ప్రసిద్ధ సంగీతకారుడైన నాన్హే బాబూజీ 1911, జనవరి 5వ తేదీన రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని గడ్‌షింత్‌సింగ్ అనే చిన్న గ్రామంలో గొప్ప సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు. నాన్హేకి రెండున్నర సంవత్సరాల వయస్సప్పుడు తండ్రి ఠాకూర్ ప్యారేలాల్ మరణించాడు. దాంతో నాన్హే ముంబాయిలో సంగీత కళాకారుడైన తన మామయ్య అమృత్‌లాల్ గంగారావ్ దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. తనకి 12 సంవత్సరాల వయస్సు వచ్చాక తన మామయ్యే తనకి గురువయ్యాడు.
నాన్హే బాబూజీ 7 సం|| వయస్సున్నప్పుడు తన మామయ్యతో కలిసి శిరిడీ యాత్రకు వెళ్ళాడు. చిన్నపిల్లవాడైన నాన్హే ద్వారకామాయి బయట ఒక చిన్న కుక్కపిల్లను చూసి దానితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అతని మామయ్య బాబాకు మధ్యాహ్న ఆరతి ఇచ్చే సమయం కావడంతో సభామండపంలో కూర్చున్నాడు. అక్కడినుండి బయట కుక్కపిల్లతో ఆడుకుంటున్న పిల్లవాణ్ణి చూసి అతడు కోపంతో వచ్చి కర్రతో కొట్టాడు. పిల్లవాడు గట్టిగా ఏడ్చుకుంటూ ద్వారకామాయిలోకి వెళ్ళాడు. అక్కడున్న భక్తులు తనని ఓదార్చే ప్రయత్నం చేశారు, కానీ ప్రయోజనం లేకపోయింది. అంతలో బాబా భక్తులతో ఆ పిల్లవాడ్ని తమ వద్దకు తీసుకు రమ్మని చెప్పారు. వాళ్ళు తీసుకుని వెళ్లగా బాబా పిల్లవాణ్ణి తమ ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. తరువాత అతని మామయ్యను పిలిచి పరుషంగా, "చేతిలో కర్ర పట్టుకుని నా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఇంకెప్పుడూ ఈ పిల్లవాడ్ని కొట్టకు. ఈ నాన్హే బాబూజీ ఒకరోజు గొప్ప సంగీతకారుడు, గాయకుడు అవుతాడు" అని అన్నారు. వాళ్ళు శిరిడీలో 3 నెలలపాటు గడిపారు. ప్రతిరోజూ వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, బాబా నాన్హేకి 3 పైసలు ఇస్తుండేవారు. పిల్లవాడు ఆ పైసలతో ఒక పైసా వేరుశనగలు, ఒక పైసా బెల్లం కొనుక్కొని ఇష్టంగా తినేవాడు. బాబా పిల్లవాణ్ణి తమ దగ్గర కూర్చుండబెట్టుకుని తమకు సమర్పించబడిన పండ్లు, పేడాలు తనకి ఇస్తుండేవారు. నాన్హే బాబా నుదుటి మీద గంధం పూయడం చూశాడు.
నాన్హే తెలివైన విద్యార్థి. తను హిందీ మీడియంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. ఆధునిక సంగీతాన్ని కూడా అధ్యయనం చేశాడు. బాబా ఆశీర్వదించినట్లుగానే అతడు మంచి గాయకుడు మరియు హార్మోనియం వాయించడంలో విద్వాంసుడయ్యాడు. కాశ్మీర్ రాజైన మాన్‌సింగ్, రామ్‌గఢ్ రాజు తరచూ అతనిని కచేరీ చేయమని ఆహ్వానం పంపుతుండేవారు. భారతదేశమంతటా అతడెన్నో కచేరీలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అతడు బీదర్‌లో శ్రీగురు సంగీత విద్యాలయం పేరిట ఒక సంగీత పాఠశాలను స్థాపించి, తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశాడు. నాన్హే బాబూజీ తరచూ, "బాబా అనుగ్రహం వల్లనే నేను ఇవన్నీ సాధించగలిగాను, ఈ గౌరవం అంతా బాబాకే దక్కుతుంది గాని నాకు కాదు" అని అంటుండేవాడు.
సమాప్తం.

Source : Extracted from Sai Prasad Magazine Deepavali issue 1996 and published in Baba’s Divine Symphony by Vinny Chitluri,
http://saiamrithadhara.com/mahabhakthas/nanhe_babuji.html

Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteBaba ! Nuvuu cheppina mata eppudhu ki ayina nijam avutundhi.🙏🙏🙏🌺🌻🌿🌹. Love 💓 You Baba 🙏🙏🙏.
ReplyDelete🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ReplyDeleteఓం సాయిరాం!!ఓం సాయిరాం!!
🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, anni vishayallo anta bagunde la chayandi tandri pls, amma nannalaki e vishayam cheppe dairyanni evvandi tandri pls.
ReplyDelete