ఈరోజు భాగంలో అనుభవాలు:
- పారాయణ చూపిన ఫలితం
- సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్నిచ్చి కోరిక నెరవేర్చిన సాయి
పారాయణ చూపిన ఫలితం
హలో ఫ్రెండ్స్! నా పేరు కర్పగవల్లి. నేను 28 సంవత్సరాలుగా కోయంబత్తూరులో నివసిస్తున్నాను. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. 2018, ఏప్రిల్‌లో నా కూతురికి వివాహమయ్యాక తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నా కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నేను తిరుచ్చి వెళ్లి నా తల్లిదండ్రులతో కలిసి ఉండాల్సి వచ్చింది. అయితే తిరుచ్చిలో ఉండటం నాకు సంతోషంగా ఉండేదికాదు. ఎప్పుడెప్పుడు కోయంబత్తూరుకు తిరిగి వెళ్లిపోదామా అని నా హృదయంలో ఉండేది. అందువలన, "నాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2019, జనవరి 16న మహాపారాయణ మొదలుపెట్టాను. సరిగ్గా ఒక్క నెలలో అంటే 2019, ఫిబ్రవరి 20న నేను తిరిగి కోయంబత్తూరు వెళ్లేలా బాబా నన్ను అనుగ్రహించారు. 'ఒక ప్రదేశానికి మారడం కూడా పెద్ద విషయమా?' అని చాలామందికి అనిపించవచ్చు కానీ, ఎన్నో కష్టాల నడుమనుండి కోయంబత్తూరుకు తిరిగి వెళ్లగలగడం నాకు చాలా పెద్ద విషయం.
ఆస్ట్రేలియాలో నివాసముంటున్న నా కూతురు 2028లో పి.ఆర్.(Permanent Resident) కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ రోజులు గడుస్తున్నా తనకి పి.ఆర్. రాలేదు. అందువలన తను 2019 మార్చిలో తిరిగి ఇండియాకి రావలసి వచ్చింది. తను వచ్చిన వెంటనే 'సచ్చరిత్ర' చదవటం మొదలుపెట్టింది. పదవరోజు, అంటే మార్చి 11కి తను 45 అధ్యాయాలు చదవడం పూర్తి చేసింది. ఆరోజు గురువారం కావడంతో నేను, నా కూతురు సాయిమందిరానికి వెళ్ళాము. మేము మందిరంలోకి వెళ్తూనే సంవత్సరంనుండి మేము ఎదురుచూస్తున్న పి.ఆర్. మంజూరు చేయబడినట్లు మెయిల్ వచ్చింది. మా సంతోషానికి అవధుల్లేవు. మేము చాలా ఆశీర్వాదపూర్వకంగా అనుభూతి చెందాము. ఇది నిజంగా 'సాయి మిరాకిల్'. నిజమైన ప్రార్థనలకు సాయి ఎల్లప్పుడూ సమాధానం ఇస్తారు. హృదయపూర్వకంగా కోరుకునేదాన్ని ఆయన తప్పక నెరవేరుస్తారు. "సాయీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ భక్తులందరికీ మీ ఆశీస్సులు అందజేయండి".

సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్నిచ్చి కోరిక నెరవేర్చిన సాయి
నేను ఒక సాయిభక్తుడిని. నేను యూఎస్ఏ నివాసిని. కొన్ని సంవత్సరాలుగా నేను నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా చాలా బాధపడుతున్నాను, ముఖ్యంగా నా భార్యకు, నా తల్లిదండ్రులకు మధ్య ఏర్పడిన అపార్థాల వలన. నేను నా తల్లిదండ్రులకు ఏకైక మగ సంతానాన్ని. అందువలన నా తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత నాపై అధికంగా ఉంది. అదేవిధంగా నా భార్యపట్ల కూడా నాకు బాధ్యత ఉంది. కానీ నా భార్య నా తల్లిదండ్రుల గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. వారిపట్ల ఆమెకున్న బాధ్యత తనకి అర్థం కాలేదు. ఆమె మా జీవితాలను విడిగా గడపాలని ఆశిస్తుండేది. నా తల్లిదండ్రులు ఒకరికొకరు తోడు ఉన్నందున వారి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ మొండిగా ఉండేది. మొత్తానికి ఆ కారణాలచేత నా తల్లిదండ్రులు ఇండియాలో ఉంటుండగా మేము USAలో నివసిస్తుండేవాళ్ళం. వృద్ధాప్యంలో, నా అవసరమున్న సమయంలో వాళ్లకి దూరంగా ఉండటం నా హృదయాన్ని కలచివేస్తుండేది. కానీ ఏమీ చేయలేక ప్రతిరోజూ, "బాబా! నా కుటుంబంలో అహం కారణంగా ఏర్పడిన అపార్థాలను, ఘర్షణలను తొలగించి వాళ్ళ మధ్య ఐక్యత ఏర్పరచి, మా ఇంట ఆనందం, శాంతి వెల్లివిరిసేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థిస్తుండేవాడిని. అలా చాలాకాలం బాధపడిన తరువాత బాబా అనుగ్రహంతో చివరకు 2019, ఫిబ్రవరి 21న నా కుటుంబంలో ఆనందం తాండవించింది. నా భార్యకు, నా తల్లిదండ్రులకు, నా అత్తమామలకు మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నా భార్య నా తల్లిదండ్రులను అర్థం చేసుకుని, వాళ్ళను తన తల్లిదండ్రులను ప్రేమించే విధంగానే ప్రేమిస్తూ, చాలా సమయాన్ని వాళ్లతో గడుపుతుంది. ఆమె వాళ్ళ రాకకోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంది. రెండు కుటుంబాల మధ్య ప్రేమపూర్వక వాతావరణం పునరుద్ధరించబడింది. ఇదంతా సాయిబాబా కారణంగానే. అయన నెమ్మదిగా మా కర్మలను తొలగించి జాగ్రత్తగా అంతా సరిచేశారు. బాబా దయవలన ఇప్పుడు మేమెంతో సంతోషంగా ఉన్నాము. "బాబా! నా భార్య, నా బిడ్డ, నా తల్లిదండ్రులు మరియు అత్తమామలు ఒకరిపట్ల ఒకరు ప్రేమతో మెలిగేలా ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి".
Sri sachchidananda Samantha sadguru sainath ki jai
ReplyDeleteSri sachchidananda Samantha sadguru sainath maharajuki jai
ReplyDeleteSri sainathaya namaha
ReplyDeleteJai sairam
ReplyDelete🕉 sai Ram
ReplyDelete