- బాబా దయతో ఉదోగ్యప్రాప్తి
- చిన్న చిన్న విషయాలలో కూడా అండగా ఉండే బాబా
బాబా దయతో ఉదోగ్యప్రాప్తి
ఓం సాయిరాం! సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. సాయి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి బాబా నాకు తెలుసు. నా చిన్నతనం నుంచి బాబా తప్ప వేరే దైవం అంటే తెలియదు. తెలియదు అనంటే, ఆయా దైవమందిరాలకు వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థించాలో తెలిసేది కాదు. నాకు ఏమి కావాలో అంతా నా బాబానే చూసుకునేవారు. ఇప్పటివరకు నేనిలా ఉన్నానంటే అది నా బాబా దయే. నా జీవితంలో బాబా ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిలోనుండి ఒక అద్భుతాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
2015లో నా వివాహం జరిగింది. మావారు ఒక చిన్న కంపెనీలో 8 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నారు. ఆ కంపెనీ యాజమాన్యం తీరు నచ్చక వేరే కంపెనీలో చేరాలని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాకు నా బాబా మీద నమ్మకం తప్ప వేరే ఆలోచన లేదు. బాబా దయతో మావారికి ఏదైనా చిన్న కంపెనీలో ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ మేము ఊహించని టాప్ కంపెనీలో మావారికి ఉద్యోగం ప్రసాదించారు బాబా. ఆ కంపెనీ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ టెస్ట్ రాయడానికి కంపెనీవాళ్ళు టెస్ట్ లింక్ పంపించారు. కానీ, మావారు ఆ టెస్ట్ సరిగా రాయలేదు. దాంతో ఆ ఉద్యోగం ఇంక రాదని అనుకున్నాము. కానీ ఎవరికీ జరగని అద్భుతం బాబా అనుగ్రహంతో మాకు జరిగింది. ఆ కంపెనీవాళ్ళు మరలా రెండవసారి టెస్ట్ లింక్ పంపించారు. ఈసారి మావారు ఆ టెస్టులో పాసయ్యారు. ఇది కేవలం బాబా దయ మాత్రమే.
అలాగే జీతం విషయంలో కూడా బాబా అద్భుతాన్ని చేశారు. మొదట ఆ కంపెనీ హెచ్.ఆర్ తో మాట్లాడినప్పుడు మేము ఆశించినదానికంటే తక్కువ జీతం ఇస్తామన్నారు. కానీ, ఆ తరువాత హెచ్.ఆర్ వాళ్ళే మావారికి ఫోన్ చేసి, “మీకు ఎంత జీతం కావాలి?” అని అడిగి, మేము ఆశించినదానికన్నా తక్కువ జీతమే అయినప్పటికీ బాబా దయవల్ల మొదట ఇస్తామన్న దానికన్నా పెంచారు. మావారికి ఉద్యోగం వస్తే సాయిభక్తుల అనుభవమాలికలో ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “థాంక్యూ బాబా. మీ భక్తులు ఏమడిగినా మీరు కాదని చెప్పరు. మీ ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను”. ధన్యవాదాలు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై!
చిన్న చిన్న విషయాలలో కూడా అండగా ఉండే బాబా
పేరు వెల్లడించని ఓ సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారం. నేను టీచరుగా ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్య కరోనా కారణంగా క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే చెప్పడం జరుగుతోంది. అందుకు సంబంధించిన వర్క్ మొత్తం మొబైల్లోనే చేయాల్సి వస్తోంది. దాంతో నా మొబైల్లో ఛార్జింగ్ చాలా తొందరగా అయిపోతూ ఉండేది. ఇక వేరే గత్యంతరం లేక ఒక క్రొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నాను. అయితే, నేను ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా బాబా అనుమతి తీసుకుంటాను. అందువల్ల నేను, “బాబా! నాకు క్రొత్త మొబైల్ కొనుక్కోవాలని ఉంది, అనుమతి ఇవ్వండి” అని బాబాను అడిగాను. కానీ, బాబా “వద్దు” అని సమాధానమిచ్చారు. దాంతో నేను నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. తరువాత మా తమ్ముడితో మాట్లాడుతూ, “నా మొబైల్లో ఛార్జింగ్ చాలా తొందరగా అయిపోతోంది, దానివల్ల క్లాసులు చెప్పలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని చెప్పి, బాబా నిర్ణయం గురించి కూడా చెప్పాను. దాంతో వాడు, “సరే, నా మొబైల్ నువ్వు తీసుకో, నీది నాకివ్వు” అన్నాడు. ఈ విషయంలో కూడా బాబాను అనుమతి అడిగాను. కానీ బాబా అందుకు కూడా ఒప్పుకోలేదు. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, వర్క్ మొత్తం నేను మొబైల్లోనే చెయ్యాలి. అప్పుడు మా తమ్ముడు ‘కనీసం క్రొత్త బ్యాటరీ అయినా తీసుకో’ అన్నాడు. దాంతో మళ్ళీ నేను, “క్రొత్త బ్యాటరీ తీసుకోనా?” అని బాబాను అడిగాను. బాబా ‘తీసుకో’మని చెప్పారు. బాబా అనుమతితో నేను, మా తమ్ముడు కలిసి మొబైల్ షాపుకి వెళ్లి మొబైల్ ఇచ్చాము. “బ్యాటరీ మారుస్తాము, సాయంత్రానికల్లా వచ్చి మొబైల్ తీసుకెళ్ళండి” అని చెప్పారు వాళ్ళు. ఆరోజు సాయంత్రం నేను షాపుకి వెళ్ళి మొబైల్ తీసుకున్నాను. కానీ అక్కడ నేను మొబైల్‌ని సరిగా గమనించలేదు. ఇంటికి వచ్చి చూసుకునేసరికి నా మొబైల్లో ఉండాల్సిన రెండు సిమ్‌లు కనిపించలేదు. దాంతో నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! నువ్వు చెప్పినట్టే కదా నేను చేశాను. నా సిమ్‌లు నాకు దొరికేలా చూడు బాబా. మళ్లీ నేను వాటికోసం బయట తిరిగే పరిస్థితి రానీయకు. వెంటనే నా సిమ్‌లు నాకు దొరికితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. నా తమ్ముడు సిమ్‌ల కోసం షాపువాళ్ళకి ఫోన్ చేస్తే, “ఆ సిమ్‌లు ఇక్కడే వున్నాయి, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పారు వాళ్ళు. అది విని నాకు చాలా సంతోషమేసింది. క్రొత్త మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ మాత్రం మార్చి మొబైల్ చక్కగా పనిచేసేలా చూసిన బాబాకు ఎంతో ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “బాబా! మీ లీలలు తెలుసుకోవడం అసాధ్యం తండ్రీ. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు తల్లిలా, తండ్రిలా, స్నేహితునిలా, గురువులా, దైవంలా నాకు తోడుంటారు. మీ ఋణం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను తండ్రీ!”
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om sai ram
ReplyDeleteOm sairam
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై!
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
594 days
ReplyDeletesairam
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteWith siridi sai ram blessings. My health improved. Many many thanks to you tandri 🙏🙏🙏❤
ReplyDeleteOm sai ram baba eroju amma birthday ashirwadinchandi manchi arogyani prasadinchu thandri sainatha
ReplyDelete🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDelete