సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 642వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. అయోమయస్థితిలో మార్గాన్ని చూపి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
  2. ఊదీ మహిమ
  3. బాబా ప్రేమ

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

అయోమయస్థితిలో మార్గాన్ని చూపి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా

రెండు నెలల క్రితం ఒకరోజు సాయంత్రం మా బాబు అనికేత్ ఆడుకుంటూ శానిటైజర్ త్రాగేశాడు. ఆ విషయం చెబితే మేము తనను కోప్పడతామేమోననే భయంతో వాడు ఆ విషయాన్ని మాతో చెప్పలేదు. ఆరోజు రాత్రి సుమారు గం.10:30కు తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందని ఏడవటం మొదలుపెట్టాడు. గ్యాస్ట్రిక్ సమస్యేమోనని అనుకుని అది తగ్గటానికి మందులు వేశాము. ఆ తరువాత రాత్రి 12 గంటల సమయంలో నన్ను దగ్గరకు పిలిచి తాను శానిటైజర్ త్రాగానని అసలు విషయం చెప్పాడు. అది వింటూనే నాకు చాలా భయమేసింది. ఆ శానిటైజర్‌లో ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువగా ఉండటంతో ఆందోళనగా అనిపించి బాబాను ప్రార్థించి, బాబా ఊదీని తన ఛాతీ భాగమంతా రాశాను. మరుసటిరోజు బాబుని హాస్పిటల్‌కి తీసుకొని వెళదామనుకున్నాము. కానీ, మేము ఎప్పుడూ మా బాబుని చూపించే డాక్టర్ సెలవులో ఉన్నారని తెలిసింది. కరోనా సమయం కావడంతో వేరే డాక్టర్ వద్దకు బాబుని తీసుకొని వెళ్ళడానికి భయమేసింది. అందువలన ప్రతిరోజూ వాడికి అసిడిటీ టాబ్లెట్ ఇస్తూ, నొప్పిగా ఉందంటున్న ప్రాంతంలో ఊదీ రాస్తూ ఉండేదాన్ని. అయినా వాడు ‘నొప్పి, నొప్పి’ అంటూ ఉండేవాడు. దాంతో మావారు కూడా చాలా భయపడుతుండేవారు. డాక్టరుకి చూపిద్దామంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియలేదు. ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండగా బాబానే మార్గం చూపారు

ఒకరోజు రాత్రి నేను సచ్చరిత్ర చదువుతూ, “ప్లీజ్ బాబా! ఎలాగైనా అనికేత్‌కి నొప్పి తగ్గించండి. వాడు అలా నొప్పితో బాధపడుతుంటే మాకు చాలా భయమేస్తోంది” అని బాబాను దీనంగా వేడుకున్నాను. తరువాత బాబుకి ఊదీ పెడుతూ, “ఊదీ ప్యాకెట్లు అయిపోవచ్చాయి, ఇప్పుడెలా బాబా?” అనుకున్నాను. పిలిచిన పలికే దైవం కదా మన బాబా. వెంటనే తమదైన శైలిలో బదులిచ్చారు. మా నాన్నగారికి ఆ ముందురోజే ఒక సాయిబంధువు క్రొత్తగా పరిచయమయ్యారు. ఆయన మొదటిసారి మా ఇంటికి వచ్చి, నన్ను పిలిచి నా చేతిలో కొన్ని ఊదీ ప్యాకెట్లు, బాబా సమాధికి తాకించిన పువ్వులు, తాళ్ళు ఇచ్చారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తరువాత ఆ అంకుల్ నాతో, “ఒక 18 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం, రాత్రి బాబా ముందు ఒక గ్లాసుతో నీళ్ళు పెట్టి, అందులో కొంచెం ఊదీ వేసి, ఉదయం పెట్టిన నీళ్లు సాయంత్రం, రాత్రి పెట్టిన నీళ్లు ఉదయం త్రాగండి. అలా చేస్తే, నీ మనసులో ఉండే బాధలన్నీ బాబా తీరుస్తారు” అని చెప్పారు. నేను మా బాబు నొప్పిని తగ్గించమని బాబాను ప్రార్థించి, గురువారం నుండి ఆ అంకుల్ చెప్పిన విధంగా చెయ్యడం ప్రారంభించాను. ఇక్కడ బాబా చేసిన మరో అద్భుతం గురించి కూడా చెప్పాలి. 

మా నాన్నగారికి బి.పి, రక్తపరీక్షలు చేయించమని డాక్టర్ చెప్పడంతో అవి చేయించేందుకు తెలిసిన ఒక అబ్బాయిని నేను మా ఇంటికి పిలిపించాను. మాటల మధ్యలో మా అమ్మ ఆ అబ్బాయితో మా బాబు సమస్య గురించి చెప్పింది. అతను ఒక మందు పేరు సూచించి దానిని వాడమని చెప్పాడు. నేను అతనితో, “బాబుని చూసే డాక్టరు అందుబాటులో లేర”ని అన్నాను. ఆ డాక్టరు పేరేమిటని అడిగాడతను. నేను డాక్టర్ పేరు చెప్పగానే, “ఆయన మా గురువుగారే”నని చెప్పి నాకు డాక్టరుగారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. అంతేకాదు, అతనే డాక్టరుగారికి ఫోన్ చేసి, మా బాబు పేరు, బాబు అనుభవిస్తున్న బాధ గురించి చెప్పి, ఏ మందులు వాడాలో కనుక్కుని, ఆ మందుల పేర్లు నాతో చెప్పాడు. ఆ మందులు వాడుతూ, ప్రతిరోజూ బాబా ఊదీతీర్థం సేవిస్తుండటంతో 15 రోజుల్లో మా బాబు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నేను అనుకున్న 18 రోజుల్లోపే బాబా నా సమస్యను తీర్చేశారు. బాబాపై ఆధారపడితే అన్నీ తానై నడిపించి మన కష్టాలను అధిగమింపజేస్తారు. “థాంక్యూ సో మచ్ బాబా!”

ఊదీ మహిమ

2020, అక్టోబరు రెండవవారంలో నాలుగురోజులపాటు నా ఒంట్లో చాలా నలతగా ఉంది. ఒక ముఖ్యమైన విషయమై ఎక్కువగా ఆందోళన చెందుతుండటం వలన వైట్ డిశ్చార్జ్ (తెల్లబట్ట) మొదలైంది. దానివల్ల కాళ్ళనొప్పులొచ్చి నడవడం కూడా కష్టమైంది. సమస్య తీవ్రంగా ఉండడంతో డాక్టరుకి చూపించుకుందామంటే, నేను అలవాటుగా చూపించుకొనే డాక్టరుగారి భర్తకి కరోనా వచ్చింది. అందువలన నేను బాబాపై భారం వేసి, బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగుతూ, గుర్తొచ్చినప్పుడల్లా ఊదీని నోట్లో వేసుకుంటూ ఉండేదాన్ని. దాంతోపాటు, అదివరకు నేను వేసుకున్న ఒక హోమియోమందు ఉంటే అది వేసుకొని, “ఈరోజు సాయంత్రానికల్లా నా సమస్య తగ్గినట్లయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల అక్టోబరు 11వ తేదీన నేను పనిమీద బయటికి వెళ్లి ఎంతసేపు తిరిగినప్పటికీ కాళ్ళనొప్పులు రాలేదు, పూర్తిగా తగ్గిపోయాయి.

బాబా ప్రేమ

2020, అక్టోబరు 20వ తేదీన మా బాబుకి కాస్త జలుబు చేసింది. నేను బాబాని ప్రార్థించి, బాబా ఊదీతో పాటు జలుబు తగ్గడానికి మందులు వేశాను. ఆ రాత్రంతా వాడు నిద్రలో కదులుతూ మూలుగుతూనే ఉన్నాడు. నేను ‘సాయిబాబా, సాయిబాబా’ అనుకుంటూ బాబుపై చేయివేసి అలానే నిద్రపోయాను. కాసేపటికి ఒక కల వచ్చింది. ఆ కలలో మా బాబు ఒక చిన్న గిన్నె పట్టుకొని, “మమ్మీ నాకు 101 రూపాయలు ఇవ్వు, బాబాకి ఇవ్వాలి” అని అడుగుతున్నాడు. నేనేమో, “నీకు ఇవ్వను, బాబాకే ఇస్తాను” అని చెప్తున్నాను. అంతలో నాకు మెలకువ వచ్చింది. “బాబాకు ఎలాగైనా రేపు 101 రూపాయలు దక్షిణ ఇవ్వాలి” అని అనుకుంటూ మరలా నిద్రపోయాను. అయితే ఆ విషయం నాకు మరుసటిరోజు సాయంత్రం 4 గంటల వరకు గుర్తురాలేదు. ఆ సమయంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సాయి మిరాకిల్స్ చదువుతుండగా ఒకసారి గుర్తువచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే మరచిపోయాను. ఇక బాబా లీల చూడండి. రాత్రి గం.7.30ని.ల సమయంలో మా చెల్లి ఫోన్ చేస్తే తనతో మాట్లాడాను. కాల్ కట్ చేసిన తరువాత చూస్తే, శిరిడీ సంస్థాన్ డొనేషన్ వెబ్‌సైట్ దానంతట అదే ఓపెన్ అయివుంది. నాకెంతో ఆశ్చర్యంగా అన్పించి, 'నేను మరచిపోయినా బాబా ఊరుకోరు, మన క్షేమం కోసం ఎంతో శ్రద్ధ వహిస్తారు' అని అనుకున్నాను. బాబా చూపుతున్న ప్రేమకు చాలా సంతోషంగా అనిపించింది. ఆలస్యం చేయకుండా బాబా అడిగిన 101 రూపాయల దక్షిణ సమర్పించాను. ఆశ్చర్యంగా మా బాబు జలుబు వెంటనే తగ్గిపోయింది. ఆ మరునాడు బాబా ప్రేమకు చిహ్నంగా ‘శ్రీసాయిసచ్చరిత్ర’ కొరియర్‌లో వచ్చింది. ప్రత్యేకించి ప్రేమ చిహ్నంగా అని ఎందుకు చెప్పానంటే, గతంలో రెండుసార్లు మా బాబుకి ఆరోగ్యం బాగోలేనప్పుడు, మరోసారి శిరిడీకి వెళ్లాలని వాడు బాబాను తీవ్రంగా ప్రార్థించినప్పుడు సాయి లీలా మరియు సద్గురు లీలా మ్యాగజైన్ రూపంలో బాబా మా ఇంటికి వచ్చారు. ఈవిధంగా మా బాబుపై బాబా ప్రేమను చూపుతూ వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని నిదర్శనం ఇస్తున్నారు. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ మా బాబుపై, మాపై సదా ఉండాలి. మీ నీడలో మేము సంతోషంగా ఉండాలి. చాలా చాలా ధన్యవాదాలు బాబా!" 

ఓం సాయిరామ్!!!

రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను...


9 comments:

  1. Om sai ram my medicines came in courier. That shop owner ever year they keep sai baba small book in it and they courier to me. I felt very happy baba blessed me and my family. When my father_in-law was alive he used to bring sai baba magazines to me. I felt sai blessed me

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. In that shop when we visit sai baba picture gives darshan. My self pay namaskar to him. That is the power of sai. I went to Sridi 4 times. With his blessings. My brother stays there in Aurangabad. Baba gave blessings to visit hlm. ❤🙏🙏🙏

    ReplyDelete
  4. Near my house there is sai baba temple. I visit that temple. I gave dakshin to him for Annadana. I gave him 51Rs in hundi. With his blessings I gave dakshin to Lord sai baba. My🙏🙏🙏 to him

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  6. Om sai ram baba amma ki problem cure cheyi baba nedhe bharam thandri maku dikku nuvve sai. Sai sai sai

    ReplyDelete
  7. Baba santosh ki manchi health ni prasadinchu thandri akaliga vunna valani nuvvu chudalevu baba naku telusu. akaliga vunna tinaleka ni bidda badapadtundu nuvve elagayne aa problem cure chesi annamu tinela chudu sai sada ne sevalo

    ReplyDelete
  8. Tq sairam for reminds me about donation. I sent to u donation tq sai lu sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo