ఈ భాగంలో అనుభవం:
- సాయి దివ్యపూజ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు - మూడవ భాగం
- తన భక్తురాలి అనుభవాన్ని గుర్తుచేసి పొరపాటు జరగకుండా చూసిన బాబా
నిన్నటి తరువాయి భాగం...
సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకి బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
చివరిగా మరో చిన్న అనుభవం:
"అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకటం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణియైనా సరే - పక్షైనా, పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. (కనుక) సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటినీ పిలవవద్దు, తరమవద్దు. అలాచేస్తే లక్షలాది మంది అతిథులను సత్కరించినట్లవుతుంది" అని బాబా చెప్పారు.
నేను ప్రతిరోజూ పక్షులకు కొంత అన్నం, బియ్యం వేసేదాన్ని. కానీ కరోనా పరిస్థితుల వలన భయంతో నేను పక్షులకు దూరంగా ఉండిపోయాను. మళ్ళీ వాటికి ఆహారం పెట్టేలా బాబా ఎలా చేశారో చూడండి! ఒకరోజు బాబా తమ చేతివేళ్ళ నుండి బియ్యం గింజలు వదులుతూ దర్శనమిచ్చారు. పక్షులకు ఆహారం వేయమని బాబా సూచిస్తున్నట్లుగా నాకు అనిపించింది. దాంతో 'బాబా ఉండగా భయమెందుక'ని పక్షులకు ఆహారం వేద్దామని మేడ మీదకి వెళ్లాను. అక్కడ పక్షులన్నీ నేను వచ్చి ఆహారం పెడతానని ఎంతగానో ఎదురుచూస్తూ కన్పించాయి. బాబాకు క్షమాపణలు చెప్పుకొని, వాటికి ఆహారం పెట్టాను. ఇక అప్పటినుండి ప్రతిరోజూ మర్చిపోకుండా మధ్యాహ్న భోజనానికి ముందు కొంత ఆహారం బయట ఉంచడం మళ్ళీ చేయసాగాను. మా ఇంటికి అతిథులు, బంధువులు రావడం లేదనే నా చింత బాబా బోధనల ద్వారా తొలగిపోయింది.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సద్గురు చరణం - భవభయ హరణం - సాయినాథ శరణం.
ఇప్పటివరకు మీరు చదివిన సంధ్యగారి అనుభవాలకు అనుబంధంగా బాబా నాకు ప్రసాదించిన నా స్వీయ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
తన భక్తురాలి అనుభవాన్ని గుర్తుచేసి పొరపాటు జరగకుండా చూసిన బాబా
2020, జూలై 22వ తేదీ రాత్రి సంధ్యగారు తమ అనుభవాలను నాకు వాట్సాప్‌లో ఇమేజెస్ రూపంలో పంపించారు. నేను మరుసటిరోజు ఉదయం నెట్ ఆన్ చేసినప్పుడు నోటిఫికేషన్ బార్‌లో ఆమె అనుభవాలు పంపినట్లు చూశాను. సాధారణంగా ఉదయం పూట ఇంట్లో పనులవలన నేను వాట్సాప్‌కి ఎక్కువ టైమ్ కేటాయించలేను. కేవలం బాబాకు సంబంధించిన మెసేజ్‌లను గ్రూపులలో షేర్ చేయడానికే మాత్రమే నెట్ ఆన్ చేస్తాను. అందువలన సంధ్యగారి అనుభవాలు తరువాత చూద్దామని అనుకున్నాను. కానీ తరువాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. మూడువారాలకు పైనే రోజులు గడిచిపోయాయి. ఆరోజు 2020, ఆగస్టు 15. ఉదయం పూజగదిలో బాబా ముందు కూర్చొని ఉన్నాను. హఠాత్తుగా, ‘సంధ్యగారు తమ అనుభవాలు పంపినట్లున్నారు’ అనిపించింది. ‘ఎందుకిలా అనిపిస్తోంది?’ అనుకుని, పూజ పూర్తైన తరువాత అనుమానంగా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే, ఆమె పంపిన అనుభవాలున్నాయి. అవి చూసి ఆశ్చర్యపోయాను. నిజానికి ఇది జరగడానికి రెండు, మూడు రోజుల ముందే ‘సంధ్యగారు తమ అనుభవాల ద్వారా బాబా ప్రేమను పంచుకొని చాలా రోజులైంది’ అని అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆమె అనుభవాలు పంపించినట్లు ఏ మాత్రం గుర్తురాలేదు. కేవలం బాబా ముందు కూర్చున్నప్పుడే అలా అనిపించింది. కాదు, బాబానే గుర్తుచేశారు. అనుభవాలు ఎక్కువగా వస్తున్న కారణంగా, ఎవరైనా అనుభవం పంపితే, దాన్ని పబ్లిష్ చేయడానికి సరిగ్గా మూడువారాలు పడుతుంది. సరిగ్గా ఆ సమయం పూర్తయ్యాక బాబానే గుర్తుచేశారని చాలా సంతోషించాను. కానీ చాలారోజులైన కారణంగా ఆమె పంపిన ఇమేజెస్ డౌన్లోడ్ కాలేదు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి, విషయం తెలియజేసి, మళ్ళీ ఒకసారి అనుభవాలు పంపించమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, "నేనే గుర్తు చేద్దామనుకున్నాను. కానీ క్రొత్తగా అనుభవాలు పంపిస్తున్న సాయిభక్తులను ప్రోత్సహించడానికి వాళ్ళ అనుభవాలను ముందుగా పబ్లిష్ చేస్తున్నారేమో అనుకున్నాను" అని అన్నారు. కానీ ఎన్ని అనుభవాలు వస్తున్నా, వచ్చినవి వచ్చినట్లే ఆర్డర్‌లో పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నామేగానీ ఇంకే ప్రాధాన్యతా ఇవ్వట్లేదు. అలా ప్రాధాన్యత ఇవ్వడం వలన కొన్ని పబ్లిష్ కాకుండా ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. గతంలో ఒకసారి ఆ తప్పిదం జరిగింది కూడా. ఆ సాయిబంధువే అడగటంతో, జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పి, ఆ అనుభవాన్ని పబ్లిష్ చేశాము. అప్పటినుండి అటువంటివి మళ్ళీ జరగకూడదని అనుభవాలు వచ్చిన వెంటనే ఒకచోట సేవ్ చేసుకుంటున్నాము. ఎంత జాగ్రత్త వహిస్తున్నప్పటికీ మళ్ళీ ఇలా జరిగింది. కానీ బాబా నాకు ఈ విషయాన్ని గుర్తుచేసి, నావల్ల పొరపాటు జరగకుండా చూడటమే కాదు, మరోసారి 'ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నది తామేన'ని నిరూపించి నాకెంతో ఆనందాన్ని ప్రసాదించారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా! ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉంటూ మీరు అప్పగించిన ఈ బ్లాగ్ నిర్వహణను బాధ్యతాయుతంగా నెరవేర్చేలా అనుగ్రహించండి బాబా!"
చివరిగా ఒక మాట:- బాబా ఉండగా ఇలాంటి పొరపాట్లు జరగవు. ఒకవేళ ఎప్పుడైనా నెలరోజులు దాటినా మీ అనుభవాలు పబ్లిష్ కాకుండా ఉంటే మాత్రం మొహమాటపడకుండా మాయందు దయవుంచి ఒకసారి మాకు గుర్తుచేయండి. ఎందుకంటే, బాబా ప్రేమ అమూల్యమైనది. ఏ చిన్ని అనుభవం కూడా తోటి భక్తులకు చేరకుండా ఉండకూడదని నా అభిప్రాయం.
Om Sai ram
ReplyDeleteBaba daya chupavaya
ReplyDeleteOme srisairam
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌹🌼Om Sai Sri Sai Jaya Jaya Sai🌹🌼🙏🙏🙏🙏🙏
ReplyDelete