సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాలాసాహెబ్ రుద్ర



బాలాసాహెబ్ రుద్ర 1905వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఖాందేష్ జిల్లా జల్గాఁవ్‌లో  జన్మించాడు. అతని తండ్రి ఒక పోలీస్ సూపరింటెండెంట్. ఆ రోజులలో మంచి వేతనంతో కూడుకున్న గౌరవప్రదమైన పదవి అది. రుద్రకు ఇద్దరు పినతండ్రులు. వాళ్లలో ఒకరు న్యాయవాది కాగా మరొకరు హవల్దారు.

బాలాసాహెబ్ రుద్ర కుటుంబాన్ని బాబా తమ దగ్గరకు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా ఆసక్తికరమైనవి. ఒకసారి అతని అమ్మమ్మ సరస్వతీబాయి, పినతల్లి గాణుగాపురం యాత్రకు వెళ్ళారు. పది సంవత్సరాల రుద్ర కూడా వాళ్ళతో వెళ్ళాడు. తీర్థయాత్ర సంపూర్ణంగా పూర్తయింది. అయితే తిరుగు ప్రయాణంలో తారసపడిన ఒక వింత సన్నివేశం వాళ్ళ జీవితాలను మార్చేసింది. మార్గమధ్యలో ఒకచోట వాళ్ళు ఒక చితి ప్రక్కగుండా వెళ్లారు. ఆ చితిపై ఒక వ్యక్తి శరీరం దహనమవుతోంది. హఠాత్తుగా శవం యొక్క చెయ్యి పైకి లేచి కదులుతూ కనిపించింది. అది చూసిన రుద్ర పినతల్లి భయకంపితురాలైంది. ఎంతలా భయపడిందంటే, ఆ భయానికి ఆమె కడుపులో ప్రేగులు తీవ్రంగా కంపించాయి. ఫలితంగా విరోచనాలు మొదలై పగలూ రాత్రి ఆమె మరుగుదొడ్డికి పరుగులు తీయాల్సి వచ్చింది. ఎన్ని మందులు వాడినా విరోచనాలు ఆగలేదు. మంత్రోచ్చారణలు, వైదిక కర్మకాండలు ఎన్నో జరిపించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అటువంటి సమయంలో శిరిడీ వెళ్లి సాయిబాబాకు శరణు పొందమని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు.                           

అది 1913వ సంవత్సరం. రోగగ్రస్తురాలైన పినతల్లి, అమ్మమ్మలతో కలిసి బాలాసాహెబ్ రుద్ర మొదటిసారి శిరిడీ వెళ్ళాడు. బాబా వాళ్ళను ఆదరించి అందరికీ ఊదీ పెట్టారు. తరువాత బాబా రోగి చేతిలో ఊదీ ఉంచి, నోటిలో వేసుకోమన్నారు. అంతటితో ఆమెకు ఆరోగ్యం చేకూరింది. రుద్ర నుదుటన ఊదీ పెడుతూ బాబా అతని తలమీద చిన్నగా తట్టి, మౌనంగా ఆశీర్వదించారు. బాబా హస్తస్పర్శతో రుద్రకు చాలా సంతోషం కలిగింది. బాబా పట్ల భక్తి, ప్రేమలు వృద్ధి చెందాయి.

బాలాసాహెబ్ రుద్ర పెరిగి పెద్దవాడై వివిధ మరాఠీ వార్తాపత్రికలకు సంపాదకుడిగా పనిచేసి తన కుటుంబంతో పూనాలో స్థిరపడ్డాడు. బాబాను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి చివరికి 2006లో గుడీ పాడ్వా (ఉగాది) పర్వదినాన దివంగతుడయ్యాడు.

సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

8 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌺🙏 🙏🌺🙏
    భక్తులను సంస్కరించడంలో సాయిబాబాకు సాటి ఎవరూ రారు.వారి మాట వేదవాక్కు.నేటి కలికాల మాయా ప్రభావాన్ని తప్పించి మన జీవితాలు పురోగతినీ,భవిష్యత్ అభివృద్ధినీ సాధించడానికి ఒక్కటే మార్గం.. సాయికి సర్వస్య శరణాగతి కావడం..సర్వం శ్రీ సాయినార్పణమస్తు🙏🌺🙏

    ReplyDelete
  3. 🎆🌺🌺🙏🙏🙏🌺🌺🎆

    ReplyDelete
  4. 🙏🌺🙏 🙏🌺🙏
    భక్తులను సంస్కరించడంలో సాయిబాబాకు సాటి ఎవరూ రారు.వారి మాట వేదవాక్కు.నేటి కలికాల మాయా ప్రభావాన్ని తప్పించి మన జీవితాలు పురోగతినీ,భవిష్యత్ అభివృద్ధినీ సాధించడానికి ఒక్కటే మార్గం.. సాయికి సర్వస్య శరణాగతి కావడం..సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు🙏🙏

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. Om Sree Sai Arogya kshemadhaya Namaha 🕉🙏❤🌼😊

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo