సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 310వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. చలానా చెల్లించకుండా బాబా రక్షించారు
  2. తక్షణ సహాయం అందించే సాయి

చలానా చెల్లించకుండా బాబా రక్షించారు

సాయిభక్తురాలు రోజా తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను సాయిబాబాకు చిన్న భక్తురాలిని. చిన్నతనంనుండి బాబా గురించి నాకు తెలుసు. అయితే ఇతర దేవుళ్ళను ప్రార్థించినట్లే బాబాను కూడా ప్రార్థించేదాన్ని. ఆ సమయంలో నాకు సాయిబాబా లీలల గురించి ఏమీ తెలియదు. 2015లో నా స్నేహితురాలి ద్వారా నాకు బాబా లీలలు తెలిశాయి. అవి విన్న తరువాత నాలో బాబాపట్ల విశ్వాసం ఏర్పడి ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పటినుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు బాబా చాలా అనుభవాలు ఇచ్చారు. దయతో బాబా నాకు చాలాసార్లు గోడ మీద దర్శనం ఇచ్చారు. అంటే, ప్లెయిన్ గోడపై బాబా ముఖం కనిపించేది. అవసరంలో ఆయన తన ఉనికిని కూడా నాకు తెలియజేశారు. ఇక నా అనుభవానికి వస్తే...

నేను ఇటీవలే బిటెక్ పూర్తిచేశాను. తరువాత నేను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఉద్యోగం వచ్చేవరకు ఖాళీగా ఉండకుండా నేను, నా స్నేహితులిద్దరితో  ఒక కోర్సులో చేరాను. ఇన్‌స్టిట్యూట్ దూరంగా ఉండటం వలన మేము స్కూటీ అద్దెకు తీసుకుని వెళ్లి వస్తుండేవాళ్ళం. ఒకరోజు మేము ముగ్గురం ఇన్‌స్టిట్యూట్ అయిపోయాక ఒక కొత్త మార్గం గుండా స్కూటీ మీద వస్తున్నాము. హఠాత్తుగా మేము పోలీసులకు పట్టుబడ్డాము. ఆ పోలీసు ఆఫీసర్ అందరిపై అరుస్తున్నాడు. మాకు భయమేసింది. అతను జరిమానా కట్టించుకోకుండా ఎవరినీ వదిలింది లేదట. ఆ సమయంలో మావద్ద ఒక్క రూపాయి కూడా లేదు. మాకు హెల్మెట్, లైసెన్స్ కూడా లేవు. పైగా మేము ముగ్గురం ఒకే స్కూటీ మీద వస్తున్నాము. పోలీసులు మా స్కూటీ తాళం తీసుకుని పక్కన పెట్టారు. మేము అతనిని అభ్యర్థించడానికి అతని వద్దకు వెళ్ళాము. కానీ అతను మాపై అరిచాడు. ఏమి చేయాలో మాకు తెలియలేదు. ఆ స్థితిలో నేను సాయిపై నమ్మకముంచి ఆయననే ప్రార్థిస్తూ, "బాబా.. బాబా" అని జపిస్తూ ఉన్నాను. పోలీసులు పట్టుబడిన ప్రతి ఒక్కరికీ చలానా ఇవ్వకుండా వదిలిపెట్టడం లేదు. అయినప్పటికీ నేను బాబాపై పూర్తి విశ్వాసం ఉంచాను. కొంతసేపటి తర్వాత బాబా అద్భుతం చేశారు. పోలీసులు మమ్మల్ని చూసి, “మీరు వెళ్ళవచ్చు” అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది కేవలం నా ప్రియమైన బాబా వల్లనే సాధ్యమైంది.

బాబా తన భక్తులను ఒంటరిగా వదిలిపెట్టరు. ఆయన తన భక్తుల నుండి ఏమీ ఆశించరు. ఆయనకు తన భక్తుల నుండి కావలసింది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులు శ్రద్ధ (విశ్వాసం), సబూరి (సహనం) అనే రెండు విషయాలను అనుసరించేలా చేస్తారు. మీరు బాబాను నిజంగా ప్రేమిస్తే, ఆయనపై పూర్తి విశ్వాసముంచి ఆయన దివ్య పాదకమలాల వద్ద అన్నింటినీ విడిచిపెట్టండి. ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. "బాబా! జీవితంలో మీరు నాకిచ్చిన ప్రతిదానికీ నా ధన్యవాదాలు. నా ప్రియమైన సాయిదేవా! దయచేసి నన్ను ఎప్పుడూ మీ గురించి ఆలోచించేలా చేయండి. ఎల్లప్పుడూ నాతో ఉండండి బాబా".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2558.html

తక్షణ సహాయం అందించే సాయి

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను అనుకున్నది జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. నేను ఇంట్లోనే ఒక  చిన్న వ్యాపారం చేస్తున్నాను. ఈమధ్య ఒకసారి అందులో కొంచెం నష్టం వచ్చే సమస్య ఏర్పడింది. అప్పుడు నేను, "బాబా! ఈ నష్టం నాకు రాకుండా చెయ్యండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా నాకు సహాయం చేశారు. ఆయన పిలిస్తే పలికే దైవం. ఎవరు ఎప్పుడు పిలిచినా తక్షణ సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. "థాంక్యూ సో మచ్ బాబా! మీ భక్తులను ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండండి".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


3 comments:

  1. నా ప్రియమైన సాయిదేవా! దయచేసి నన్ను ఎప్పుడూ మీ గురించి ఆలోచించేలా చేయండి. ఎల్లప్పుడూ నాతో ఉండండి బాబా".

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo