ఈ భాగంలో అనుభవాలు:
- బాబా దయచూపిన సంఘటన
- సాయి యొక్క తక్షణ సహాయం
బాబా దయచూపిన సంఘటన
సాయిభక్తురాలు సుజాత తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా పేరు డి.సుజాత. మాది చిలకలూరిపేట. గతవారంలో నేనొక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను బాబాను మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకొని, "అది నెరవేరేవరకూ ప్రతి గురువారం నీ మందిరానికి వస్తాన"ని ఆయనతో చెప్పుకున్నాను. అలాగే ప్రతి గురువారం బాబా గుడికి వెళుతున్నాను. కానీ ఏవో కొన్ని కారణాలవల్ల 2, 3 వారాలు వెళ్ళలేకపోయాను. 2019, అక్టోబరు 24న తెలిసిన వాళ్ళింట్లో విష్ఠుసహస్రనామ పారాయణ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళదామని రెడీ అయ్యాను. తరువాత బండి మీద వెళ్తుంటే, దారిలో ఎక్కడో నా బ్యాగు పడిపోయింది. నేను పూజ జరిగే చోటికి వెళ్లి చూసుకుంటే బ్యాగు లేదు. వెంటనే నాకు దుఃఖం తన్నుకొచ్చి, "బాబా! నేను నీ పూజకోసమే కాదా బయలుదేరి వచ్చింది, మరి ఇలా జరిగిందేమిట"ని మనసులో అనుకున్నాను. తరువాత, "బాబా! నా తండ్రీ! ఇప్పుడే నీ సత్యాన్ని నిరూపించు. నా బ్యాగు దొరికేలా చేయండి. నేను నీ గుడికి రావాలి అనే విషయం మరచిపోలేదు. దయచేసి నా బ్యాగు దొరికేలా చేయండి" అని ప్రార్థిస్తూ బండి మీద బజారులన్నీ తిరిగాను. అయినా బ్యాగు కనపడక తిరిగి ఇంటికి చేరుకునేసరికి, మా అక్క, "నీ ఫోనుకి కాల్ చేస్తే, ఎవరో కాల్ లిఫ్ట్ చేసి, "ఎవరో ఇద్దరు కుర్రవాళ్ళు బ్యాగు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. మీరు వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పారు" అన్నది. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి బ్యాగు తీసుకొని చూడగా, అందులో ఉన్న 3,210 రూపాయలు, మొబైల్ ఫోన్, టెంకాయ, పూలు, విష్ఠుసహస్రనామాల పుస్తకం అన్నీ ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి. నా బ్యాగు ఇచ్చిన కుర్రవాళ్ళకి కృతజ్ఞతలు చెబుదామంటే, అప్పటికే వాళ్ళు వెళ్లిపోయారు. ఇదంతా బాబా దయవల్లే జరిగిందని నా నమ్మకం. ఆయనే నా బ్యాగు నాకు దొరికేలా చేశారు. మనం మంచి మనసుతో ఏ పని చేసినా బాబా సహాయసహకారాలు తప్పక లభిస్తాయని నా విషయంలో మరోసారి ఋజువైంది. వెంటనే పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న బాబా గుడికి వెళ్లి, నేను ప్రతి గురువారం గుడికి వస్తానని మ్రొక్కుకున్న మొక్కును నెరవేర్చుకొని బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

సాయి యొక్క తక్షణ సహాయం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను చిన్నప్పటినుండి సాయిబాబా భక్తురాలిని. ముందుగా నేను బాబా చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
అనుభవం 1:
నా వివాహాన్ని తిరుపతిలో చేయాలని నా తల్లిదండ్రులు ఆశించారు. కానీ నాది ప్రేమ వివాహమైనందున అది సాధ్యపడలేదు. వివాహమైన తరువాత తిరుపతి వెళదామని మేము చాలా ప్రయత్నించాము. కానీ, కొన్ని కారణాలవల్ల అది కూడా సాధ్యపడలేదు. అప్పుడు నేను ఆ విషయమై బాబాను ప్రార్థించాను. మా మొదటి వివాహ వార్షికోత్సవమైన కొన్నిరోజుల తరువాత మా రెండు కుంటుంబాలతో కలిసి మేము తిరుపతిని సందర్శించాము. దర్శనం చాలా బాగా జరిగింది. "నా ప్రార్థనను మన్నించినందుకు ధన్యవాదాలు బాబా!".
అనుభవం 2:
నాకు, నా భర్తకు జీతం విషయంలో సమస్య ఉంది. మా అవసరాలకు మా వద్ద కొంచెం డబ్బు మాత్రమే ఉంది. అలాంటి స్థితిలో అకస్మాత్తుగా నా తల్లిదండ్రులు, నా సోదరి మమ్మల్ని కలవడానికి మా ఇంటికి వస్తున్నామని చెప్పారు. సమయానికి చేతిలో డబ్బులు లేవు, పైగా వాళ్ళు వస్తే ఎలా సర్దుబాటు చేసుకోవాలో అర్థంకాక నేను చాలా ఆందోళనపడి, "బాబా! ఏ సమస్యా లేకుండా అంతా జాగ్రత్తగా చూసుకోండి" అని బాబాను ప్రార్థించాను. నేను అలా ప్రార్థించిన కొద్ది నిమిషాల్లో కొన్ని నెలలుగా ఇవ్వకుండా పెండింగులో ఉన్న జీతంనుండి ఒక నెల జీతం జమ చేయబడింది. "బాబా! మాకు తక్షణమే సహాయం చేశారు. చాలా ధన్యవాదాలు. మా అందరికీ అండగా ఉండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. మీ ఆశీస్సులు అందరికీ అందజేయండి బాబా. నా జీవితంలో మీరు చేస్తున్న ప్రతిదానికీ చాలా చాలా ధన్యవాదాలు".
om sairam nothing is impossible to our sai
ReplyDeleteom sairam nothing is impossible to our sai
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'
🕉 sai Ram
ReplyDelete