ఈ భాగంలో అనుభవం:
- బాబా నుండి పొందిన షరతులు లేని ప్రేమ - మూడవ భాగం
క్షేమంగా ఇంటికి చేర్చి బాబా నేర్పిన పాఠం
2007లో నేను బెంగళూరులో ఉద్యోగం చేసేదాన్ని. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా భారీవర్షం కురిసింది. ఇంటికి చేరుకోవడానికి నాకు ఎలాంటి రవాణా సౌకర్యం దొరకలేదు. ఫోనులో బ్యాటరీ అయిపోయింది. చివరికి షేరింగ్ ఆటోలో నేను సగం దూరం వరకు చేరుకున్నాను. అక్కడ చుట్టూ చెట్లు తప్ప ఏమీలేవు. విద్యుత్తు లేనందున చాలా చీకటిగా ఉంది. పైగా జోరున వర్షం పడుతుండటంతో నిలబడటానికి చోటు కూడా లేదు. ఆ వర్షంలో నేను ఇంటికి చేరుకోలేనేమో అని అనుకున్నాను. బాబాని ప్రార్థిస్తూ, 'సాయి..సాయి' అని జపించడం మొదలుపెట్టాను. 108 సార్లు జపం చేసేలోపు ఒక ఆటో నా వద్దకు వచ్చి ఆగింది. డ్రైవర్, "ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. నేను ఏదీ చెప్పకముందే అతను నన్ను ఆటోలో కూర్చోమన్నాడు. అతను చూడటానికి పొట్టిగా, చాలా నల్లగా, అనుమానాస్పదంగా ఉన్నాడు. సాధారణంగా అయితే నేను ఆటో ఎక్కేదాన్ని కాదేమో, కానీ నేను బాగా తడిసిపోయి ఉన్నాను, వేరే మార్గం కూడా లేదు. కాబట్టి బాబాపై విశ్వాసముంచి ఆటో ఎక్కాను. అతను, ”మేడం! ఈ భారీవర్షంలో, ఈ చీకటిలో ఈ ప్రమాదకరమైన రహదారిలో రాత్రి 8:30 సమయంలో ఒంటరిగా ఎలా నిలబడగలిగారు? మీ పరిస్థితి ఏమిటో మీకు తెలుసా? పైగా బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి” అని అన్నాడు. "బాబా! మీరేనా నాతో మాట్లాడుతున్నారు?" అని ఆశ్చర్యంగా నాలో నేను బాబాతో మాట్లాడుకుంటున్నాను. అంతలో అతను నాతో, “అవును, నిన్ను సురక్షితంగా ఇంటికి చేర్చడానికే నేను ఇక్కడ ఉన్నాను” అని చెప్పాడు. నేను అవాక్కైపోయాను. నిజానికి ఆ రోజుల్లో బెంగళూరులో రాత్రి 8 గంటల తరువాత ఆటోలు ఉండేవి కావు. ఒకవేళ ఎక్కడో ఒకటి ఉన్నా, రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు అడుగుతారు. కానీ అతను మాములుగా తీసుకునే మీటర్ ఛార్జీని అడిగాడు. నేను అతనికి కృతజ్ఞతలు చెప్తూ, "మీటర్ మీద ఎక్కువ డబ్బులు తీసుకోమ"ని అన్నాను. అతను, "నాకు మీటర్ ఛార్జీ కన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి" అని అన్నాడు. ఆ వ్యక్తి బాబా కాక వేరెవరు అవుతారో చెప్పండి! నాకు మాత్రం ఆ భయంకరమైనరోజున అతని రూపంలో వచ్చింది నా బాబానే! ఈ అనుభవం ద్వారా 'రూపాన్ని చూసి, ఏదీ నిర్ధారించుకోవద్ద'ని బాబా నాకు పాఠం నేర్పారు.
సంతానభాగ్యం
నాకు పిసిఓడి(Polycystic ovary disease) సమస్య ఉంది. అందువలన పెళ్ళైన 3 సంవత్సరాల వరకు నేను గర్భం దాల్చలేదు. నేను పిల్లలకోసం బాబాను ప్రార్థించి, సాయిసచ్చరిత్ర పారాయణ చేశాను. సాధారణంగా నేను సప్తాహపారాయణ పూర్తి చేసినప్పుడల్లా ఏదో ఒక పవిత్రక్షేత్రాన్ని దర్శించే అవకాశం నాకు లభిస్తుంటుంది. ఈసారి నేను పారాయణ ముగించిన తరువాత శిరిడీ వెళ్ళాను. శిరిడీ నుండి వచ్చిన కొద్దిరోజుల్లోనే నేను గర్భం దాల్చాను. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం డెలివరీ సమయంలో నాకు చెడుదశ ఉందని తెలిసింది. అదే నిజమన్నట్లు డాక్టర్లు కూడా కొన్ని సమస్యల కారణంగా నార్మల్ డెలివరీకి అవకాశం లేదని, 2008 ఏప్రిల్ 21న సిజేరియన్ చేయడానికి నిర్ణయించారు. ఏప్రిల్ 8న నేను ఒక పుస్తకం చదువుతున్నాను. తరువాత కలలో బాబా, ”అవును, జ్యోతిష్యశాస్త్ర ప్రకారం డెలివరీలో నీకు ఇబ్బందులు ఉన్నాయి. కానీ నువ్వు ఆందోళనపడకుండా ప్రశాంతంగా ఉండు. నేను అంతా చూసుకుంటాను. నన్ను నమ్ము. మూడురోజులు పవిత్ర గ్రంథాలను చదువుతూ ఉండు, వాటిని క్షణం కూడా వదిలిపెట్టవద్దు. 3వ రోజు నీకు మగబిడ్డ పుడతాడు" అని చెప్పారు. మా అమ్మ, మిగతా కుటుంబసభ్యులు ఆందోళనపడుతూ ఏప్రిల్ 21న జరగబోయే ఆపరేషన్ కోసం వారి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను మా అమ్మతో, "ఏప్రిల్ 12న నాకు అబ్బాయి పుట్టబోతున్నాడు. నాకు నార్మల్ డెలివరీ అవుతుంది" అని చెప్పాను. మా అమ్మ బాబాకు గొప్ప భక్తురాలైనప్పటికీ ఆమె నన్ను నమ్మలేదు. 9వ తేదీ రాత్రినుండి నాకు నొప్పులు మొదలయ్యాయి. 12వ తేదీ ఉదయాన నేను హాస్పిటల్‌కి వెళ్తానని అన్నాను. ఉదయం 8:30 ప్రాంతంలో నేను సుమారు 1/4 కి.మీ. దూరంలో ఉన్న హాస్పిటల్‌కి నడుచుకుంటూ వెళ్ళాను. వాళ్ళు నన్ను పరీక్షించి, గర్భసంచి చిరిగిపోయింది, వెంటనే ప్రసవానికి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రసవ సమయంలో నేను మొదటిసారి నా తలపై బాబా చేతిస్పర్శను స్పష్టంగా అనుభూతి చెందాను. మధ్యాహ్నం గం.1:10ని.లకి నేను బాబా చెప్పినట్లుగానే మగబిడ్డకు జన్మనిచ్చాను.

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....
Om sai ram 🙏🙏
ReplyDelete🌹🌹Om sai ram 🌹🌹🙏🙏
ReplyDeleteOm sai ram nenu me meeda poorti nammakamto unnanu . Na bidda ki arogyam bagu cheyyi tandri.
ReplyDeleteOM SAIRAM
ReplyDelete