సాయిభక్తుడు శ్రీ ఎస్.ఎ.పాటంకర్ కాయస్థప్రభు కులానికి చెందినవాడు. ఇతను మహారాష్ట్రలోని ముంబైలోని దాదర్‌లో నివాసముండేవాడు. అతడు వెండితెర కళాకారుడు.
పాటంకర్ సాయిబాబా గురించి మొదటిసారి తన స్నేహితుడైన శ్రీ సామంత్ ద్వారా విన్నాడు. సాయిబాబా యొక్క గొప్పతనం, సచ్ఛీలత గురించి తెలుసుకొని తన ఇంటి గోడకు సాయిబాబా ఫోటోను తగిలించి పూజించడం మొదలుపెట్టాడు.
ఒకప్పుడు పాటంకర్ బిడ్డ జ్వరంతో చాలారోజులు బాధపడింది. అప్పుడొక రాత్రి 2 లేదా 3 గంటల సమయంలో ఒక ఫకీరు అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ శరీరాన్ని నిమురుతుండటం అతను చూసాడు. అతడు వెంటనే ఆ ఫకీరు వద్దకు వెళ్లి తన రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆ ఫకీరు దగ్గరకు రావద్దని, బిడ్డని తాకవద్దని తన చేతులతో సైగచేస్తూ, "బిడ్డకు నయమౌతుంది" అని చెప్పి అదృశ్యమయ్యారు.
మరొకప్పుడు పాటంకర్ పిల్లలిద్దరూ అనారోగ్యానికి గురైయ్యారు. వారిలో ఒకరికి జ్వర తీవ్రత రోజుల తరబడి కొనసాగుతుండటం గమనించిన అతను బాబా ఫోటోను చూస్తూ, "బిడ్డను కాపాడమ"ని ఆర్తిగా ప్రార్థించాడు. తరువాత అతను థర్మామీటరు తన చేతుల్లోకి తీసుకొని బాబా ఫోటోపై పెట్టి, "బాబా! మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే, ఈ బిడ్డలెందుకిలా బాధపడుతున్నారు? నేను ఇప్పుడీ థర్మామీటర్‌తో బిడ్డ ఉష్ణోగ్రత చూస్తాను. జ్వరం తగ్గి ఉన్నట్లయితే నేను మీ మీద విశ్వాసం కలిగి ఉంటాను. అంతేకాకుండా బిడ్డను రామనవమికి మీ వద్దకు తీసుకువస్తాను. ఒకవేళ జ్వరం తగ్గకపోతే మిమ్మల్ని నేనెలా విశ్వసించేది?" అని బాబాతో చెప్పుకున్నాడు. తరువాత అతను బాబా ఫోటోపై ఉన్న థర్మామీటర్ తీసి బిడ్డ జ్వరాన్ని పరీక్షించాడు. తను ఆశ్చర్యపోయేలా ఉష్ణోగ్రత సాధారణస్థితికి చేరుకొని ఉండటం చూసి ఆనందంతో బాబాకు ధన్యవాదములు చెప్పుకున్నాడు.

Source: Source: Devotees' Experiences of Shri Sai Baba, Parts I, II and III by Poojya Shri.B.V.Narasimha Swamiji)