సాయిభక్తుడు కాశీనాథ్ దూబే బ్రాహ్మణ కులస్థుడు. అతడు మహారాష్ట్రలోని పూణేలో నివాసముండేవాడు. అతడొక దుకాణాదారుడు. అతడు శ్రీసాయిబాబాతో తనకు గల అనుభవాలను దివంగత శ్రీ బి.వి. నరసింహస్వామితో 1936, మే 3న ఈక్రింది విధంగా వివరించాడు.
నాకు మొదటినుండి సాధుసత్పురుషులపట్ల సదభిప్రాయం ఉండేదికాదు. అందువలన వారిపట్ల విముఖత చూపించేవాడిని. 1909వ సంవత్సరంలో నేను కోపర్‌గాఁవ్ లో నివాసముంటుండే వాడిని. అప్పుడొకరోజు ఒక మహిళ నావద్ద నుండి పదిరూపాయలు అప్పుగా తీసుకుని ఔరంగాబాదు నుండి తిరిగి వచ్చిన తరువాత నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చింది. అంతేకాదు శిరిడీలో సాయిబాబా అనే గొప్ప మహాత్ములు నివసిస్తున్నారని, వారు గొప్ప శక్తిసంపన్నులని కూడా ఆమె నాతో చెప్పింది. నేను సాయిబాబా గురించి వినడం అదే మొదటిసారి. వెంటనే ఆమె నా డబ్బులు నాకు ఇస్తుందన్న నమ్మకంలేని నాకు మనసులో ఒక ఆలోచన మెదిలి, "ఆమె తీసుకున్న పదిరూపాయలు తిరిగి ఇస్తే గనక అది శ్రీసాయిబాబాకు సమర్పించుకుంటాన"ని ప్రతిజ్ఞ చేశాను. తరువాత నేను ఔరంగాబాద్ వెళ్ళాను. అక్కడ ఆ మహిళ నాకు కనబడి, ఊహించని విధంగా తను మాట ఇచ్చినట్లుగా నా దగ్గర తీసుకున్న డబ్బు నాకు తిరిగి ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత నేను శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నానుగాని నా ప్రతిజ్ఞ గురించి ఆయనతో చెప్పలేదు.
నేను బాబాను సందర్శించిన మొదటిరోజు ఆయన నన్ను 3, 4 సార్లు దక్షిణ అడిగారు. మొదట రూ.5/-, తరువాత రూ.2/-, ఆ తరువాత రూ.2/-, చివరిగా రూ.1/- దక్షిణ అడిగి తీసుకున్నారు. నేను మూడురోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత రెండురోజులలో వారు నన్ను దక్షిణ అడుగలేదు. బాబా నావద్ద నుండి తీసుకున్న దక్షిణ మొత్తాన్ని నేను లెక్కించి చూస్తే, ఆశ్చర్యకరంగా అది సరిగ్గా పదిరూపాయలే అయింది. కొన్నినెలల క్రితం నేను బాబాకు ఇస్తానని ప్రతిజ్ఞ చేసిన అదే మొత్తాన్ని ఆయన నా దగ్గరనుండి తీసుకున్నారు.
సమాప్తం.

Source: Devotees' Experiences of Sri Sai Baba Part III by Sri.B.V.Narasimha Swamiji.
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, na manasulo anukunnadi jarige la chayandi tandri pls, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, amma nannalani kshamam ga chudandi vaalla badyata meede, ofce lo anta bagunde la chayandi tandri pls.
ReplyDelete