సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సోనాబాయి బ్రహ్మాండ్కర్


1910 నుండి శిరిడీ సందర్శించే సుందర్రావు నవాల్కర్ గారి మేనకోడలు సోనాబాయి బ్రహ్మాండ్కర్. ఆమెకు 1913లో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె తన భర్తతో కలిసి శిరిడీ వెళ్ళింది. వాళ్ళు శిరిడీ చేరుకున్న వెంటనే ద్వారకామాయికి వెళ్లి బాబా పాదాలకు నమస్కరించుకున్నారు. అప్పుడు బాబా ఆమె భర్తను దక్షిణ అడిగారు. అందుకతను, "బాబా! మీరే అందరికీ అన్నీ ఇస్తారు. అలాంటప్పుడు మీకు ఏదైనా ఇవ్వడానికి నేనెవరిని?" అని బదులిచ్చాడు. అది విన్న బాబా నవ్వుతూ, "అల్లా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు" అని వాళ్ళని ఆశీర్వదించారు.

1914లో సోనాబాయి భర్త డయాబెటిస్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దానికి చికిత్స జరుగుతున్నప్పటికీ అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అతని మనుగడపై అందరూ ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో సోనాబాయి బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి, శిరిడీ వెళ్లి బాబాను కలవాలనుకుంది. కానీ ఆ పరిస్థితులలో ఆమె తన భర్తను విడిచిపెట్టి వెళ్ళనూలేదు, అలాగని తన భర్తని తీసుకుని అంత సుదూర ప్రయాణం చేయనూలేదు. ఆమె తన భర్త మంచం పక్కనే కూర్చుని రాత్రంతా బాబాని ప్రార్థిస్తూ, దాసగణు రచించిన 'అర్వాచీన భక్తలీలామృతం' చదువుతూ ఉండేది. మూడవరోజు రాత్రి బాబా ఆమెకు దర్శనమిచ్చి, "భయపడవద్దు. నేను ఇతనికి ఇంకా 16 సంవత్సరాల జీవితాన్ని ఇస్తాను. నువ్వు ఇతనికి మందులిస్తూ ఉండు" అని అన్నారు. అప్పటినుంచి అతని ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమై త్వరలోనే పూర్తిగా కోలుకున్నాడు. నాలుగు సంవత్సరాల తరువాత ఆ దంపతులకు ఆరోగ్యకరమైన ఆడపిల్ల పుట్టింది. 1930లో, సరిగ్గా బాబా ఆ మాటలు చెప్పిన 16 సంవత్సరాల తరువాత అతను ప్రశాంతంగా కన్నుమూశాడు.

బాబా రకరకాల మార్గాల్లో ఆయువును పెంచుతారు. కొన్నిసార్లు తరువాతి జన్మలోని కొంత ఆయుష్షును తగ్గించి ప్రస్తుత జన్మలో ఆయుష్షును పెంచుతారు. ఆయన ఒకరి కర్మఫలాలను మరొకరికి బదలాయించగలరు. ఒక వ్యక్తి యొక్క జీవితకాలాన్ని అతని శ్రేయోభిలాషి జీవితకాలంనుండి కొంత బదిలీ చేయడం ద్వారా పెంచవచ్చు. అసాధారణమైన రీతిలో మరణాన్ని శాసించి జీవితాన్ని ఇవ్వగలరు.

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1987 (దీపావళి ఇష్యూ)
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo