సాయి వచనం:-
'పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితులలోనూ అప్పు చేయవద్దు!'

'సాయి మాటలను విశ్వసించక, సాయిభక్తులు జ్యోతిష్కుల చుట్టూ, వాస్తు సిద్ధాంతుల చుట్టూ తిరగడం, కొందరు ప్రముఖ సాయిభక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ జోస్యాలు చెప్పడం, ఎందరో జోస్యాలరాయుళ్ళు, 'ప్రశ్నల' పరమహంసలకు శ్రీసాయి 'కులదైవం' కావడం - శోచనీయం!' - శ్రీబాబూజీ.

హంసరాజ్


సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ రెండు బాధలూ నివారించమని నాసిక్ నివాసి, దిగంబరియైన నరసింగ్ మహరాజ్ అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు. "అతని దేహాన్ని ఒక భూతమావేశించి సంతానం లేకుండా చేస్తోందని, సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతార"నీ ఆ మహనీయుడు చెప్పారు. 

అతడు, శ్రీమతి కాశీబాయి హంసరాజ్ డిసెంబర్, 1916లో సాయిని దర్శించగానే, అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి, "దుష్టగ్రహమా, పో బయటకు!" అని గద్దించారు. కొద్దికాలానికి అతడికి సంతానం కల్గింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యము ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది.

అప్పటినుండి వారిద్దరూ 6 నెలలపాటు షిరిడీలో ఉన్నారు. షిరిడీ రాకమునుపు హంసరాజ్ రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బసంతో బాధపడేవాడు. బాబాను దర్శించిన తరువాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రము ఉండేది, రాత్రిళ్ళు ఇబ్బంది పెట్టేది కాదు. కానీ బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. షిరిడీ వచ్చిన కొత్తలో శ్రీమతి హంసరాజ్ భర్తకి రోజూ ఉబ్బసానికి మందు ఇచ్చేది. అది చూసి బాబా ఆమెతో, “నాకూ ఉబ్బసవ్యాధి ఉంది. నీవు నీ భర్తకు మందిస్తున్నట్లుగానే నాకు కూడా వేలమంది స్త్రీలు మందు ఇవ్వగలరు. కానీ ప్రయాజనమేముంది? అల్లా మాలిక్ హై – భగవంతుడే యజమాని” అన్నారు. అప్పటినుండి ఆమె తన భర్తకు మందు ఇవ్వడం మానివేసింది.

ఆ వ్యాధిని నివారించే క్రమంలో బాబా అతనికి పుల్లని, ఘాటైన పదార్థములు తినవద్దని చెప్పారు. ముఖ్యంగా పెరుగు తినడం నిషేధించారు. కాని పెరుగు పట్ల అమిత ఇష్టం వలన హంసరాజ్, ప్రాణాన్నయినా విడుస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేనని భార్యతో చెప్పి, మూర్ఖించి, రోజూ భార్యతో పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. బాబా ఏదో ఒకవిధంగా రెండు నెలలపాటు అతడు పెరుగు తినకుండా కాపాడుతూ వచ్చారు. 

రోజూ ఆ యిద్దరూ ఆరతికి మశీదుకి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడా వెళ్ళక, పొంచివుండి, పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే, ఆ పిల్లి బాధతో ఏడుస్తూ పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా, "ఇక్కడొక మూర్ఖుడు పుల్లపెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కానీ రోజూ అతను తినకుండా చూస్తున్నాను. ఒక పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు! ఇక్కడ చూడండి" అంటూ బాబా తమ వీపు చూపారు. హంసరాజ్ పిల్లి వీపుపై కర్రతో కొట్టినందువలన బాబా వీపుపై ఏర్పడిన వాతలు చూసి, తాను చేసిన తెలివితక్కువ పనికి పశ్చాత్తాపం చెంది, అప్పటినుండి బాబా తినవద్దని చెప్పిన వాటిని తినడం మానేసాడు. ఆరు నెలలలో అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ఏ మందూ లేకుండానే అతని వ్యాధి సాయి అనుగ్రహము వలన నయమైంది. సాయి ఒకవంక భక్తులను రక్షిస్తూ, మరొకవంక వారినుండి తిట్లు, దెబ్బలు భరించవలసివచ్చేది.

సాయి ఒక్కొక్కసారి ఆరు వారాల దాకా స్నానం చేసేవారు కాదు. అటువంటి సందర్భాలలో ఎవరైనా స్నానం చేయమని  చెబితే, “నేనిప్పుడే కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి వచ్చాను, మరల ఇక్కడ స్నానమెందుకు?” అని, లేదా “నేనిప్పుడే కొల్హాపూర్ మరియు ఔదుంబర్ వాడి వెళ్లి వస్తున్నాను” అని బాబా అంటుండేవారని శ్రీమతి హంసరాజ్ చెప్పారు. నిత్యం కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్న మాట.

3 comments:

  1. Om Sree Sachidhananda Samarda Sadguru Sree Sai Nadhaya Namaha

    ReplyDelete
  2. సాయిరాం సాయిరాం.. సాయిశ్వరా .. శత సహస్ర కోటి నమస్కారాలు.. మాకున్న అనారోగ్య సమస్యలను పూర్తిగా నిర్మూలించి రూపుమాపి నందుకు థాంక్యూ థాంక్యూ సాయిరాం బాబా దేవా.. నీవే దిక్కు నీవే రక్ష నీవే సర్వస్వము సాయిదేవా బాబా దేవా..

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo