ఈ భాగంలో అనుభవాలు:
- మానసిక వ్యధను తీర్చిన బాబా
- మనల్ని సంస్కరించేందుకే బాబా సమస్యలను ఇస్తారు
మానసిక వ్యధను తీర్చిన బాబా
ఓం శ్రీ సాయిరామ్!
నా పేరు బాలాజీ, నేను పుట్టపర్తి నివాసిని. నేను సాయిబాబా భక్తుడిని. మానసికంగా నాకెప్పుడు బాగలేకపోయినా శిరిడీ సాయిబాబా కలలో నాకు దర్శనమిస్తూ ఉంటారు. అలా ఇప్పటికి 24 సార్లు దర్శనమిచ్చారు. అలాంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2019లో కొన్ని సమస్యల కారణంగా మా ఇంట్లో అందరం ఆ సంవత్సరమంతా మానసికంగా చాలా బాధపడ్డాము. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఆ సమస్యలతో బాబా గుడికి వెళ్లడం మానేశాను. నెమ్మదిగా బాబాని ప్రార్థించడం కూడా మర్చిపోయాను. ఇలా ఆ సంవత్సరం స్తబ్దంగా సాగిపోయింది. క్రొత్త సంవత్సరం వచ్చింది. 2020, జనవరి 1వ తారీఖు తెల్లవారుఝామున 4 గంటలకు నాకొక కల వచ్చింది. కలలో నేను ఎడమవైపుకు తిరిగి పడుకొని ఉన్నాను. నా ప్రక్కనే శిరిడీలోని విగ్రహరూపంలో ఉన్న బాబా పడుకొని ఉన్నారు. నేను ఆయన ఎడమకంటిని తదేకంగా చూస్తూ 'ఎంత బాగుంది!' అని అనుకుంటున్నాను. బాబా కూడా నావైపు అలానే చూస్తున్నారు. అంతలో హఠాత్తుగా తెలుపురంగులో ఉన్న విగ్రహం కన్ను కాస్తా మనిషి కన్ను మాదిరిగా నలుపురంగులోకి మారింది. తరువాత బాబా పిచ్చి ఫకీరులా మారి లేచి కూర్చున్నారు. నేను కూడా లేవబోతుంటే ఆయన, "ఎందుకు లేస్తున్నావు? పడుకో, పడుకో" అంటూ నావైపు ఆభయహస్తం చూపించారు. తరువాత బాబా చనిపోయిన మా నాన్నగారిలా మారిపోయారు. కొద్దిసేపట్లో మళ్ళీ పిచ్చి ఫకీరులా, మళ్ళీ నాన్నలా వెంటవెంటనే మారిపోతున్నారు. నేను భయంతో ఆందోళన చెందుతుంటే బాబా నాతో, "ఇప్పుడు ఏమైనా అడుగు. ప్రపంచంలో ఏది కావాలన్నా అడుగు, ఎవరి గురించి కావాలన్నా అడుగు, చెప్తాను" అన్నారు. నేను, "బాబా! నా పరిస్థితి ఏమీ బాగాలేదు. మీరెందుకిలా చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది బాబా" అని అన్నాను. అందుకాయన, "నీ ఒక్కడి గురించే అడిగితే నేనెందుకు చెప్తాను? నేను చెప్పను" అన్నారు. అప్పుడు నేను, "మా ఇంటిలో అందరి పరిస్థితీ ఇలానే ఉంది. మానసికంగా ఏమీ బాగాలేదు. అందరి గురించి చెప్పండి" అని అన్నాను. బాబా మా ఇంటిలోని అందరివైపు చూస్తూ ఇంగ్లీషులో, ”ఆల్ ఆర్ హ్యాపీ” అని మూడుసార్లు అన్నారు. అప్పటినుండి మా ఇంటిలో సంతోషం వెల్లివిరిసింది. మేము చెప్పలేనంత ఆనందంగా ఉన్నాము. "థాంక్యూ బాబా! మీ కృప ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను".
జై బోలో శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అవకాశమిచ్చినప్పుడు మరికొన్ని అనుభూతులను మీతో పంచుకుంటాను.
జై సాయిరామ్!

మనల్ని సంస్కరించేందుకే బాబా సమస్యలను ఇస్తారు
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాధారణ సాయిభక్తుడిని. నాకొచ్చిన ఒక సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని మీతో పంచుకుంటానని బాబాతో నేను చెప్పుకున్నాను. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
నేను ఒక ఎం.ఎన్.సి సంస్థలో హెచ్.ఆర్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాను. మాకు చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఇటీవల నేను వాటిని అనుసరించకుండా ఒక అభ్యర్థిని నియమించి తప్పు చేశాను. ఆ సమయానికి కాస్త ముందే కొత్త మేనేజర్ బాధ్యతలు తీసుకున్నారు. అతడు వృత్తిలో చాలా సిన్సియర్ అని పేరున్నందున నేను చాలా భయపడ్డాను. అందువలన నేను, "బాబా! ఈరోజు గురువారం, రేపటికల్లా ఈ సమస్యను పరిష్కరించి వారాంతంలో నేను ప్రశాంతంగా ఉండేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా మార్గాలు బాబాకి ఉంటాయి. అవి మనకు అర్థం కావు. సమస్య శుక్రవారం పరిష్కారం కాలేదు. కాబట్టి, నేను ఆ వారాంతమంతా బాబాని ప్రార్థిస్తూ గడిపాను. సోమవారంనాడు నేను మొత్తం పరిస్థితిని నా మేనేజర్ ముందుంచాను. ఆశ్చర్యకరంగా అతను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. అది కేవలం బాబా వల్లే సాధ్యమైంది. నిజం చెప్పాలంటే బాబాని ప్రార్థించే విషయంలో నేను కొన్ని రోజుల నుండి సోమరిగా ఉన్నాను. దాన్ని ఈవిధంగా సరిచేశారు బాబా. మనల్ని సంస్కరించేందుకే బాబా సమస్యలను ఇస్తారని ఈ అనుభవం ద్వారా నాకు అర్థమైంది. ఆయనకు మననుండి కావలసింది భక్తి, విశ్వాసాలు మాత్రమే!
మరోసారి కూడా నేను నా నిర్లక్ష్యం కారణంగా తప్పు చేశాను. అప్పుడు కూడా బాబా నన్ను కాపాడారు. అప్పుడు నేను ఆయనపై నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోనని బాబాకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఏమైనా జరిగితే, నేను కళ్ళు మూసుకుని, “బాబా, మీకు ఏది సరైనదనిపిస్తే అది చేయండి. ఏదెలా ఉన్నా మీరు నాతో ఉన్నారని ఖచ్చితంగా నాకు తెలుసు” అని ప్రార్థిస్తాను. ఆయన బలమైన ఆటుపోట్ల నుండి నా జీవితనౌకను భద్రంగా పయనింపజేస్తున్నారు. నేను విచారంగా, బాధగా ఉన్న రోజులలో బ్లాగు చదువుతాను. అనేకమంది భక్తులు పంచుకున్న అనుభవాలను చదవడం ద్వారా నేను ఉత్సాహాన్ని పొందుతున్నాను. నా అనుభవాన్ని చదివిన మీకు నా ధన్యవాదాలు. బాబా మన అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఓం సాయిరామ్!
source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2557.html?m=0

మీ కృప ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను".
ReplyDeleteజై బోలో శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!