగా పరిష్కరించాడు.

1916వ సంవత్సరంలో ఇద్దరు భయంకరమైన పఠాన్ బందిపోటు దొంగలను పట్టుకొనవలసి వచ్చింది. ఆ ప్రయత్నంలో జోసెఫ్ బృందానికి, బందిపోటు దొంగలకు మధ్య జరిగిన పోరాటంలో ఒక సిపాయ పఠాన్ చేత చంపబడ్డాడు. జోసెఫ్  కూడా గాయాలపాలై చికిత్సకోసం ఆసుపత్రిలో చేరాడు. ఈ సంఘటన జరగడానికి ముందే సాయిబాబా అతనికి జరగబోయే దాని గురించి తెలియజేసారు. ఆ ముందురోజు బాబా అతనికి కలలో కనిపించి ఒక దృశ్యాన్ని చూపించారు. ఆ దృశ్యంలో ఇద్దరు వ్యక్తులు అతన్ని పట్టుకుని వివాహం జరుగుతున్న ఓ చోటకి  ఈడ్చుకుంటూ  తీసుకువెళ్లారు.

తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఒక సంఘటనను అతను ఈ విధంగా  వివరించాడు:

1917 సంవత్సరంలో శ్రీ. గజనన్ నార్వేకర్ అనునతడు తీవ్ర జ్వరంతో భాదపడ్డాడు. గజనన్ కొడుకు తన తండ్రి వద్దనుండి ఐదువందల రూపాయలు తీసుకుని వెళ్లి బాబాకు  దక్షిణగా సమర్పించాడు. ఆ  మొత్తాన్ని స్వీకరించిన తరువాత సాయిబాబా జ్వరంతో వణికిపోవడం మొదలుపెట్టారు. అది చూసిన ఒక భక్తుడు బాబాను "ఎందుకు జ్వరంతో బాధపడుతున్నారో?" వివరించమని అడిగాడు. అప్పుడు బాబా ఇలా  బదులిచ్చారు, "మనం ఇతరుల కోసం ఏదైనా చేయదలిస్తే, వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి" అని. ఆ తరువాత అతితక్కువ వ్యవధిలోనే గజనన్ నార్వేకర్ జ్వరం తగ్గిపోయింది.

సమాప్తం.

Sources: Devotees' Experiences of SaiBaba by parama poojya Late shri. Narasimha Swamiji

4 comments:

  1. Eee roju nenu baba variki mokku chellinchukunnanu.Baba! Chivariga cheppina matalu nakosam cheppinattu undhiii.Nijanga,SaiNadha Kaliyuga prataysha daivam.

    ReplyDelete
  2. 🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om sai ram, me daya tho e roju anta prashantam ga gadiche la chayandi tandri pls, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, amma nannalani kshamam ga chudandi tandri vaalla badyata meede

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo