సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1798వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మన తోడుంటే ఎలాంటి కష్టాలు రావు
2. అండగా ఉండి ఆదుకున్న బాబా

బాబా మన తోడుంటే ఎలాంటి కష్టాలు రావు


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సౌజన్య. బాబా మన తోడుంటే ఎలాంటి కష్టాలు రావని మరోసారి నా జీవితంలో నిరూపణ అయింది. 2024, ఫిబ్రవరి 9న తిరుపతి వెళ్ళడానికి మేము టిక్కెట్టు బుక్ చేసుకున్నాం. కానీ అదే సమయంలో నా నెలసరి ఉండటంతో నేను బాబాని, "బాబా! నాకు నెలసరి రాకుండా చేసి మాకు స్వామివారి దర్శనం బాగా అయ్యేలా చూడండి. ఇంకా మా ప్రయాణంలో ఎటువంటి సమస్యలు లేకుండా మేము క్షేమంగా వెళ్లి, రావాలి" అని వేడుకున్నాను. తిరుపతిలో మొక్కు తీర్చడం కోసం నాకు 5 రూపాయల నాణేలు 3 కిలోలు కావాల్సి వచ్చింది. వాటికోసం నేను చాలా ప్రయత్నించినప్పటికీ నాకు దొరకలేదు. దాంతో నాకు ఏమి చేయాలో అర్థంకాక, "బాబా! ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా మీరే నాకు సహాయం చేయాలి తండ్రీ" అని బాబాని అర్థించాను. బాబా దయవల్ల ఒక ఆంటీ కొన్ని గుళ్ళలో అడగమని చెప్పారు. దాంతో ఒక రెండు గుళ్ళలో అడిగితే రెండున్నర కిలోల నాణేలు దొరికాయి. మిగిలిన అరకిలో విషయంలో నాకు టెన్షన్ వచ్చి, "స్వామీ! ఎలాగైనా ఆ అరకిలో కూడా దొరికేలా చేయండి" అని బాబాను అడిగాను. ఒక వారం రోజులకి మిగిలిన అరకిలో నాణేలు కూడా దొరికాయి. అలా బాబా నా మొక్కు తీర్చుకోవడానికి సహాయం చేసారు. ఇకపొతే, ప్రయాణానికి 3 రోజుల ముందు నుండి మా బాబు, పాప జలుబు, దగ్గుతో బాగా ఇబ్బందిపడ్డారు. రేపు ప్రయాణమనగా ఆ రాత్రి బాబు దగ్గుతూ వాంతులు చేసుకోసాగాడు. ఒకానొక సమయంలో నేను, 'ఇక రేపు ఉదయం తిరుపతికి ప్రయాణం అవ్వలేమన్న' నిర్ధారణకు వచ్చేసి, "బాబా! నా విషయంలో ఎందుకిలా చేస్తున్నావు? ఇంతవరకు నేను ఎప్పుడూ తిరుపతి వెళ్ళలేదు. తీరా ఇప్పుడు వెళ్తున్నాం అనేసరికి ఇలా ఎందుకు అయింది?" అని బాబాతో చెప్పుకొని బాధపడ్డాను. తర్వాత 'సాయి రక్షక శరణం దేవా' అని స్మరించాను. ఒక నాలుగుసార్లు బాబు వాంతి చేసుకొని కఫమంతా బయటకి వచ్చేసాక దగ్గకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. మేము ఎక్కడ ప్రయాణంలో ఇబ్బంది పడతమోనని ముందురోజు రాత్రి బాబా అలా జరిగేలా చేసారని నాకు మరుసటిరోజు అర్థమైంది. బాబా దయవల్ల మాకు స్వామివారి దర్శనం బాగా జరిగింది. మనస్పూర్తిగా నమ్మితే తప్పకుండా మన సమస్యలు తీర్చే దయామయుడు మన సాయి. తమని నమ్ముకున్నవాళ్లకి ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా రక్షణనిస్తుంటారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మా చేయి పట్టి నడిపించు స్వామీ".


2024, ఫిబ్రవరి 23 రాత్రి మా బాబుకి దగ్గు వచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు. మధ్యరాత్రిలో నిద్రపోతున్న బాబు హఠాత్తుగా కళ్ళు తెరిచి, "నాకేం భయం లేదు, స్వామి(బాబా) ఉన్నాడు" అని అన్నాడు. అయితే కాసేపయ్యాక బాబుకి బాగా జ్వరం వచ్చింది. నేను బాబుని లేపి, "సిరప్ వేసుకో" అంటే వాడు, "ఉదయం వేసుకుంటాను అమ్మ" అన్నాడు. నేను బాబాని తలచుకొని సాయి రక్షక మంత్రం చదవసాగాను. తడి గుడ్డ బాబు నుదురు మీద వేసి, "బాబా! బాబుకి జ్వరం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. ఒక గంట సాయి రక్షక మంత్రం పఠించాక వేకువజామున 3.30కి అలా మేము పడుకున్నాము. బాబా దయవల్ల ఉదయానికల్లా బాబుకి జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. ఈమధ్య మా బాబుకి జలుబు, దగ్గు ఎక్కువగా వస్తున్నాయి. దయచేసి బాబుని మీరే కాపాడండి. వాడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేయి స్వామి".


అండగా ఉండి ఆదుకున్న బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుంచి నాకు బాబా అంటే ఎంతో ప్రేమ, నమ్మకం. బాబా ఎన్నో ఆపదల నుంచి ఎటువంటి హాని కలగకుండా నన్ను కాపాడారు. మా అమ్మకి కూడా బాబా అంటే చాలా ఇష్టం. 2023, సెప్టెంబర్‌లో మా అమ్మ రెండు చెవులు వినిపించడం మానేసేయి. డాక్టర్ వద్దకు వెళ్తే, "ఇది చాలా ప్రమాదకరం. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా ఇలా జరుగుతుంది" అని టెస్టులు వ్రాసి, కొన్ని రోజులకు మందులు ఇచ్చారు. మేము, "బాబా! అన్నిటికి నీవే ఉన్నావు. మమ్మల్ని ఈ ఆపదనుండి బయటపడేయండి" అని బాబా పాదాలను ఆశ్రయించాము. నేను, "అంతా సవ్యంగా జరిగితే మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను. నవ గురువార వ్రతం మొదలుపెడతాను" అని బాబాకి మొక్కుకున్నాను. డాక్టర్ ఇచ్చిన మందులు పది రోజులు వాడినా పెద్దగా గుణం కనపడలేదు. అప్పుడు మా తమ్ముడు అమ్మని బెంగళూరు తీసుకెళదామని, ఇక్కడ చేసిన టెస్టు రిపోర్టులు అక్కడ డాక్టర్లకు చూపిస్తే, అందరూ సర్జరీ చేయాలని అన్నారు. దాంతో మేము బాబా మీద భారమేసి అమ్మని బెంగళూరు తీసుకెళ్లడానికి సిద్ధమై అన్ని ఏర్పాట్లు చేయసాగాము. డాక్టర్ బెంగుళూరు వెళ్లేవరకు వేరే ఏవో ఇంజక్షన్లు అమ్మకి ఇస్తానని ఇచ్చారు. డాక్టర్ ఇంజక్షన్ చేసిన పూటకి కొంచెం కొంచెంగా అమ్మకు వినపడటం మొదలై వారం రోజుల్లో మామూలుగా అయింది. ఎంత ఆశ్చర్యమో, బాబా ఎంత అండగా ఉన్నారో నేను చెప్పలేను. "ధన్యవాదాలు బాబా. ఎన్ని జన్మలైనా నా తండ్రి సాయి నీ పాదాలు విడువను".


22 comments:

  1. ఓం శ్రీ సద్గురు సాయి నాధ్ మహా రాజ్ కి జై

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  7. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  8. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  9. Baba annintiki meere unnaru thandri. Em chestharo Ela chestharo antha Meede bharam baba. Om Sairam!!

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. ఓం సాయిరామ్

    ReplyDelete
  13. Sri sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete
  14. Baba mere mammalni kapadali.....Mee daya valla intha duram vacham....ee pending vunnayi vachi memu evaru ebbandi padakunda chudandi baba please,naa valla evariki ebbandi lekunda chudandi please baba....Mee padale Naku dikku mere nannu kadapadali....naku jivitham meda nammakam pothundi baba🙏🙏🙏🙏🙏mere dikku naku 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. ζει ότι καθημερινά μολύνονται με κάποιο ΣΜΝ περίπου 1 εκατομμύριο άνθρωποι, οι οποίοι είναι στην πλειονότητά τους ασυμπτωματικοί. Εκτιμάται επίσης ότι περισσότεροι από 500 εκατομμύρια άνθρωποι έχουν εκδηλώσει έρπητα γεννητικών Blogs
    Blogs
    Blogs
    Blogs
    Blogs
    Blogs
    Blogs
    Blogs
    Blogs

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo