సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రావూజీ బాలకృష్ణ ఉపాసనీ



ధూలియా నివాసి రావూజీ బాలకృష్ణ ఉపాసనీ చాలాకాలంగా ఆస్త్మాతో బాధపడుతుండేవాడు. “ఒకసారి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకో”మన్న కాకాసాహెబ్ దీక్షిత్ సలహాననుసరించి అతను 1913లో శిరిడీ వెళ్ళాడు. బాబా అతనిని చూస్తూనే, “నువ్వు వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అని అన్నారు. తరువాత అతనిని ఆశీర్వదించి ఊదీ ప్రసాదాన్ని ఇచ్చారు. శిరిడీలో ఉండగానే బాబా ఊదీతో రావూజీకి ఆస్త్మా నుండి చాలావరకు ఉపశమనం లభించింది. తరువాత అతను బాబా వద్ద సెలవు తీసుకొని ఆనందంగా తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

అదే సంవత్సరం మార్చి నెలలో రావూజీ పెద్దకొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. ఐదు రోజులు గడిచినా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. పిల్లవాడికి చికిత్స చేస్తున్న వైద్యుడు, “జ్వరం తగ్గే సూచనలు కనపడటం లేదు. పిల్లవాడికి అంత తొందరగా నయం కాదు” అని చెప్పాడు. ఆరవరోజు జ్వర తీవ్రత అధికమై పిల్లవాడి పరిస్థితి చాలా విషమంగా మారింది. వైద్యుడు ఇక పిల్లవాడు బ్రతికే ఆశలేదని తేల్చి చెప్పేశాడు. దాంతో రావూజీ బాబా పటం ముందు నిలబడి తన బిడ్డకు జీవితాన్ని ప్రసాదించమని దీనంగా బాబాను ప్రార్థించాడు. 

ఆ తరువాత రావూజీ దుఃఖభారంతో అంతిమ క్షణాలు సమీపించిన పిల్లవాడి మంచం ప్రక్కనే కూర్చున్నాడు. పిల్లవాడికి చికిత్సనందిస్తున్న వైద్యుడు కూడా అక్కడే ఉన్నాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో రావూజీ బయటకు వెళ్ళి వరండాలో కూర్చొన్నాడు. అలసటగా ఉన్నందువల్ల కాసేపటికే కునుకుపట్టి అతను నిద్రమత్తులో తూలసాగాడు. ఇంతలో హఠాత్తుగా బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చారు. ఆ కలలో బాబా అతని బిడ్డ నుదుటన ఊదీ రాస్తూ కనిపించారు. ఆ తరువాత రావూజీ ముందు నిలబడి,ఆందోళనచెందకు. రెండు గంటల తరువాత జ్వరం తగ్గుముఖం పట్టి బిడ్డకి చెమటపోస్తుంది. తెల్లవారేసరికి పూర్తిగా తగ్గుతుంది. బిడ్డ కోలుకొన్న తరువాత నా దర్శనానికి శిరిడీ తీసుకొని రా!” అన్నారు బాబా. అంతటితో అతనికి మెలకువ వచ్చింది. సరిగ్గా రెండు గంటల తరువాత పిల్లవాడి కడుపులో ఉన్న చెడు అంతా వాంతి రూపంలో బయటకు వచ్చి, పిల్లవాడికి చెమటలుపట్టాయి. బాబా చెప్పినట్లే తెల్లవారేసరికి పిల్లవాడి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అది చూసి వైద్యుడు ఆశ్చర్యపోయాడు. 

మూడు రోజుల తరువాత రావూజీకి శిరిడీ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో షామా ఇలా వ్రాశాడు: “బాబా ఆదేశం లేనందువల్ల చాలాకాలంగా నేను మీకు ఉత్తరం వ్రాయలేదు. ఇప్పుడు బాబా ఆదేశం మేరకు వారు చెప్పింది మీకు వ్రాస్తున్నాను. “నేను ధులియాలో ఉన్న నీ స్నేహితుని ఇంటికి వెళ్ళాను” అని బాబా చెప్పారు. అప్పుడు నేను, “నా స్నేహితుడు ఎవరు?” అని బాబాను అడిగాను. అందుకాయన, “రావూజీ బాలకృష్ణ ఉపాసనీ” అని చెప్పి, “ఈ విషయాన్ని తెలియజేస్తూ అతనికి ఉత్తరం వ్రాయి” అని అన్నారు. అంతేకాదు, “నేను తరచూ అతని ఇంటిని సందర్శిస్తున్నానని కూడా వ్రాయి” అని చెప్పారు. అందుకే నేను మీకీ ఉత్తరం వ్రాస్తున్నాను”.

15 రోజుల తరువాత రావూజీ తన భార్యాబిడ్డలతో బాబా దర్శనానికి శిరిడీ బయలుదేరాడు. ఉదయాన్నే వాళ్ళు కోపర్‌గాఁవ్‌లో దిగి గోదావరిలో స్నానాలు చేశారు. ఆరతి సమయానికి శిరిడీ చేరుకోవాలని రావూజీ ఆశించాడు. కానీ టాంగావాడు దారిలో తన ఇంటికి వెళ్లి ఆలస్యం చేయసాగాడు. దాంతో ఆరతి సమయానికి శిరిడీ చేరుకోగలమా, లేదా అని రావూజీ సందేహించాడు. సరిగా అదే సమయంలో అక్కడ శిరిడీలో బాబా షామాతో, “షామా! ఆరతి కాసేపు ఆపు. నీ స్నేహితుడు రావూజీ వస్తున్నాడు. అతను దారిలో ఉన్నాడు. అతను ఆరతి సమయానికి ఇక్కడుండాలని ఆరాటపడుతున్నాడు” అని అన్నారు. కొంతసేపటికి రావూజీ శిరిడీ చేరుకున్నాడు. అతను తన కుటుంబంతో మసీదులో అడుగుపెడుతూనే ఆరతి ప్రారంభమయింది. బాబా అతని బిడ్డని దగ్గరకు పిలిచి, “నువ్వు జ్వరంతో బాధపడుతున్నపుడు నేను నీ వద్దకు వచ్చాను. నన్ను గుర్తించావా?” అని అడిగారు. వెంటనే రావూజీ, అతని కొడుకు బాబా పాదాలపై సాష్టాంగపడి, సమయానికి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ అనుభవం ద్వారా వారికి బాబా పట్ల భక్తిశ్రద్ధలు మరింత పెరిగాయి. 

సమాప్తం ....

Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
https://saisatcharitraparayana.wordpress.com/2015/12/24/blessed-devotee-who-experienced-babas-miracle-before-1918-saving-the-life-of-a-child-and-inviting-for-his-d-arshan/
http://www.saibabaofindia.com/ambrosia_in_shirdi_10_miracles_expereinces_leela.html

5 comments:

  1. 🙏🌺🙏
    ఓం సాయిరాం

    ReplyDelete
  2. Om sai ram baba ma andarini kapadu thandri sainatha

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🌹🙏🌹🙏🌹

    ReplyDelete
  4. Chaalaa baagundhi babaa thana biddalapaina choopina prema.

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo