సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ జోగ్లేకర్



శ్రీ జోగ్లేకర్ ఇండోర్ నివాసి. అతను గరుడేశ్వర్‌కి చెందిన శ్రీటెంబేస్వామి (శ్రీవాసుదేవానంద సరస్వతి) భక్తుడు. భాగ్యంకొద్దీ అతని ఉపనయనం శ్రీటెంబేస్వామి ఆశీస్సులతో గరుడేశ్వర్‌లో జరిగింది. టెంబేస్వామి సమాధి చెందిన తరువాత జోగ్లేకర్ తాను ఒంటరివాడినైపోయానని, ఇక ఆధ్యాత్మిక మార్గంలో దారిచూపడానికి, పారమార్థిక అవసరాలు చూసుకోవడానికి తనకెవరూ లేరని దిగులుపడుతుండేవాడు. పగలు, రాత్రి అతనికి అదే చింత. ఒకరాత్రి అతనికి శ్రీటెంబేస్వామి స్వప్నదర్శనమిచ్చి, “కోపర్‌గాఁవ్ వెళ్ళు!” అని ఆదేశించారు. అంతే, కుటుంబసభ్యులతోగానీ, పనిచేసే కార్యాలయంలోగానీ ఒక్కమాటైనా చెప్పకుండా మరుసటిరోజు వేకువఝామునే అతను ఇంటినుండి బయలుదేరాడు.

కోపర్‌గాఁవ్ చేరుకున్నాక అక్కడొక గది అద్దెకు తీసుకొన్నాడు జోగ్లేకర్. అప్పటినుండి అతను ఆరునెలలపాటు ప్రతిరోజూ ఉదయాన్నే కాలినడకన శిరిడీ వెళ్లి మసీదులో బాబా ముందు కూర్చునేవాడు. అతను బాబాతో ఏమీ చెప్పలేదు, బాబా కూడా ఒక్కమాటైనా మాట్లాడలేదు. అతను చేసిందల్లా ఒక్కటే, తన హృదయాంతరాళాలలోనుండి పొంగిపొరలే గురుభక్తితో ప్రేమపూర్వకంగా బాబాను చూస్తూ ఉండటమే. ఆరునెలల తరువాత, తాను తెచ్చుకున్న డబ్బంతా అయిపోయిందని, కేవలం ఆరు అణాలే చేతిలో మిగిలాయని గుర్తించాడు జోగ్లేకర్. ఆరోజు అతను మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతనితో, “నీ పని పూర్తయింది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళు. ఇక ఇక్కడ క్షణమైనా ఉండకు” అని అన్నారు. దాంతో అతను ఇంటికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకొని కోపర్‌గాఁవ్ వైపు నడకసాగించాడు.

జోగ్లేకర్ కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్ సమీపిస్తుండగా వెనకనుండి ఎవరో వ్యక్తి అతని చొక్కా పట్టుకొని లాగి, ప్రయాణానికి అవసరమైన టికెట్, కొంత డబ్బు ఇచ్చాడు. జోగ్లేకర్ వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. కానీ ఆ వ్యక్తి బలవంతపెట్టడంతో వాటిని తీసుకుని రెండడుగులు ముందుకు వేసిన తరువాత ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుందామని జోగ్లేకర్ వెనక్కి తిరిగి చూసేసరికి అతను అదృశ్యమయ్యాడు. జరిగిన సంఘటనకు ఆశ్చర్యపోతూనే జోగ్లేకర్ రైలు ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని, “ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?” అని ప్రశ్నించసాగారు. అంతలోనే అతను పనిచేసిన కార్యాలయం నుండి ఒకతను వచ్చి, ‘యజమాని తనకోసం ఎదురుచూస్తున్నాడ’ని చెప్పాడు. తనను ఖచ్చితంగా ఉద్యోగం నుండి తొలగిస్తారని అనుకుంటూనే కార్యాలయానికి వెళ్ళాడు జోగ్లేకర్. ఆశ్చర్యంగా అక్కడ అందరూ అతనికి స్వాగతం పలికారు. ఆ మధ్యాహ్నం అతని యజమాని అతనికొక ప్యాకెట్ ఇచ్చాడు. అది తెరిచి చూస్తే అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. జోగ్లేకర్, “ఇది నేను న్యాయంగా సంపాదించింది కాదు” అని ఆ డబ్బును యజమానికి తిరిగి ఇచ్చేశాడు. అప్పుడతని యజమాని, “నువ్వు చూసుకోవడానికి నీకొక కుటుంబం ఉంది. గత ఆరునెలల సంపాదనగా భావించి దీనిని తీసుకో! ఇప్పుడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయం వచ్చి నీ విధులలో చేరు” అని చెప్పి ఒప్పించి ఆ డబ్బును జోగ్లేకర్‌కు ఇచ్చాడు.    

source సాయి ప్రసాద్ పత్రిక, 2003, దీపావళి సంచిక (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo