లక్ష్మీబాయి తుసే అనే మహిళ ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ఆచారపూర్వకంగా శ్రీరాముని, హనుమంతుని పూజిస్తుండేది. ఒక రాత్రి ఆమెకు కలలో ఒక ఫకీరు దర్శనమిచ్చి, “శిరిడీకి రా! నీ రాముడు ఇక్కడున్నాడు. కాబట్టి తరచూ నీకిష్టమైనప్పుడు వస్తూండు” అని చెప్పాడు. శిరిడీ గురించి, బాబా గురించి అంతకుముందెప్పుడూ విననందువల్ల తనకు కలలో కనిపించిన ఫకీరు ఎవరో, శిరిడీ ఎక్కడుందో ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమె తనకొచ్చిన కల గురించి తన గురువుతో చెప్పినప్పుడు అతను శిరిడీ గురించిన అన్ని వివరాలూ ఆమెతో చెప్పాడు. తరువాత 1913లో మొదటిసారి శిరిడీ దర్శించే అవకాశం ఆమెకు లభించింది. బాబాను చూస్తూనే తనకు కలలో కనిపించిన ఫకీరు వారేనని ఆమె గుర్తించింది. వారి దర్శనంతో ఎంతో తృప్తిచెంది వారి అనుమతి తీసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయింది.
1917లో ఆస్తి సంబంధిత సమస్యలతో ఆమె చాలా ఆందోళన చెంది మరోసారి శిరిడీ సందర్శించింది. ఆమె షామాను కలిసి అతనియందు నమ్మకముంచి, “నాకు మా మామగారు విస్తారమైన వ్యవసాయభూమిని బహుమతిగా ఇచ్చారు. కానీ నా తండ్రి ఆ భూమిని స్వాధీనం చేసుకొని నాకు తిరిగి ఇవ్వడంలేదు. నా ఈ సమస్య గురించి నా తరపున మీరు బాబాతో మాట్లాడండి” అని విన్నవించుకుంది. అయితే, షామా ఆమెనే నేరుగా బాబాతో మాట్లాడమని చెప్పాడు. ఆ సమయంలో బాబా మసీదు గోడకు అనుకొని నిలబడి ఉన్నారు. కొద్దిసేపటి తరువాత బాబా మసీదు లోపలికి వెళ్లి తమ ఆసనంపై కూర్చున్నారు. అణ్ణా చించణీకర్ బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాడు. లక్ష్మీబాయి మసీదు మెట్లెక్కి పైకి వెళ్లి కూర్చుంది. కానీ ఏమీ మాట్లాడలేదు. బాబా జోగ్‌తో, “అణ్ణా కాకీ(అత్త)ని మోసం చేసి తన ఆస్తులన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టాడు. అతను నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు” అని అన్నారు. అదంతా వింటున్న అణ్ణా చించణీకర్, తాను అలాంటి పని చేయలేదని బదులిచ్చాడు. బాబా లక్ష్మీబాయి వైపు తిరిగి, “కాకీ! అతనిని తిననివ్వు; తింటున్నది అణ్ణాయే కదా! అతనిపై ఫిర్యాదు నమోదు చేయవద్దు. అల్లా నీకు తగినంత ఇస్తాడు. నీ ఇంట్లో అన్నానికి కొరత ఉండదు. నువ్వు, నేను మరియు అణ్ణా వెళ్లి నాసిక్‌లో నివాసముందాం” అని అన్నారు. అది విన్న లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది. కారణం, ఆమె తండ్రి పేరు ‘అణ్ణా’. అతను ఆమెకు సంబంధించిన వ్యవసాయభూములను మోసం చేసి తీసుకున్నందున, అతనిపై ఫిర్యాదు చేయమని చాలామంది శ్రేయోభిలాషులు ఆమెకు సలహా ఇచ్చి ఉన్నారు. కానీ ఆమె మాత్రం బాబా సలహాననుసరించి తన తండ్రిపై ఫిర్యాదు చేయకుండా ఊరుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె నర్సింగ్, ప్రసూతి వైద్యం నేర్చుకొని తద్వారా వచ్చే సంపాదనతో నాసిక్‌లో హాయిగా జీవించసాగింది.
బాబా ఆమెకు శాంతిని, సామరస్యతను ప్రసాదించారు; సబూరీని బోధించారు. ఎందుకంటే, రోజూ కోర్టు చుట్టూ తిరిగినట్లయితే ఆమె ఎంతో ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యేది. అంతేకాదు, తోడుగా ఉంటూ ఆమె సంక్షేమాన్ని చూసుకుంటామని బాబా ఆమెకు భరోసా ఇచ్చారు.
సోర్స్: శ్రీసాయిలీల పత్రిక-1926.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDelete🙏💐🙏 ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalani nannu ma kutumbanni ayur arogyalatho ashtaishwaryalatho kapadandi tandri, amma nannala purti badyata meede tandri, ninna ofce lo problem nunchi kapadinanduku chala thanks tandri, ika mundu kuda ofce lo intlo situations anni bagunde la chayandi tandri pls.
ReplyDeletePrashantatani evvandi baba pls.
ReplyDelete