ఈరోజు భాగంలో అనుభవాలు:
- నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి
- సాయి నేర్పిన పాఠం
నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
మా అమ్మాయి నెల్లూరులో M.B.B.S చదువుతోంది. మేము తనని చూడడానికి వెళ్తూ, అక్కడికి దగ్గరలోనే ఉన్న గొలగమూడిలోని వెంకయ్యస్వామి సన్నిధిని దర్శించాలని ప్రణాళిక చేసుకున్నాము. తీరా మేము అక్కడికి వెళ్ళాక మా అమ్మాయికి నెలసరి సమస్య వచ్చింది. దానికి వారం, పది రోజుల ముందు "మనసులో ఉన్న నెలసరి అడ్డంకిని తొలగించిన బాబా" అనే టైటిల్‌తో బ్లాగులో ఉన్న ఒక భక్తురాలి అనుభవాన్ని మేము చదివాము. అయినా నా మనసు సమాధానపడక గొలగమూడి వెళ్లే ప్రోగ్రాం మరోసారి పెట్టుకుందామని నేను అన్నాను. ఆ విషయమై నేను, మా అమ్మాయి చాలా వాదించుకున్నాము. చివరికి తను, "అంత చక్కటి అనుభవాన్ని చదివి ఏం ప్రయోజనం?" అని అంది. తరువాత నేను బాబాతో, "బాబా! ఆ భక్తురాలికి మీరిచ్చిన అనుభవాన్ని చదివి కూడా నన్ను నేను సమాధానపరుచుకోవాలంటే ఇబ్బందిగా వుంది. దీనికి మీరే ఏదో పరిష్కారం చూపించండి" అని అనుకున్నాను. ఇంతలో ఆ నెలసరి సమస్య కాస్తా నాకే వచ్చింది. నేను రెండు నిత్యపారాయణ గ్రూపులలో ఉన్నాను. అందువలన నేను సచ్చరిత్ర పారాయణ చేయాల్సి ఉంది. మరి ఇలాంటి సమయంలో పారాయణ చేయవచ్చో లేదో తెలియక ఆ గ్రూపు వాళ్లకు మెసేజ్ పెట్టాను. వాళ్లు నాకు ఫోన్ చేసి, "శిరిడీ సంస్థాన్ వాళ్లు ఒప్పుకోరు, మీ పారాయణ మీరే చెయ్యాలి" అని చెప్పారు. బాబా నా సమస్యకు వాళ్ళ ద్వారా అంత గొప్ప సమాధానం చెప్పించారు. "నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

"మనసులో ఉన్న నెలసరి అడ్డంకిని తొలగించిన బాబా" అనుభవం చదవాలనుకునే వారికోసం క్రింద లింకు ఇస్తున్నాను.
https://saimaharajsannidhi.blogspot.com/2019/01/blog-post_4.html
సాయి నేర్పిన పాఠం
సాయిభక్తుడు రవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరాం! నేను గత ఒకటిన్నర సంవత్సరం నుండి భగవాన్ సాయికి భక్తుడిని. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ఆ ఉద్యోగం సాయి నాకిచ్చిన బహుమతి. ఇక నా అనుభవానికి వస్తే....
ఈమధ్య ఒకసారి మా నాన్న ఏటీఎం నుంచి 10,000 రూపాయలు విత్‌డ్రా చేసే ప్రయత్నం చేశారు. ఏటీఎంలో డబ్బులు రాలేదు గాని, ఖాతా నుండి డబ్బులు తొలగించబడ్డాయి. ఆయన వేరే ఏటిఎంకు వెళ్లి ప్రయత్నిస్తే 10,000 రూపాయలు వచ్చాయి. కానీ ఖాతా నుండి మొత్తం 20,000 తొలగించబడినట్లు స్లిప్పులో ఉంది. వెంటనే నాన్న ఏటిఎం సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు, 'మీ ఖాతా ఎక్కడ ఉందో ఆ బ్యాంకును సంప్రదించమ'ని చెప్పారు. నాన్న అక్కడికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. 2-3 రోజులు వేచి ఉండమని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆ సమయం గడిచాక కూడా డబ్బులు తిరిగి జమ కాలేదు. నాన్న ప్రతి 2-3 రోజులకు ఒకసారి బ్యాంకు అధికారులను సంప్రదిస్తూ ఉండేవారు. అలా ఒక నెల పైగా గడిచింది. ఆ సమయంలో నేను మా ఊరికి వెళ్ళాను. నేను, నాన్న బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగులను కలిసాము. బ్యాంక్ మేనేజర్ మాటల మధ్యలో, 'ఏటిఎం లావాదేవీ విజయవంతమైంది, కాబట్టి మేము ఏమీ చేయలేమ'ని చెప్పారు. తరువాత మేము బ్యాంకులోని మరో ఉద్యోగితో మాట్లాడితే, అతను ఏటిఎం సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించి 2-3 రోజులు వేచి ఉండమని చెప్పాడు. 3 రోజుల తరువాత మళ్ళీ మొదటికొచ్చింది పరిస్థితి. నాన్న తిరిగి తిరిగి చిరాకుతో విసుగు చెందారు. నిజానికి నేను కూడా మొదట్లో డబ్బులు వాటంతటవే కొన్నిరోజుల్లో ఖాతాలో జమ అవుతాయని తేలికగానే తీసుకున్నాను. ఆ కారణంచేత నేను సాయిని కూడా ప్రార్థించలేదు. తీరా చూస్తే దాదాపు 40 రోజులు గడిచిపోయింది కానీ సమస్య అలానే ఉంది. అప్పుడు నేను, "బాబా! మా డబ్బులు మాకు వచ్చేలా చూడండి. అలా జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నేను ప్రార్థించిన నాలుగురోజుల్లో డబ్బులు నాన్న ఖాతాలో జమ అయ్యాయి.
ఈ అనుభవంతో సాయి నాకు మంచి పాఠం నేర్పించారు. అసలు విషయం ఏమిటంటే, ఇటువంటి సమస్యలకు సంబంధించిన అనుభవాలను భక్తులు పంచుకున్నప్పుడు నేను వాటిని సిల్లీగా తీసుకునేవాడిని. నా ఈ అనుభవం ద్వారా బాబా దృష్టిలో చిన్న, పెద్ద అనేది ఏమీ లేదని తెలుసుకున్నాను. ఇతర భక్తుల అనుభవాలను చిన్నచూపు చూడడం తప్పు అని తెలుసుకున్నాను. దానితో భక్తుల అనుభవాలను జడ్జ్ చేయడం మానేశాను. సమస్య మనకు ఎదురైనప్పుడు మాత్రమే దానిలో ఉండే కష్టం మనకు తెలుస్తుంది. "సాయీ! నాకు ఏది ఉత్తమమో వాటిని మీరు ఇచ్చినందుకు, నాకు మంచిది కాదని ఇవ్వని వాటికి నా ధన్యవాదాలు. సాయీ(గురు, తండ్రి)! ఇప్పటికీ నేను మీ బోధనలను అనుసరించలేకపోతున్నాను. దయచేసి మీ బోధనలను అనుసరించగలిగేలా నాకు మార్గనిర్దేశం చేయండి".
నాకు సమస్యలు వచ్చినప్పుడు సమాధానాల కోసం నేను క్వశ్చన్ & ఆన్సర్ సైట్‌లో అడుగుతాను. కానీ నాకు లభించే సమాధానాలను నా పరిస్థితులకు అన్వయించుకోలేక పోతున్నాను. గురువుకి(సాయి), శిష్యునికి(నాకు) మధ్య కొంత అంతరం ఉందని నేను భావిస్తున్నాను. "సాయీ! దయచేసి ఈ అడ్డంకులను తొలగించి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. నాకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలియదు. కానీ మీమీద నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నాను. నేను త్రికరణశుద్ధి(మనసా, వాచా, కర్మణా)గా మీ పవిత్రపాదాలకు లొంగిపోతున్నాను. నన్ను సరైన మార్గంలో నడిపించండి". ఈ భావాలన్నీ పూర్తిగా నావి కావు, బాబా చెప్పినవే. వాటితో ప్రేరణ పొంది పై వాక్యాలను నేను వ్రాశాను. "శిరిడీ సాయీ! దయచేసి నాపై మీ అనుగ్రహ వీక్షణాలను ప్రసరించి నన్ను ఉద్ధరించండి". బాబా ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో అనుభవాలను మీతో పంచుకుంటానని ఆశిస్తున్నాను.
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.
అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete