సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అదీ బాబా బాధ! - అసలేమా కథ?


సగుణ్ మేరు నాయక్ మంచి సాయిభక్తుడు. అతడు బాబా సేవలో గడపదలచి శిరిడీలోనే స్థిరపడ్డాడు. అయితే, బాబా ఆజ్ఞానుసారం శిరిడీలోనే హెూటల్ నడుపుతూ, బయటి ఊరి నుండి వచ్చే భక్తులకు కొంతవరకు భోజనసమస్య తీర్చేవాడు. తక్కిన సమయాన్ని బాబా సేవలో గడిపేవాడు. మధ్యాహ్నం బాబా మరికొందరు సన్నిహిత సాయిభక్తులు భోజనం చేసిన తరువాత ఆ కంచాలన్నీ సగుణమేరు నాయకే కడిగి మశీదు శుభ్రం చేసేవాడు.

ఒకరోజు హెూటల్ కట్టేసి బాబాకు నమస్కారం చేసుకుందామని మసీదుకెళ్ళాడు. బాబా ఎందుకో అప్పుడు చాలా విసుగ్గా, కోపంగా ఉన్నారు. బాబా, “నేనేం చేసేది? నాదగ్గరేముంది? ఎవరూ నేను చెప్పినట్లు వినరు!” అని బాధగా గొణుక్కుంటూ, “వెళ్లండి! ఎవ్వరూ మసీదు మెట్లెక్కొద్దు!” అని కోపంతో కేకలేస్తున్నారు. సగుణ్ ఖిన్నుడై వెనుదిరిగిపోతూ, “ఈరోజు నేనేం పొరపాటు చేసాను? బాబా అలా ఎందుకన్నారు?” అని ఆలోచించాడు. ఎందుకో అతనికి ఎవరో భక్తులు ఆకలితో ఉండి ఉంటారు! అందుకే బహుశా బాబా అలా కోప్పడుతున్నారేమోననే ఆలోచన వచ్చింది.

వెంటనే 'మీరు భోజనం చేసారా?' అని అందర్నీ విచారిస్తూపోతే, దీక్షిత్ వాడాలో ఒకమూల కూర్చుని వున్న ఇద్దరు భక్తులు కనిపించారు. వారిలో ఒకడు కళ్యాణ్ నుండి వచ్చిన రామమారుతి. అతడెప్పుడూ 'రామమారుతి రామమారుతి' అని జపించుకుంటూ ఉండేవాడు. అందువల్ల అతణ్ణి రామమారుతి అని పిలిచేవారు. అతడు, అతనితో వచ్చిన భక్తుడు, ఇద్దరూ భోజనం దొరక్క ఆకలితో ఆ మూల పడివున్నారు. సగుణ్ వారిద్దరినీ భోజనానికి ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టాడు.

సాయంత్రం సగుణ్ మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళినపుడు బాబా చాలా ప్రసన్నంగా అతడికేసి చూస్తూ "నా బాధేమిటో ఇప్పటికైనా అర్థమైందా?" అన్నారు. దానికి సగుణ్ “బాబా అట్టి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు వినయంగా. దానికి బాబా “మంచిది. రోజూ వెళ్లి అందర్నీ  భోజనం చేస్తారా? లేదా? అని విచారిస్తూ ఉండు! అలా చేస్తే అల్లా నీకు మేలు చేస్తాడు!" అన్నారు. ఆనాటి నుండి   సగుణ్ మేరు నాయక్  బాబా ఆజ్ఞను ప్రతినిత్యం  తూ.చ. పాటించేవాడు.

సోర్సు : సాయిపథం  వాల్యూం - 1

5 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. 🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo