సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వ్యాస్


ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ఖాండ్వా వెళ్ళినప్పుడు పురుషోత్తం బి. వ్యాస్ ని కలుసుకొని, అతనికి బాబా దైవత్వం గురించి, అద్భుత లీలల గురించి చెప్పాడు. దానితో వ్యాస్ శిరిడీ వెళ్లి బాబా ఆశీస్సులు పొందాలని ఆరాటపడ్డాడు. కానీ కొన్ని కారణాలరీత్యా అతను శిరిడీ వెళ్ళలేకపోయాడు. ఒకరాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, "ఈ గురుపౌర్ణమికి నువ్వు శిరిడీ వెళ్లాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వు అయ్యింది" అని చెప్పాడు. అది బాబా తనకిచ్చిన ఉత్తర్వుగా భావించి అతడు గురుపౌర్ణమినాడు శిరిడీ దర్శించి అద్భుతమైన అనుభవాన్ని పొందాడు.

తరువాత ఒకరాత్రి అతను శిరిడీ నుండి తిరిగి ఇంటికి వెళ్లేసరికి ఇంటిగేటు తనకోసం తెరచి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతని కుమార్తె ఇలా చెప్పింది: "కలలో బాబా కనిపించి, 'ఇంటి గేటు తెరచి ఉంచు, ఈ రాత్రి వ్యాస్ ఇంటికి తిరిగి వస్తున్నాడు' అని చెప్పారు" అని. ఆ శిరిడీ యాత్ర తరువాత తరచూ అతనికి కలలో బాబా కనిపించి, అతనిని మాధ్యమంగా చేసుకొని బాధలలో ఉన్న ప్రజలకు చికిత్స, సహాయం చేస్తూ ఉండేవారు.

ఒకసారి వ్యాస్ పొరుగింటివాళ్ళ కుమారుడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు అతని జీవితం మీద ఆశ వదులుకున్నారు. ఆ సమయంలో ఒక రాత్రి వ్యాస్‌కు కలలో బాబా కనిపించి, పిల్లవాడి మెడలో తమ లాకెట్టు కట్టమని చెప్పి, "పిల్లవాడు కోలుకుంటాడ"ని హామీ ఇచ్చారు. మరుసటిరోజు వ్యాస్ వాళ్ళ ఇంటికి వెళ్లి, తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పిల్లవాడి మెడలో లాకెట్టు కట్టి వెళ్లిపోయాడు. మూడురోజుల తరువాత, పిల్లవాడికి నయమైందని, ఇప్పుడు కోలుకుంటున్నాడని ఆ పిల్లవాడి తల్లి ఎంతో ఆనందంగా వ్యాస్‌తో చెప్పింది.

వ్యాస్ తన ఇంటి పైఅంతస్తులో ఒక బాబా చిత్రపటాన్ని ఉంచి పూజిస్తుండేవాడు. ఒకసారి షామా అతని ఇంటిని సందర్శించాడు. అతను షామాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాలులో పడక ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి షామాకు ఒక కల వచ్చింది. అతడు ఆ కలలో బాబా మెట్లు ఎక్కుతుండటం చూసి, "దేవా! మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు. బాబా ఆగి, "నీకు తెలియదా, నేనిక్కడ పైఅంతస్తులో ఉంటున్నాన"ని చెప్పి అదృశ్యమైపోయారు.

ఒకప్పుడు వ్యాస్ బావమరిది తనకున్న ఆవు పాలు ఇవ్వట్లేదని, దానికి పుట్టిన దూడలు మరణిస్తున్నాయని కలతచెందాడు. అప్పుడు వ్యాస్, 'తన బావకు సహాయం చేయమ'ని బాబాను ప్రార్థించి, ధ్యానం చేశాడు. తరువాత అతను ధ్యానం నుండి బయటకు వచ్చినప్పుడు, "ఆవు మెడలో ఒక లాకెట్టు కట్టమ"నే  బాబా సందేశాన్ని అందుకున్నాడు. వెంటనే అతడు బాబా ఆజ్ఞాపించినట్లు చేశాడు. కొద్దిక్షణాల్లో ఆ ఆవు ఆరోగ్యకరమైన దూడకు జన్మనిచ్చింది, దూడ క్షేమంగా ఉంది. తరువాత ఆవు సమృద్ధిగా పాలిచ్చింది. ఈ విధంగా బాబా కృపతో వ్యాస్ ఒక ఆవుకు, ఎంతోమంది వ్యక్తులకు సహాయం చేశాడు.

బాబాయే ప్రభుత్వం. మనం ఆయన పాదాలను ఆశ్రయించి, ఆయన ఆదేశాలను పాటించాలి. ఒకసారి మనం ఆయనను ఆశ్రయించాక ఆయన ఎప్పటికీ మనతో ఉంటారు. బాబా చాలా దయగలవారు.

సమాప్తం. 

రెఫ్: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై రామలింగస్వామి.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba 🙏lockets ekkada untayiii sai

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo