సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 186వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. "నేను నీతో ఉన్నాను" - "నేనుండగా భయమెందుకు?"
  2. నాన్న ఆశయాన్ని నెరవేర్చిన బాబా

"నేను నీతో ఉన్నాను" - "నేనుండగా భయమెందుకు?"

సాయిభక్తురాలు ప్రియాంక తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బెంగళూరుకు చెందిన వైద్యురాలిని. గత 5 సంవత్సరాలుగా నేను బాబా భక్తురాలిని. అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. "బాబా! నా జీవితంలో మీరు ఇచ్చిన అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను మీ భక్తులలో ఒకదాన్ని అయినందుకు నేనెంతో ధన్యురాలిని". ఇక నా అనుభవానికి వస్తే....

నేను గవర్నమెంట్ డాక్టర్ అయినందున కర్ణాటకలోని మారుమూల గ్రామాలలో ఉండాల్సి వస్తుంది. అక్కడ క్వార్టర్స్, ఇతరత్రా ప్రభుత్వ ఏర్పాట్ల వలన చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయంలో నాకు, నా భర్తకు మధ్య చాలా అపార్థాలు చోటుచేసుకున్నాయి. దానితో తను మా నుండి దూరంగా ఉంటున్నారు. నేను, నా పసిబిడ్డ మాత్రమే ఆ మారుమూల ప్రదేశాలలో ఉంటున్నాము. మొదట్లో నాకు 100 ఏళ్ళ పురాతనమైన ఇల్లు ఇవ్వబడింది. ఆ ఇల్లు తేళ్లు, పాములు వంటి వాటికి ఆలవాలంగా ఉండేది. పరిపాలనా సిబ్బందితో ఎంతో పోరాడిన తరువాత నాకు క్రొత్త భవనాన్ని కేటాయించారు. బాబా ఆశీస్సులతో క్రొత్త భవనానికి మారాను. అయితే పసిబిడ్డతో నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఒంటరితనాన్ని పోగొట్టమని ఒకరోజు బాబాను ప్రార్థించాను. ఆ మరుసటిరోజు మా గెస్ట్‌హౌస్ వంటమనిషి మా ఇంటి తలుపు తట్టి నాకొక బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి ఏమిటో ఊహించగలరా? - 'సాయిబాబా విగ్రహం!' అతనికి ముందురోజు ఒక కల వచ్చిందట. కలలో నేను 'నా బాబా ఫోటో నాకివ్వమ'ని అతనితో పోట్లాడుతున్నానట. ఆ కలలో అతనికి బాబా విగ్రహం కూడా కనిపించింది. వాస్తవానికి అతను దేవుణ్ణి నమ్మడు, పూజలు చేయడు. అలాంటి అతనికి ఉదయాన్నే కల వచ్చింది. ఆ కల గురించి చెప్తూ అతడు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు. ఆ తరువాత అతను షాపుకి వెళితే, ఆశ్చర్యకరంగా కలలో చూసిన అదే బాబా విగ్రహం అతని కంటపడింది. వెంటనే ఆ విగ్రహాన్ని కొని నాకు బహుకరించాడు. నిజంగా ఇది ఒక అద్భుతం. ముందురోజు నేను ఒంటరిగా ఉన్నానని బాబాను ప్రార్థించాను. "నేను నీతో ఉన్నాను" అని చూపించడానికి బాబా ఈ విధంగా నా వద్దకు వచ్చి, "నేను ఉండగా భయమెందుకు?" అని నాకు తెలియజేశారు. "లవ్ యూ బాబా!"

నాన్న ఆశయాన్ని నెరవేర్చిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

భక్తుల అనుభవాలను పంచుకోవడానికి బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఇది సాయిబాబాపై మా నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. బాబా ఆశీర్వాదంతో నెరవేరిన మా నాన్నగారి ఆశయానికి సంబంధించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

క్రొత్త ఇంటిని నిర్మించాలన్నది నా తండ్రికున్న పెద్ద ఆశయం. అయితే మా వద్ద అంత డబ్బు లేనందున అది సాధ్యం కాలేదు. అదృష్టవశాత్తూ ఒక కాంట్రాక్టర్ ద్వారా ఒక ఆఫర్ వచ్చింది. మాకున్న ప్లాట్ తో పాటు 5 లక్షల రూపాయలు మేము ఇవ్వగలిగితే అందుకు బదులుగా ఒక క్రొత్త ఇల్లు మాకు సొంతమవుతుంది. కానీ ఆ 5 లక్షలు కూడా మాకు భారమయ్యాయి. అందువలన మేము ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నాము. కానీ నా తండ్రి ఆశ నెరవేరడం లేదని నాకు చాలా బాధగా అనిపించింది. అంతేకాక నేను ఆయనకి ఏ సహాయమూ చేయలేకపోతున్నానని కూడా బాధపడ్డాను. అటువంటి నిస్సహాయస్థితిలో, "బాబా! మాకు సహాయం చేయండి. మీ కృపతో మేము ఆ ఇంటిని కొనగలిగితే దానికి 'సాయికృప' అని పేరు పెట్టుకుని, అనాథలకు 10,000 రూపాయలు విరాళంగా ఇస్తాను" అని బాబాని ప్రార్థించాను. ఆశ్చర్యం! బాబా తమ అద్భుతం చూపించారు. ఆ కాంట్రాక్టర్ అదనంగా ఏ డబ్బులూ అవసరం లేకుండానే  కేవలం ప్లాట్‌ కు బదులుగా క్రొత్త ఇంటిని మాకు ఇవ్వటానికి అంగీకరించాడు. మా ఆనందానికి హద్దులు లేవు. "బాబా! మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడంలేదు. మీ ఆశీర్వాదం లేకుండా మా ఈ కోరిక సాధ్యం కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. దయచేసి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. మీ ఆశీస్సులను మాపై కురిపించండి". 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo