ఈ భాగంలో అనుభవాలు:
- బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు
- బాబా అనుగ్రహంతో ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది
బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఓం సాయిబాబా! బాబా భక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు, వాటి ద్వారా మాలో భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందడానికి, సహనం అలవడటానికి ఉపయుక్తంగా ఉన్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. మాటలకు అందని సాయి ప్రేమకి చాలా చాలా కృతజ్ఞతలు. నా ప్రార్థనలకు సమాధానం లభించిన తర్వాత నా అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
గత 13 సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తురాలిని. దాదాపు ప్రతిసారీ నా ప్రార్థనలకు బాబా సమాధానం ఇచ్చారు. నా జీవితంలో ఆయన ఉనికిని నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నాను. చదువులో మంచి గ్రేడ్, మంచి ఉద్యోగం, వివాహం ఇలా ప్రతి విషయంలో ఆయన నాకు సహాయం చేశారు. ఆయన లేకుండా నేను లేను. ఆయన కృపతో ఈరోజు నేను మంచి విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. బాబా నాకు మంచి స్నేహితుడు.
నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా వివాహమైన తరువాత ఉద్యోగరీత్యా నేను, నా భర్త వేర్వేరు నగరాల్లో ఉంటున్నాము. అక్కడున్న పరిస్థితుల వలన మావారు తరచూ నా దగ్గరకు వచ్చే అవకాశం లేకుండాపోయింది. నా భర్త ప్రభుత్వ బ్యాంకులో పని చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా మావారు చాలా నిరాశకు గురయ్యారు. అంతేకాదు, ఆ పరిస్థితులు మా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయి. అందువలన ఆయన తన బ్యాంకులో వేరే పొజిషన్ కోసం దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు మానసిక ఒత్తిడి కారణంగా ఆయన సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ ఎలాగైనా అందులో ఎంపిక అయితే బాగుంటుందని ఆశపడ్డారు. ఆ విషయమై నేను హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించి సచ్చరిత్ర సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. 6వ రోజు బాబా అనుగ్రహం మాకు లభించింది. మావారు ఆ పొజిషన్‌కి ఎంపికైనట్లు శుభవార్త వచ్చింది. నేను, మావారు చాలా సంతోషంగా సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మా వారికి త్రివేండ్రంలో పోస్టింగ్ వచ్చింది. మేమిద్దరం త్వరలోనే అక్కడకు వెళ్తున్నాము. బాబా దయతో మేము కలిసి ఉండబోతున్నాము. మేము అక్కడికి వెళ్ళాక నాకు కూడా ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వమని సాయిని ప్రార్థిస్తున్నాను. ఆయన అనుగ్రహిస్తే, ఆనందకరమైన కుటుంబ జీవితంతో పాటు మంచి వృత్తి జీవితాన్ని కూడా కొనసాగించగలను. ఈ విషయంలో సాయి నాకు సహాయం చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. "బాబా! దయచేసి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2567.html

బాబా అనుగ్రహంతో ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది
సాయిభక్తురాలు శ్రీమతి శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శిరీష. ఇంతకుముందు నాకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు వారం రోజుల క్రితం జరిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మా పాపకి FA–IV (Formative Assessment) పరీక్షలు ఫిబ్రవరి 17వ తారీఖు నుండి మొదలయ్యాయి. అంతేకాదు, శివరాత్రిరోజున (21వ తారీఖున) మా పాప కూచిపూడి నాట్యప్రదర్శన అమరావతిలో ఉంది. అయితే రెండవరోజు పరీక్ష రాసిన మా అమ్మాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఇంటికి వచ్చింది. తననలా చూసి నేను చాలా ఆందోళనపడ్డాను. మా పాపకు జ్వరం తగ్గించమని బాబాని ఆర్తిగా వేడుకున్నాను. జ్వరం తగ్గిపోతే గురువారంనాడు మా పాపని బాబా మందిరానికి పంపిస్తానని, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాని ప్రార్థించి, పాపకి జ్వరం టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. ఉదయానికల్లా మా పాపకి జ్వరం తగ్గిపోయింది. ఎప్పుడూ టాబ్లెట్‌తో పాటు బాబా ఊదీని నీటిలో కలిపి త్రాగించడం నాకు అలవాటు. కానీ ఈసారి మాత్రం నెలసరి సమయం కావటంవల్ల నేను ఊదీ ఇవ్వలేకపోయాను. కానీ, ఎప్పుడూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని రక్షించే బాబా ఉదయానికల్లా మా పాపకు జ్వరం తగ్గిపోయేలా చేశారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

Om sai ram 🌹🙏🌹
ReplyDelete