సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 220వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం
  2. సాయి ఆశీస్సులు

బాబా నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం

సాయి భక్తుడు సాంబశివరావు గారు వారం రోజుల క్రితం  "బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు" అనే టైటిల్ తో ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు రెండో అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.

ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, చదివే పాఠకదేవుళ్ళకు నా నమస్కారాలు. నాకు బాబా ప్రసాదించిన వింత అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ సంఘటన జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. మేముండేది గుంటూరుకి 26 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న గ్రామంలో. నేను పనిచేసే కార్యాలయం గుంటూరు సిటీలో వుంది. ఒకరోజు నేను మా కార్యాలయంలో పుస్తకాలు సర్దుతుండగా బాబా పారాయణకు సంబంధించిన చిన్న పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఎంత ఉంటుందంటే, భక్తుల ప్రశ్నలు - బాబా జవాబులు రోజుకు 3 చొప్పున వారంరోజుల పాటు చదువుకునేంత పరిమాణంలో ఉంటుంది. ఒక గురువారంరోజు కార్యాలయంలో పని ముగించుకుని ఖాళీసమయంలో ఆ పుస్తకం పారాయణ మొదలుపెట్టాను. అలా ప్రతిరోజూ కార్యాలయంలో ఖాళీసమయం దొరికినప్పుడల్లా పారాయణ చేస్తున్నాను. చివరిరోజు పారాయణ ముగిసినరోజు ఎవరైనా ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలని ఆ పుస్తకంలో వ్రాసివుంది. నేను మనసులో ఇలా అనుకున్నాను: “నాకు అంత శక్తి లేదు సాయి తండ్రీ! పైగా నేను కార్యాలయం నుండి ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10 గంటలు అవుతుంది. ఆ సమయంలో అందరూ నిద్రపోతూవుంటారు. ఆ సమయంలో అతిథిని పిలవడం, భోజనం పెట్టడం ఆ పల్లెటూరిలో కష్టం. కావాలంటే ఇంట్లో పూజ చేసి పండ్లు, ఫలాలతో సహా ఇంట్లో వండిన అన్నం నైవేద్యంగా మీకు సమర్పించుకుంటాను” అని అనుకున్నాను. కానీ బాబా చేసిన వింత లీల అద్భుతం! నేను ప్రతిరోజూ మా కార్యాలయం నుండి మార్కెట్ బస్టాపుకి నడిచి వెళ్ళేవాడిని. ఆ మధ్యలో జరిగింది ఆ అద్భుతం. ఆరోజు నేను నడుచుకుంటూ వస్తున్నాను. మార్గమధ్యంలో ఒక ముసలావిడ అడుక్కుంటూ వుంది. నన్ను కూడా అడిగింది. “బాబూ! 3,4 రోజుల నుండి భోజనం చేయడం లేదు. భోజనం చేయాలి, సహాయం చేయండి” అని అడుగుతోంది. నేను ఆమెకు 10 రూపాయలిచ్చి, ఏమైనా కొనుక్కోమని చెప్పాను. ఆమె, “నాకు డబ్బులు వద్దు బాబూ, కొద్దిగానైనా అన్నం పెట్టించండి” అని అడుగుతోంది. నేను కొంచెంసేపు ఆగి నా దగ్గర వున్న మా పెరట్లో కాచిన జామపండ్లు తినమని ఆమెకిచ్చాను. కానీ ఆమె మాత్రం, “నాకు అవేమీ వద్దు, కొద్దిగానైనా అన్నమే కావాలి” అని అడుగుతోంది. నా అజ్ఞానం చూడండి! “ఇదేమిటి, ఈమె అన్నమే కావాలంటోంది? ఈ సమయంలో నేను అన్నం ఎలా పెట్టగలను?” అని ఆలోచిస్తున్నాను. నా దగ్గర వున్న డబ్బులు చూసుకుంటే ఆరోజుకి, మరుసటిరోజుకి సరిపోయే డబ్బులు మాత్రమే ఉన్నాయి. “హోటల్లో భోజనం పెట్టిద్దామంటే నా దగ్గర వున్న డబ్బులు సరిపోవు, ఇప్పుడెలా?” అని అనుకున్నాను. ఇంతలో, “ప్లేట్ మీల్స్ తక్కువే ఉంటుంది కదా, సరే పాపం, ఇంతలా అడుగుతోంది కదా!” అని అనుకుని, ఆమెని హోటలుకి తీసుకువెళ్ళి, ప్లేట్ మీల్స్ టోకెన్ తీసుకొని, ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర ఆమెను కూర్చోబెట్టి నేను టోకెన్ కౌంటర్లో టోకెన్ ఇచ్చాను. వంటమనిషి 5 నిమిషాలు ఆగమన్నాడు. “సరే బాబూ, నాకు బస్ టైం అవుతోంది. నేను చాలా దూరం వెళ్ళాలి. ఆ బస్ వెళ్లిపోతే నాకు వేరే బస్ లేదు. నేను త్వరగా వెళ్ళాలి. అదిగో, అక్కడ ఒక పెద్దావిడ కూర్చొని వుంది, ఆవిడకు భోజనం పెట్టండి, ఈ టోకెన్ ఆమె కోసమే తీసుకున్నాను” అని చెప్పాను. మా సంభాషణను అంతా ఆ హోటల్ యజమాని గమనిస్తున్నాడు. ఆయనతో కూడా ఆ పెద్దావిడకు భోజనం అందేలా చూడమని చెప్పి నేను బయటకు వచ్చాను. నా మైండ్ ఆలోచనల దొంతరలలో మునిగిపోయింది. “అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది?” అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మనస్సులో మెదిలింది, మధ్యాహ్నం పారాయణ పుస్తంకంలో చదివిన “అతిథికి భోజనం పెట్టమ”ని చెప్పిన సంగతి. వెంటనే వెనుతిరిగి హోటల్ దగ్గరకు వచ్చి చూశాను. ఆ పెద్దావిడ అక్కడ లేదు. హోటల్ యజమానిని అడిగాను, “ఆ పెద్దావిడ ఎక్కడికి వెళ్లిందో చూశారా?” అని. ‘నేను నా పనిలో బిజీగా వున్నాన’ని చెప్పాడతను. వంటమనిషి దగ్గరకు వెళ్ళి, “ఆ పెద్దావిడకు భోజనం పెట్టమని చెప్పాను, భోజనం పెట్టారా?” అని అడిగాను. “ఏమో సార్, నా దగ్గరకు వచ్చిన టోకెన్లు అన్నిటికీ భోజనం వెళ్ళింది, కావాలంటే చూడండి” అని చూపించాడు. మరి ఈ పెద్దావిడ ఎక్కడికి వెళ్లిందో? 5 నిమిషాలలో ఆమె ఎంతో దూరం వెళ్లి వుండదని అనుకొని బయటకు వచ్చి వెతికాను. ఎంత వెతికినా ఆవిడ ఎక్కడా కనిపించలేదు. అంటే, బాబానే ఆ పెద్దావిడ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించారు అని అనుకున్నాను. ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాను. బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

సాయి ఆశీస్సులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ నమస్కారం. 2019, అక్టోబరు 31న నేను శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ పూర్తిచేశాను. బాబా గుడికి వెళ్లి, బాబాకు నైవేద్యం సమర్పించుకున్నాను. ముందుగా నేను బాబాతో చెప్పుకున్నట్లు గుడిలో ప్రసాదం పంచాను. తరువాత నేను గుడి నుండి బయటకు వస్తుంటే ఒక నల్లని ఆవు నా వద్దకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించింది. బాబానే ఆ రూపంలో వచ్చి, ప్రసాదాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించారని నాకు చాలా సంతోషం కలిగింది. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా! మీ చల్లని ఆశీస్సులు మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి తండ్రీ!" 

7 comments:

  1. i liked 1st experience.baba came in old women to bless the devotee.he is lucky to see baba in disguse

    ReplyDelete
  2. Akilansakoti brahmandanayaka rajadiraja yogiraja Sri sachchidananda samartha sadguru sainath maharajuki jai omsainathaya

    ReplyDelete
  3. Akilandakoti brahmandanayaka rajadiraja yogiraja parahbrahma Sri sachchidananda sadguru sainath maharajuki jai omsainathaya namaha

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  5. ఓం సాయిరాం

    ReplyDelete
  6. Om sai ram, amma nannalani kshamam ga chudandi tandri pls vaalla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls na manasu meeku telusu, ofce lo anta bagunde la chesi na manasulo unna korika neravere la chudandi tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo