ఈ భాగంలో అనుభవం:
- భక్తుల మనసులో బాబా కొలువైవుంటూ పిలిచినంతనే పలుకుతారు
నిర్మల్ నుండి సాయిభక్తురాలు సుచిత్ర తమ జీవితంలోకి బాబా రాకతో కలిగిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
సాయిరామ్!
బాబా మా జీవితంలోకి వచ్చాక కొన్ని మిరాకిల్స్ జరిగాయి. వాటిని సాయి కుటుంబసభ్యులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
2019, ఫిబ్రవరి 1న సాయిసచ్చరిత్ర పారాయణ చేశాను. అప్పటినుంచి బాబానే నా సర్వస్వం అనుకున్నాను. రెండునెలల తర్వాత నేను, "బాబా! ఏమి చేస్తావో ఏమో నాకు తెలీదు. కానీ, నా భర్తకున్న త్రాగుడు అలవాటు మాన్పించి, తనలో మార్పు తీసుకురా తండ్రీ!" అని బాబాను వేడుకున్నాను. అంతలో మావారికి తీవ్రమైన జ్వరమొచ్చి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. పరీక్షలు చేశాక టైఫాయిడ్, జాండిస్, లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళితే, "ఒక వారంరోజులపాటు మందులు వాడి రండి, లివర్ ఇన్ఫెక్షన్‌ని నీడిల్‌తో తీస్తాము" అన్నారు. వారంరోజుల తరువాత వెళితే, డాక్టర్ మళ్ళీ స్కానింగ్ చేసి, "మందులతో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నీడిల్ ఉపయోగించాల్సిన అవసరంలేదు. కానీ జీవితాంతం త్రాగవద్దు" అని చెప్పారు. అడిగినంతనే అనుగ్రహించిన బాబా పాదాలకు ఆరోజు నుంచి నేను బానిసనైపోయాను. భక్తుల మనసులో బాబా కొలువై ఉంటారని, పిలిచినంతనే పలుకుతారని చెప్పడానికి నిదర్శనమే నా ఈ అనుభవం.
మరో అనుభవం:
ఇప్పుడు బాబా మా కులదైవాన్ని పరిచయం చేసిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మా పెళ్లి జరిగి 14 సంవత్సరాలవుతోంది. కులం వేరన్న భావంతో మా అత్తగారు మా కులదైవానికి నన్ను దూరంగా పెట్టారు. 2008లో మేము ఒక స్టూడియో పెట్టుకున్నాము. దానిలో అంతగా లాభాలు లేకపోయినప్పటికీ అలాగే కొనసాగిస్తూ వచ్చాము. 2015లో డి.జె.బిజినెస్ (వేడుకలు, పండుగల సమయాలలో పాటలు పాడించే ఏర్పాటు చేయడం) మొదలుపెట్టాము. అందులో కూడా నష్టపోయాము. అదలా ఉంటే, బాబా మా జీవితంలోకి వచ్చాక వీలున్నప్పుడల్లా గురువారంనాడు కుటుంబమంతా కలిసి బాబా మందిరానికి వెళ్తుండేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు అనుకోకుండా అక్కడి పూజారితో, "మేము ఏ బిజినెస్ మొదలుపెట్టినా నష్టపోతున్నాము. చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాము" అని చెప్పాము. దానికతను, "నేనొక జ్యోతిష్కుని అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళండి. అక్కడ మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది" అన్నారు. మేము ఆ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. ఆ జ్యోతిష్కుడు మమ్మల్ని చూస్తూనే, "మీ కులదైవానికి ఖుషీ పండగ చేయండి" అని చెప్పారు. ఆ మాట వింటూనే ఒక్కసారిగా నేను నిర్ఘాంతపోయాను. తరువాత మేము మా ఇంట్లో పెద్దలకు ఆ విషయం చెప్పి ఒప్పించగలిగాము. అలా చివరికి ఈరోజు, అనగా 2019, నవంబరు 17న మేము మా కులదైవానికి పండుగ చేశాము. నా మనసుకు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇదంతా సాయిబాబా వలనే సాధ్యమైంది. ఆయన మా జీవితంలోకి రాకుంటే జీవితాంతం మా కులదైవానికి దూరంగానే ఉండేవాళ్ళము. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఇంకో అనుభవం:
పై అనుభవం జరగడానికి ముందు, అంటే వినాయకచవితి ఒక వారముందనగా మేము గణేష్ నిమజ్జనానికి డి.జె. ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అప్పటికి డి.జె. ఆపరేటర్స్ అందరూ బుక్ అయిపోయినందున మాకు ఎవరూ దొరకలేదు. ఆపరేటర్స్ దొరకకపోవడంతో కస్టమర్స్ నిరాశ చెందారు. ఒక ప్రోగ్రాం ఐతే రద్దు కూడా అయిపోయింది. ఏమీ తోచని పరిస్థితిలో సచ్చరిత్ర పుస్తకాన్ని పట్టుకొని ఏడుస్తూ, "బాబా! మాకెందుకిలా జరుగుతోంది? దయచేసి మాకోసం మంచి డి.జె. ఆపరేటర్‌ని పంపించండి" అని వేడుకున్నాను. తరువాత సాయి తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, ఆయనపై భారంవేసి చేతిలోకి సెల్‌ఫోన్ తీసుకొని దాదాపు రెండుగంటలు వెతికాను. చివరికి బాబా దయవలన ప్రక్కగ్రామానికి చెందిన ఒకతను వస్తానని చెప్పాడు. కానీ, అతని మాటల్లో నాకు నమ్మకం కనిపించక మళ్ళీ నేను బాబాని తలచుకొని, "ఎలాగైనాసరే అతన్ని పంపించండి" అని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేవగానే అతనికి ఫోన్ చేసి, "వస్తున్నారా?" అని అడిగితే, "మేడం, నేను బస్సులో ఉన్నాను" అని అతను చెప్పేసరికి నా సంతోషానికి అవధుల్లేవు. కేవలం ఒక్కరోజు ప్రోగ్రాం కోసం వచ్చిన అతను సీజన్ మొత్తం పూర్తయ్యేవరకు ఉండి, కార్యక్రమాలను విజయవంతం చేశాడు. పైగా అతను అమౌంట్ విషయంలో వాదులాడకుండా మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చినంత తీసుకొని వెళ్లారు. ఆ క్షణాన 'అతని రూపంలో వచ్చింది సాయిబాబానే' అనిపించింది. లేకపోతే ఈరోజుల్లో ముక్కు ముఖం తెలియనివాళ్ళ గురించి ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు? ఇంతలా రక్షణనిచ్చే బాబా గురించి ఊహ తెలిసినప్పటినుంచి నాకు తెలియనందున ఆయనను చాలా మిస్ అయ్యానని నాకనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనాసరే బాబా పాదాలు వదలను. చివరిశ్వాసవరకు ఆయన నా మనసులో ఉంటారు. ఏ పనిలో ఉన్నా ఆయన నామస్మరణలోనే ఉంటాను. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే మాపై కురిపిస్తూ మమ్ము అనుగ్రహిస్తూ ఉండండి".
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

Samarthan sadguru sainathmaharajuki jai always bless me baba
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏