సాయి వచనం:-
'నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను.'

'సంస్కరణాకార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి' - శ్రీబాబూజీ.

రామచంద్ర వి. పాటంకర్


అలీబాగ్ వద్ద వి. రామచంద్ర పాటంకర్ గుమస్తాగా పనిచేసి పదవి విరమణ చేసాడు. ఇతడు కూడా చోల్కర్ వలె దాసగణు గారి కీర్తనలకు, ప్రవచనాలకు హాజరయ్యాడు కానీ, అతనికి బాబా పట్ల విశ్వాసం కలగలేదు. బాబా ఒక ముస్లిం ఫకీరు అని అతను అనుకున్నాడు. అతని నెలసరి ఆదాయం కేవలం రూ.30/- మాత్రమే. అది అతని కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోయేదికాదు. ఆ కారణంగా 1910లో అతడు చాలా బాధలలో ఉన్నాడు. ఆ స్థితిలో అతన్ని దాదర్ లో ఉన్న బాలకృష్ణ బువా మఠంలోని అక్కల్ కోట్ స్వామి ఫోటో బాగా ఆకర్షించింది. తరుచూ అతడు ఆ మఠంను సందర్శిస్తూ స్వామి సమర్థను భక్తితో ఆరాధిస్తుండేవాడు.

ఒకరోజు పాటంకర్ ని అతని స్నేహితుడైన ఘనశ్యాంగుప్తా తనతోపాటు శిరిడీ రమ్మని అడిగాడు. పర్యటనకు అవసరమైన ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని కూడా అతడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ శిరిడీ వెళ్ళడానికి పాటంకర్ ముందు అయిష్టంగానే ఉన్నాడు. తరువాత మాత్రం బాబాకు దక్షిణ ఇవ్వను, ఒకవేళ ఇచ్చినా కూడా ఒక రూపాయి కంటే ఎక్కువ ఇవ్వననే ఒప్పందంపై ఘనశ్యాం తోపాటు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఘనశ్యాం అందుకు అంగీకరించి, ఇరువురూ కలిసి శిరిడీ వెళ్ళారు. ఆ రోజులలో శిరిడీలో కేవలం ఒకేఒక్క హోటల్ ఉండేది. దురదృష్టవశాత్తు భోజన సమయంలో పాటంకర్ కు పప్పులో కొన్ని పురుగులు కనిపించాయి. దానితో అతను, "నేను ఈ పురుగులు తినాలని ఇంతదూరం ప్రయాణం చేసి శిరిడీ వచ్చానా?" అని  బిగ్గరగా అరిచి గోల చేసాడు.

తరువాత స్నేహితులిద్దరు బాబా దర్శనం కోసం వెళ్లారు. బాబా పాటంకర్ ను చూస్తూనే కోపంతో మండిపడి అతడిని దూరంగా తరిమేసారు. అతడు నిరాశతో బాబా అనుమతి లేకుండానే శిరిడీ విడిచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నాడు. తోటి భక్తులు అతన్ని ఓదార్చి, అలా చేయవద్దని చెప్పారు. తరువాత మళ్ళీ స్నేహితులిద్దరూ బాబా దర్శనం కోసం వెళ్లారు. బాబా శాంతించి పాటంకర్ ని చూస్తూ, "పురుగులు తినడానికి ప్రజలు ఇక్కడకు వస్తారా?" అని అన్నారు. ఆ ప్రశ్న వింటూనే అతడు బాబా పాదాల మీద పడిపోయాడు. బాబా సర్వవ్యాపి అని గ్రహించాడు. అప్పుడు బాబా అతనికి అక్కల్ కోట్ స్వామిగా దర్శనం ఇచ్చారు. బాలకృష్ణ బువా మఠంలో తాను ఆరాధించే అదే రూపంలో బాబా దర్శనం ఇవ్వగా పాటంకర్ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. బాబా, స్వామిసమర్థ వేరువేరు కాదు, వారిరువురిలో భేదమే లేదని అతనికి అర్ధమయ్యింది. తరువాత అతడు బాబాకి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాడు. బాబా మళ్ళీ దక్షిణ అడిగారు. అతను ఆనందంగా మరొక రూపాయి ఇచ్చాడు. అప్పుడు బాబా వారికి శిరిడీ నుండి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. తిరిగి ఇల్లు చేరాక మంచి జీతంతో అతనికి మరొక ఉద్యోగం వచ్చింది. దానితో అతను సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపాడు. బాబా అతని నుండి రెండు రూపాయలు దక్షిణ తీసుకుని తిరిగి అతనికి వందరెట్లు ఇచ్చారు.

source: Ambrosia in Shirdi - Part-I

Related Posts:

5 comments:

  1. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.
    Om Sai Ram

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo