- బాబా నిత్యమూ మనతోనే ఉన్నారు
- నమ్ముకుంటే, బాబా ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు
బాబా నిత్యమూ మనతోనే ఉన్నారు
సాయిభక్తురాలు శ్రీమతి అలేఖ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ముందుగా ఈ బ్లాగుని నిరాటంకంగా నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అలేఖ్య. నేను ఏలూరు నివాసిని. నాకు, నా భర్తకు బాబా Ph.D ప్రసాదించిన అనుభవాన్ని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. శ్రీసాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ నాకు కలిగిన మరికొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మా అమ్మావాళ్ళు హైదరాబాదులో ఉంటారు. 2020 కరోనా కాలంలో లాక్‌డౌన్ వల్ల సంక్రాంతి తర్వాత మేము మా అమ్మావాళ్ళింటికి వెళ్ళలేదు. అందువల్ల అక్టోబరులో అక్కడికి వెళ్ళి, కొద్దిరోజులు అమ్మావాళ్ళతో కలిసి ఆనందంగా గడిపాము. తిరుగు ప్రయాణంలో ఏలూరుకి బయలుదేరాము. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. మేము కారులో క్షేమంగా ఇంటికి చేరుకున్నాక ఇంటి దగ్గర కారు పార్క్ చేశాము. మరుసటిరోజు నుండి కారు అసలు స్టార్ట్ అవలేదు. దాంతో మెకానిక్‌ని తీసుకుని వచ్చి చూపిస్తే, తను కారును పరిశీలించి, బ్రేక్ విరిగిపోయిందనీ, కొంచెం జామ్ అయిందనీ చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మేము రాత్రి 8 గంటలకి హైదరాబాదులో బయలుదేరితే ఏలూరు వచ్చేసరికి తెల్లవారుఝామున 2 గంటలయింది. మధ్యలో కారు ఎక్కడా ఆగలేదు, మాకు ఏ సమస్యా ఎదురవలేదు. అప్పుడు మాకు అనిపించింది, ‘ఆ సాయినాథుడు మన వెంట లేకపోయుంటే ఏమైపోయేవాళ్లమో!’ అని. సదా మమ్మల్ని కాపాడుతున్న సాయికి సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. సర్వం సాయిమయం.
సాయి మా నాన్నని కాపాడారు:
ఇటీవల మా నాన్నగారికి ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో సమస్య వచ్చింది. నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి స్కానింగ్‌తో పాటు కరోనా పరీక్ష కూడా చేయించాము. తనకు కరోనా పాజిటివ్ రాలేదుగానీ, సమస్యేమిటో మాకు అర్థంకాలేదు. డాక్టర్లు మా నాన్నగారిని ICU లో ఉంచి, ముందుగా 15 లీటర్ల ఆక్సిజన్ ఎక్కించారు. కరోనా కారణంగా మమ్మల్ని ICU లోకి రానివ్వలేదు. మాకు అసలేం జరుగుతోందో తెలియట్లేదు. అలా 15 రోజుల పాటు నాన్నగారిని హాస్పిటల్లో ఉంచి, ఆక్సిజన్ పరిమాణాన్ని రోజురోజుకూ తగిస్తూ వచ్చారు. 15వ రోజున 2 లీటర్ల ఆక్సిజన్ ఎక్కించారు. నాన్న ICU లో ఉన్నన్ని రోజులూ ప్రతిరోజూ నేను బాబాను ప్రార్థించి, బాబా ఊదీని పెట్టుకుంటూ, “బాబా! నాన్నకు మీ ఊదీ పెడదామంటే మమ్మల్ని ICU లోనికి వెళ్ళనివట్లేదు. కనుక, ఇక్కడ నేను పెట్టుకుంటున్న మీ ఊదీ ICU లో ఉన్న మా నాన్నకు చేరేలా చూడు తండ్రీ!” అని బాబాను వేడుకునేదాన్ని. 15 రోజుల తరువాత నాన్నని 2 లీటర్ల ఆక్సిజన్‌తో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. బాబా అనుగ్రహంతో నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఆ సాయినాథుడు లేకపోయుంటే మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః.
“బాబా! మీకు మాటిచ్చినట్లు నా రెండు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తులతో పంచుకున్నాను. నిత్యమూ మమ్మల్ని కాపాడు బాబా!”
నమ్ముకుంటే, బాబా ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. బ్లాగులో ప్రచురితమవుతున్న తోటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు ప్రశాంతత, ఆత్మస్థైర్యం, పాజిటివ్ ఎనర్జీ సమకూరుతున్నాయి. నా పేరు సురేష్. మేము విశాఖపట్నంలో నివసిస్తున్నాము. నాకు కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత బాబా చూపించిన ఒక నిదర్శనాన్ని నేనిప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను.
నాకు కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత డాక్టరు సలహామేరకు నేను మొదటిసారి 2020, అక్టోబరు 26న షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. ఏమీ తినకముందు, తిన్న తరువాత షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. నా వయసు 50 సంవత్సరాలు. అంతకుమునుపు నాకు షుగర్ లేదు. కోవిడ్ తర్వాతే ఎటాక్ అయ్యింది. దాంతో నేను చాలా ఆందోళనకు గురయి డాక్టరుని సంప్రదించాను. డాక్టరు రెండు నెలలకి మందులు వ్రాసిచ్చి, రెండు నెలల తర్వాత మరోసారి టెస్ట్ చేయించుకుని రమ్మన్నారు. నేను "షుగర్ నియత్రించమ"ని బాబాను ప్రార్థిస్తూ, రోజూ బాబాకు పూజ చేసిన ఊదీని మందుగా తీసుకుంటూ, రెండు నెలలు కాఫీ త్రాగడం మానేశాను. రెండు నెలల తరువాత 2020, డిసెంబరు 27న షుగర్ టెస్ట్ చేయించుకుంటే, బాబా దయవలన షుగర్ దాదాపు సాధారణ స్థాయికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ప్రసాదించిన ఆ సంతోషాన్నే ఈ బ్లాగ్ ద్వారా మీతో ఇలా పంచుకున్నాను. బాబాను నమ్ముకుంటే, ఆయన ఎల్లప్పుడూ మన వెంటే తోడుగా ఉంటారు. "మీరు చేసిన సహాయానికి చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
ఓం సాయిరామ్!
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteom sairam
ReplyDeleteom sai ram bless my family
ReplyDeleteOm Sai ram,,,,
ReplyDeleteOm Sai ram,,,,, bless my family,,,, na husband ki kutumba baadhyathalu thelisela chudandi,,,, thanu asalu evari maata vinatam ledhu,, plz baba
ReplyDeleteOm sai ram baba amma ki problem tondarga cure cheyi thandri pleaseeee baba
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDelete