సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 278వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. థాంక్యూ సో మచ్ సాయీ!
  2. బాబా ఊదీ అమోఘమైన ఔషధం

థాంక్యూ సో మచ్ సాయీ!

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తుడిని. బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడంవల్ల సాయిపై మన విశ్వాసం బలపడుతుంది. ఈరోజు నేను అనుభవించిన కొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.

ఒకసారి నేను చర్మసమస్యల కారణంగా వైద్యుడిని సంప్రదించాను. అప్పుడు నాకొచ్చింది 'సొరియాసిస్' అనే తీవ్రమైన చర్మవ్యాధి అని తెలిసింది. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. భయంతో సాయిని హృదయపూర్వకంగా ప్రార్థించాను. సాయి అద్భుతం చేశారు. నెలరోజుల తరువాత మళ్ళీ నేను వైద్యుడిని సంప్రదిస్తే, అది సోరియాసిస్ కాదని, మామూలు చర్మవ్యాధి మాత్రమేనని, మందులతో నయమవుతుందని చెప్పారు. ఆనందంతో సాయికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

మరోసారి నా సోదరికి ఒక ఇంటర్వ్యూ ఉంది. కానీ అదేరోజు తనకి ఆరోగ్యం బాగాలేనందున తనని ఆసుపత్రిలో చేర్పించాము. నేను తన ఇంటర్వ్యూ గురించి సాయిని ప్రార్థించాను. సమ్మె రూపంలో సాయి అద్భుతం చేశారు. సమ్మె కారణంగా వాళ్ళు ఇంటర్వ్యూను వాయిదా వేశారు.

ఇంకొక అనుభవం కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మా అమ్మమ్మకు సంబంధించినది. ఒకరోజు హఠాత్తుగా ఆమె కాలిలో నొప్పి వచ్చింది. ఆ నొప్పిని తట్టుకోలేక ఆమె ఏడ్చింది. నేను ఆమె పడుతున్న బాధ చూడలేక తన గురించి సాయిని ప్రార్థించాను. ఆరోజు రాత్రి ఆమెకొక కల వచ్చింది. కలలో ఎవరో తన కాలిని తాకారు. వచ్చింది సాయేనని నాకు తెలుసు. అమ్మమ్మకు నయం చేయడానికి ఆయన వచ్చారు. తరువాత ఆమెకు ఆ నొప్పి తగ్గిపోయింది.

ఇంతగా తమ కరుణను చూపే సాయికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియదు. ఆయన మనకోసం ఎల్లప్పుడూ ఉన్నారు. "బాబా! దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉంటూ మీ ఆశీస్సులు మాపై కురిపించండి. చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2491.html

బాబా ఊదీ అమోఘమైన ఔషధం

1975లో నా ఎడమకాలిమీద ఒక చిన్న నల్లమచ్చ కనిపించింది. ఆ చిన్న మచ్చ త్వరలోనే నా ఎడమకాలు పైభాగమంతా విస్తరించింది. నేను మా పోర్ట్ ట్రస్ట్ వైద్యుడిని సంప్రదించాను. అతను ఇచ్చిన మందుల వలన ప్రయోజనం కనపడలేదు. దానితో అతను పోర్ట్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఉన్న చర్మనిపుణుడిని సంప్రదించమని నాకు సలహా ఇచ్చారు. అతనిచ్చిన మందులు కూడా వ్యాధిని నయం చేయడంలో విఫలమయ్యాయి. తరువాత అకస్మాత్తుగా ఆ పెద్దమచ్చ దానంతటదే సంకోచించి మొదటిలా చిన్న పరిమాణానికి వచ్చింది. నేను ఇక దానిగురించి అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే, నేను అంతకుముందు వాడిన మందులు ఉపశమనం ఇవ్వడంలో విఫలమైనందున నాకు వాటిమీద పట్టింపు పోయింది. ఆ తరువాత మూడేళ్ళలో ఆ మచ్చ చాలాసార్లు పెరుగుతూ, తగ్గుతూ నిరంతరం నాకు ఆందోళన కలిగిస్తూ ఉండేది. మా చివరి శిరిడీ పర్యటనలో శ్రీ&శ్రీమతి చెంద్వంకర్ లను దగ్గరగా కలిసే సందర్భం వచ్చింది. ఆ సమయంలో శ్రీమతి చెంద్వంకర్ నాతో, "బాబా ఊదీని ప్రయత్నించారా?" అని ఆరా తీశారు. నేను ఆమెతో, "ప్రయత్నించాను, కానీ ప్రయోజనం కనపడలేదు" అని చెప్పాను. శిరిడీ నుండి బొంబాయి తిరిగివచ్చాక అకస్మాత్తుగా నేను ఊదీని నీటిలో కలిపి తీసుకున్నాను గానీ, నా కాలుకు రాయలేదని నా మనసుకు తట్టింది. దాంతో 8-6-1978న నేను, "బాబా! మీ ఊదీని నా కాలికి రాసుకుంటున్నాను, వారంలోగా, అంటే వచ్చే గురువారానికల్లా ఖచ్చితంగా నాకు ఉపశమనం కలిగించండి" అని శ్రీసాయిబాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాను. మీరు నమ్మినా నమ్మకపోయినా, త్వరలోనే మచ్చ తగ్గడం ప్రారంభమైంది. వారం పూర్తయ్యేసరికి చిన్న ఆనవాలు మాత్రమే మిగిలింది. అది కూడా త్వరలోనే పోయేలా ఉంది. అదేరోజు, అంటే 8-6-1978న నేను దాదాపు మూడునెలలుగా తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్న నా భార్యకు కూడా ఊదీతో ఉపశమనం లభించాలని శ్రీసాయిబాబాను ప్రార్థించాను. వారంపాటు రోజూ ఉదయం నా పూజానంతరం నేను బాబా ఊదీని నీళ్లలో కలిపి ఆమెకు ఇచ్చాను. ఆమె పంటినొప్పి కూడా తగ్గడం ప్రారంభమైంది. నిజంగా బాబా ఊదీ అమోఘమైనది. అన్ని అనారోగ్యాలకు గొప్ప ఔషధం.

-ఎ.కె.రాసల్
బొంబాయి-400037
(మూలం: శ్రీసాయిలీల - డిసెంబర్ 1978)


2 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo