ఈ భాగంలో అనుభవాలు:
- మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన సాయి సచ్చరిత్ర పారాయణ
- ఆపరేషన్ లేకుండా చేసిన బాబా
మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన సాయి సచ్చరిత్ర పారాయణ
నేను ఒక సాయిభక్తురాలిని. మా అబ్బాయి ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. తను తనకి వస్తున్న జీతంతో సంతృప్తిగా లేడు. అంతేకాకుండా, ప్రమోషన్ విషయంలో తన మేనేజర్ నుండి సరైన స్పందన లేదు. అందువలన మంచి ఉద్యోగం చూసుకుని కంపెనీ మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన అనుభవానికి తగిన ఓపెనింగ్స్ ముంబాయిలో కనిపించలేదు. ఆ సమయంలో నేను శిరిడీ సందర్శించాను. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు నాకొక బాబా విగ్రహాన్ని కొనాలనిపించి ఒక విగ్రహం తీసుకున్నాను. దాన్ని తీసుకుని వెళ్లి మా అబ్బాయి ఇంట్లో పెట్టాను. అప్పటినుండి మా అబ్బాయికి చాలా ఓపెనింగ్స్ కనిపించాయి. తను దరఖాస్తు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం ప్రారంభించాడు. అయితే అంతకుమించి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలో ఒకరోజు నేను సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే, అందులో ప్రతిరోజూ 'సాయి సచ్చరిత్ర' చదవడం యొక్క ప్రాముఖ్యత గురించి, మంచి ఉద్యోగం పొందడానికి అది ఎలా సహాయపడింది అనే విషయం గురించి అక్కడ ఎవరో వ్రాశారు. తరువాత అదేరోజు నేను యూట్యూబ్‌లో భక్తుల అనుభవాలను వింటున్నప్పుడు, అలాంటి అనుభవాన్నే ఒకరు వివరించారు. వాటి ద్వారా సాయిబాబా సందేశం ఇస్తున్నారని నాకనిపించింది. వెంటనే నేను మా అబ్బాయికి, కోడలికి సాయి సచ్చరిత్ర చదవమని చెప్పాను. నిజానికి నేను గత ఒక సంవత్సర కాలంగా ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర, స్తవనమంజరి చదువుతున్నాను.
మా అబ్బాయి, కోడలు సచ్చరిత్ర చదవడం ప్రారంభించిన 10 రోజుల్లో మా అబ్బాయి ఒక మంచి పేరున్న కంపెనీలో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశాడు. తరువాత తను ఆశించిన దానికంటే ఎక్కువ జీతంతో ఆఫర్ లెటర్ వచ్చింది. నేను చాలా సంతోషించి, వీలైనంత త్వరగా శిరిడీ సందర్శించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోమని, కొత్త కంపెనీలో అంతా సజావుగా సాగేందుకు సాయి ఆశీస్సులు తీసుకోమని మా అబ్బాయికి, కోడలికి సలహా ఇచ్చాను. తోటి సాయిభక్తులను కూడా ప్రతిరోజూ సచ్చరిత్ర ఒక పేజీ లేదా ఒక అధ్యాయం చదవమని సలహా ఇస్తున్నాను. అలా చేయడం వలన ఖచ్చితంగా మనశ్శాంతి లభిస్తుంది. శ్రద్ధ, సబూరీ పెంపొందడానికి సహాయపడుతుంది.
ఆపరేషన్ లేకుండా చేసిన బాబా
నేను 2011 నుండి సాయిబాబాకు భక్తురాలిని. గత 12 సంవత్సరాలుగా మా అమ్మ నాడీ సంబంధిత సమస్య(న్యూరో డిజార్డర్)తో బాధపడుతూ మందులు వాడుతోంది. ఆమెకు దగ్గరవాటిని చూడలేని సమస్య కూడా ఉంది. ఇటీవల ఆమె "చాలా దూరమున్నవాటిని, అతి దగ్గరగా ఉన్నవాటిని చూడలేకపోతున్నా"ని చెప్పింది. మేము తనని చెకప్ కోసం డాక్టరు వద్దకు తీసుకొని వెళ్తే, రెండు కళ్ళను స్కాన్ చేయించమని చెప్పారు. స్కాన్ చేస్తే రెటీనా నరాలలో మచ్చ ఉందని, అందువలనే ఆమె దృష్టి అస్పష్టంగా ఉందని చెప్పారు. అయితే అందుకు అసలు కారణం ఏమిటనేది డాక్టరు కూడా కనుగొనలేకపోయారు. కానీ కంటి శుక్లం ఆపరేషన్ చేయవలసి ఉందని చెప్పారు. అమ్మ శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో మేమంతా చాలా ఆందోళన చెంది బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాము. బాబా దయవల్ల నగరంలోని మరో పేరుగాంచిన హాస్పిటల్‌లో సంప్రదించాము. అక్కడ అవే పరీక్షలు, స్కాన్ చేసి, "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదని, అద్దాలు మార్చుదామని, మచ్చ విషయంలో ఆరునెలలకు ఒకసారి చెకప్ సరిపోతుంద"ని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆ మాటతో మేము చాలా ఉపశమనం పొందాము. ఇదంతా మా సాయిబాబా వల్లే సాధ్యమైంది. ఆయన మాపై కృపతో కరుణించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. కొన్నినెలలుగా నా కొడుకు విషయంలో నాలో నేను బాధపడుతున్నానని మీకు తెలుసు. దయచేసి వెంటనే తనకి నయమయ్యేలా చేయండి బాబా. అది నెరవేరితే నేను సంతోషంగా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను".
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.
Jai sairam
ReplyDeleteOm sai ram!🙏🙏🙏🙏
ReplyDeleteJai sairam
ReplyDeleteఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ReplyDeleteom Sairam
ReplyDeleteSai always be with me
⭐🌹🙏🙏🙏🌹⭐. Om Sairam
ReplyDeleteBaba please bless us
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om sairam
ReplyDelete🌺🌸🌺ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏🌺🌸🌺🙏🙏🙏🙏🙏
ReplyDelete