ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు
- కోరుకున్న ప్రాజెక్టులో అవకాశాన్నిచ్చారు బాబా
బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు
ఒక అజ్ఞాత సాయిభక్తుడు 2019, నవంబరు 12న బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
జై సాయిరామ్! సర్వవ్యాపకుడైన శ్రీ సాయినాథునికి నా ప్రణామములు. నేను మహాపారాయణలో సభ్యుడిని. కొన్ని కారణాల వలన నా పేరును తెలియజేయాలని అనుకోవడంలేదు. ఇటీవల మా అబ్బాయి విషయంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మా అబ్బాయి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. తను గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తనకి ఆ ఉద్యోగం వచ్చింది. అకస్మాత్తుగా నవంబరు నెలలో తనకి జీతం రాలేదు. సాధారణంగా నెలలో చివరి పనిదినంనాడు వచ్చేసే జీతం ఈ నెల 10వ తేదీ వచ్చినా రాలేదు. దాంతో తను చాలా ఆందోళనచెందుతూ ఉండేవాడు. దానికితోడు ప్రతిరోజూ తన మిత్రులు ఏవేవో కారణాలు చెప్తుంటే తను చాలా నిరాశగా ఇంటికి వస్తుండేవాడు. తన మనోభావాలు వింటుంటే నాకు కూడా అదోరకంగా అనిపించేది. కానీ, బాబా తనకి సహాయం చేస్తారని, తనకి జీతం వస్తుందని నా మనస్సాక్షి చెప్తుండేది. 11వ తేదీన నేను తెలుగులో శిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, "ఈరోజుగానీ లేదా రేపుగానీ మా అబ్బాయికి జీతం వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను మా అబ్బాయితో, "ఈరోజు రాత్రికిగానీ లేదా రేపుగానీ నీ జీతం నీకు వస్తుంది" అని చెప్పాను. అప్పుడు తను, "ఏమిటి గ్యారంటీ? సరే చూద్దాం" అన్నాడు. మరుసటిరోజు మధ్యాహ్నం తను నాకు ఫోన్ చేసి, "డాడ్! నా జీతం నా అకౌంటులో జమ అయ్యింది" అని చెప్పాడు. నాకు సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మనం హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః

కోరుకున్న ప్రాజెక్టులో అవకాశాన్నిచ్చారు బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నాకు పెళ్ళై, ఒక బాబు ఉన్నాడు. నాకు ఐటి రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవమంతా పాత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టులపైనే ఉంది. అయితే నేటి మార్కెట్లో మా ఉద్యోగాలు సురక్షితంగా ఉండాలంటే, మేము నిరంతరం మా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే క్రొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టుపై పని చేస్తుండాలి. అందువల్ల నా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరైనా క్రొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ప్రాజెక్టులో అవకాశం ఇవ్వాలని ఆశపడ్డాను.
నేను కోరుకున్నట్లుగానే బాబా దయవల్ల, క్రొత్త టెక్నాలజీతో కూడుకున్న ప్రాజెక్టులో అవకాశం వచ్చింది. అయితే క్లయింట్ USA కి చెంది ఉన్నందున అర్థరాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వచ్చేది. ఒకవైపు ఇంటిపనులు, మరోవైపు బాబుని చూసుకుంటూ అర్థరాత్రి వరకు పనిచేయాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ఆ ప్రాజెక్టు నుండి బయటపడాలనుకున్నాను. అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అనుకూలంగా ఉండే ప్రాజెక్టుని చూపించమని సాయిని ప్రార్థించాను. క్రొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యాను. కానీ నాకు అంత నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు ఆసియా క్లయింటుకి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం నాకొచ్చింది. అది నా పరిస్థితులకు చక్కగా సరిపోతుంది కాబట్టి అందులో నాకు అవకాశం రావాలని చాలా ఆరాటపడ్డాను. అదే విషయం బాబాకు చెప్పుకుని ఆయన నామం తలచుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఇంటర్వ్యూ సుమారు ఒక గంటపాటు కొనసాగింది. అందులో చాలా ప్రశ్నలకు నేను సరిగా స్పందించలేకపోయాను. అందువల్ల నాకు ఆ ప్రాజెక్టులో అవకాశం వస్తుందో, రాదో అర్థంకాక నేను చాలా ఆందోళనపడ్డాను. “బాబా! నాపై దయ చూపండి. ఆ ప్రాజెక్టులో నాకు అవకాశమివ్వండి” అని బాబాను వేడుకున్నాను. ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత నా మేనేజరును కలిసి, ఇంటర్వ్యూ అంత బాగా జరగలేదని, నేను ఎంపిక అవుతానో లేదో తెలియడంలేదని చెప్పాను. అతను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. సాయి దయవల్ల ఆ ప్రాజెక్టులో నాకు అవకాశం దక్కింది. నా ఆనందానికి అవధులులేవు. హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
Sri sainathmaharajuki jai
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏