సాయిభక్తుడు గోపాలరావు గుండు పుత్రసంతానం కావాలనే మిషతో బాబా వైపు ఆకర్షితుడయ్యాడు. అతను కోపర్‌గాఁవ్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టరుగా పనిచేశాడు. అతను ఆధ్యాత్మిక భావాలు కలిగివుండేవాడు. తనలాగే నానాసాహెబ్ డేంగ్లేకి కూడా ఆధ్యాత్మిక చింతన ఉండటం వలన వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. నానాసాహెబ్ డేంగ్లే మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నందున అతడు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ విధి వెక్కిరించి రెండవ వివాహం ద్వారా కూడా అతనికి పుత్రుడు జన్మించలేదు. అప్పుడతని సోదరుడైన బాబాసాహెబ్ డేంగ్లే సలహా మేరకు అతను శ్రీసాయిబాబాను దర్శించాడు. సాయిబాబా అనుగ్రహం, ఆశీర్వాదం వల్ల నానాసాహెబ్ డేంగ్లేకు పుత్రుడు జన్మించాడు. అంతటితో అతడు కూడా సాయిబాబాకు భక్తుడై, ఆయనను ఎంతగానో ప్రేమిస్తుండేవాడు. అతని విషయం అలా ఉంచితే, గోపాలరావు గుండుకి కూడా పుత్రసంతానం లేదు. అతను మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఏ భార్య ద్వారానూ అతనికి పుత్రసంతానం ప్రాప్తించలేదు. అందువలన అతని మనస్సు చింతాగ్రస్తమై ఉండేది. ఒకనాడు నానాసాహెబ్ డేంగ్లే, "బాబా దర్శనం చేసుకో! వారి ఆశీస్సులతో నీకు పుత్రసంతానం కలుగుతుంది" అని గోపాలరావుకి సలహా ఇచ్చాడు. దాంతో గోపాలరావు శిరిడీ వెళ్లి బాబా ఆశీస్సులు పొందాడు. త్వరలోనే అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. బాబా అనుగ్రహం వలనే తనకు పుత్రుడు జన్మించాడని అతని పూర్తి నమ్మకం.
అందుకు కృతజ్ఞతగా అతను శిథిలమైన మసీదును మరమ్మత్తు చేసి, పునరుద్ధరించాలని అనుకున్నాడు. అందుకోసం అవసరమైన రాళ్ళను, ఇతర సామగ్రిని సేకరించడం మొదలుపెట్టాడు. అయితే, బాబా ఆ పనిని మరొక భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్‌కి అప్పగించాలని అనుకున్నారు. అందువల్ల ఆ పని చేయడానికి ఆయన గోపాలరావుకు అనుమతినివ్వక, అతను సేకరించిన సామాగ్రిని శని మందిరం, దాని చుట్టుప్రక్కల ఉన్న ఇతర దేవాలయాల పునరుద్ధరణకు, పునర్నిర్మాణానికి ఉపయోగించమని ఆదేశించారు. అందుకతను ఎంతో సంతోషించాడు. బాబా సూచనల మేరకు వెంటనే పని మొదలుపెట్టాడు. మందిరాలను పునరుద్ధరించడమే కాకుండా, శని మందిర విస్తరణ కూడా చేశాడు. అతను వేపచెట్టు క్రిందనున్న బాబా గురువు యొక్క సమాధిస్థానాన్ని కూడా మరమ్మత్తు చేశాడు. ఆ చెట్టు క్రిందనే బాబా కూర్చునేవారు.
అంతటితో తృప్తి చెందక గోపాలరావు తన ఆనందానికి ప్రతీకగా శిరిడీలో ఒక ఉత్సవం (హిందువులు చేసుకునే యాత్ర లేదా ముస్లింల ఉరుసు) చేయాలనుకున్నాడు. తన ఆలోచనను దాదాకోతే, తాత్యాకోతేపాటిల్, మాధవరావు దేశ్‌పాండే తదితరుల ముందు ఉంచాడు. వాళ్ళు అతని ప్రతిపాదనకు మద్దతునిచ్చారు. బాబా కూడా తమ అనుమతినిచ్చారు. అటువంటి ఉత్సవాలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కాబట్టి అందుకోసం వారంతా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో శిరిడీ గ్రామ కులకర్ణి వారి ప్రతిపాదనను వ్యతిరేకించి, ఉత్సవం జరపకుండా ఉండటానికి ఉత్తర్వులు సేకరించడంలో విజయం సాధించాడు. అయినప్పటికీ బాబా ఆశీర్వాదం ఉన్నందున గ్రామస్తులు మరింత ఉత్సాహంతో కలెక్టర్ అనుమతి కోసం ప్రయత్నాలు చేయగా వారి ప్రయత్నాలు ఫలించాయి. బాబా సూచనల ప్రకారం శక సం.1897, శ్రీరామనవమి శుభదినాన ఈ ఉత్సవం ప్రారంభమైంది. ఆవిధంగా శిరిడీలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు ఉత్సవం జరపబడటంలో గోపాలరావు కీలకపాత్ర పోషించాడు.
తాత్యాపాటిల్ ఉత్సవ ఏర్పాట్లను చూసుకునేవాడు. తరువాత దాముఅన్నాకి కూడా బాబా ఆశీస్సులతో ఒక కొడుకు పుట్టాడు. అందుకు కృతజ్ఞతగా మసీదు పైభాగాన ఒక జెండా కట్టమని దాముఅన్నాకి సలహా ఇచ్చాడు గోపాలరావు. దాముఅన్నా ఆ ప్రతిపాదనను నానాసాహెబ్ నిమోన్‌కర్ ముందు ఉంచాడు. అది అతనికి నచ్చి దాముఅన్నాతో పాటు అతను కూడా ఒక జెండా ఎగురవేశాడు. నేటికీ శ్రీరామనవమి రోజున రెండు క్రొత్త జెండాలను తీసుకొచ్చి పూజ, భజన చేసి, బాజాభజంత్రీలతో ఊరేగించి చివరిగా మశీదు పైభాగాన ఎగురవేస్తారు. వాటిలో సాదాసీదాగా ఉండే జెండా దాముఅన్నాది కాగా, బంగారు ఎంబ్రాయిడరీతో ఉన్న రెండవ జెండా నానాసాహెబ్ నిమోన్‌కర్‌ది. కొండాజీ, సుతార్ అను భక్తుల నివాసంలో ఈ రెండు జెండాలను తయారుచేస్తారు. గోపాలరావు మరణానంతరం అతని రాతి గృహాన్ని శిరిడీ సంస్థాన్‌కు విరాళంగా ఇచ్చారు.
సమాప్తం....
Source: సాయిలీలా పత్రిక.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌺🙏🙏🙏🌺
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😀🌼😃😊🌸🥰🌺🤗🌹🕉🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDelete