బాబా శిరిడీలో సదేహులై సంచరించిన సుమారు 60 సంవత్సరాల కాలంలోనూ ఆయన నివాసము ఒక పాత మసీదు. ఆ మసీదునే బాబా “ద్వారకామాయి” అని అప్పుడప్పుడు వ్యవహరించేవారు. తాము "అల్లా బానిసన'నీ, అల్లాయే యజమాని” (“అల్లామాలిక్ హై") అనీ, సదా వినమ్రభావంతో, తమను గూర్చి చెప్పుకొనే బాబా, భక్తరక్షణకు తమలోని భగవత్స్వరూపాన్ని ప్రకటించాల్సి వచ్చినపుడు - తమ సహజ నిగూఢ పరిభాషలో - ఎక్కువగా 'మసీదు ఆయీ, 'మసీదు మాయి' అని చెప్పేవారు. “ఈ మసీదుమాయి బిడ్డలు ఏ ఆపదకు భయపడవలసిన పనిలేదు” అనీ, “తనకు చెందని పైకాన్ని (దక్షిణ) యీ మసీదుమాయి స్వీకరించదు!” అనీ, ఇలా తమనే 'మసీదుమాయి'గా వ్యవహరించేవారు బాబా! 'మసీదుమాయి” మహిమను గూర్చి బాబా (వివిధ సందర్భాలలో) ఇలా అన్నారు.
“ఇప్పుడు మీరు ఎక్కడ (మసీదు) కూర్చుని ఉన్నారో, అదే 'ద్వారకామాయి'. అంటే, ఆమె (ద్వారకామాయి) తన బిడ్డల ఆపదలను, ఆందోళనలను దూరం చేస్తుంది. ఈ మసీదుమాయి ఎంతో దయామయి. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఆమెను ఆశ్రయిస్తారో, వారందరూ ఆ తల్లి బిడ్డలు. తన బిడ్డలు ఆపదలో ఉంటే, ఆమె తప్పక కాపాడుతుంది. ఒక్కసారి ఆమె ఒడి చేరితే, ఇక వారి కష్టాలన్నీ కడతేరినట్లే. ఆమె నీడన హాయిగా నిద్రించిన వారికి అఖండ ఆనందం లభిస్తుంది."
“ఇదిమసీదు కాదు! ఇది ద్వారక! ఈ ద్వారకామాయిని ఆశ్రయించిన వారికేనటికీ ఏ కీడు జరుగదు."
“ఈ మసీదులో అడుగిడిన వారికి వారి కర్మవశాన కలిగిన కష్టాలన్నీ నశిస్తాయి. ఆనందమయి జీవితం ఆరంభమవుతుంది. ఇక్కడి ఫకీరు ఎంతో కరుణామయుడు. మీ కష్టాలనన్ని కడతేరుస్తాడు....."
“ఈ ద్వారకామాయిలో అడుగిడిన వాడు తప్పక తన లక్ష్యాన్ని సాధించగలడు..."
“ఈ ద్వారకామాయి బిడ్డలను పాము ఏమి చెయ్యగలదు? పాము కనిపిస్తే వారు దాన్ని తమాషాగా చూస్తూ వినోదించగలరు. ద్వారకామాయి రక్షణ వుంటే పాము కాటెయ్యగలదా?"
సోర్సు : సాయిపథం వాల్యూం - 1
🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏
🕉 sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
💐💐 OM SAIRAM 💐💐
ReplyDelete