సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1803వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాక్షాత్తు సాయినాథుడే అందించిన సహాయం
2. బాబా దయతో చాలావరకు తగ్గిన సమస్య

సాక్షాత్తు సాయినాథుడే అందించిన సహాయం


సాయి భగవాన్‌కి శతకోటి వందనాలు. సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కమల. మేము 2002, మే నెలలో మొదటిసారి శిరిడీ వెళ్లి మంచిగా సాయి దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యాము. సాయంత్రం 5 గంటలకి మన్మాడ్ స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకి మేము మా గది ఖాళీచేసి శిరిడీ బస్సు స్టాండుకని బయలుదేరాము. మాకు ఆటో దొరికి బస్సు స్టాండుకి వెళ్లేసరికి అప్పుడే మన్మాడ్ వెళ్లే బస్సు వెళ్లిపోయింది. ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తీసుకుని వెళ్ళిపోయాయని అక్కడివాళ్లు చెప్పారు. అప్పటికి సమయం 3:30 దాటిపోతోంది. తొందరగా ఏదో ఒక వాహనం దొరక్కపోతే రైలు వచ్చే సమయానికి మేము మన్మాడ్ స్టేషన్ చేరుకోవడం జరగని పని. మాకు దిక్కుతోచలేదు. నేను కంగారులో రోడ్డు మీద పోయే ఏదైనా ఆటో కనపడితే ఆపాలని రోడ్డు వైపు చూస్తున్నాను. ఇంతలో తెల్లని దుస్తులు, తెల్లని తలపాగ ధరించిన ఒక వ్యక్తి మావారి పక్కకొచ్చి, "ఎందుకు కంగారుపడుతున్నారు?" అని అడిగితే, మావారు విషయం చెప్పారు. అదంతా పట్టించుకునే స్థితిలో లేను నేను, ఏదో ఒక ఆటో దొరికితే చాలన్నట్టుగా రోడ్డుకి అవతల వైపు వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపాలని చేతితో సైగలు చేశాను. కానీ ఆ వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. అప్పటివరకూ రోడ్డుకి అటువైపు ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా నా వెనకలా నుంచి వచ్చి, "కోయి బాతో నాహీ, గాడి మిలేగా(ట్రైను అందుతుంది. కంగారుపడకుండి)" అని హిందీలో చెప్పి నా పక్కన నిలబడి ఆ దారిలో వచ్చే, పోయే వాహనాలను చూడసాగాడు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించిందిగాని, మా కంగారులో మేము ఉన్నాము. అందువల్ల ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి, పనిగట్టుకొని కొత్త ప్రదేశంలో, మధ్యాహ్నవేళ, ఎండలో మాతోపాటు నిలబడి మాకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుంటే అతని గురించిగాని, అతని సహాయం గురించిగాని ఆలోచించే సమయం మాకు లేకపోయింది. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చిందో ఒక తెల్లని కారు రోడ్డు మీద కనిపించింది. ఆ కారుని చూడగానే ఆ వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి చేయి అడ్డం పెట్టి ఆపమన్నట్లు సంజ్ఞలు చేయగానే ఆ కారు మా ముందుకు వచ్చి ఆగింది. ఆ కారు ఖాళీగా ఉండటం చూడగానే మా ప్రాణం లేచి వచ్చింది. ఆ అజ్ఞాత వ్యక్తి కారు డ్రైవర్‌తో మమ్మల్ని మన్మాడ్ స్టేషన్‌లో దింపమని చెపితే, అతను సరేనని మమ్మల్ని కారు ఎక్కమన్నాడు. మేము ఇంకో ఆలోచన లేకుండా కారు ఎక్కాము. కారు కదులుతుండగా మావారు, "మేము దిగాక డ్రైవర్‌కి ఎంత ఇవ్వాల"ని అడిగితే, ఆ అజ్ఞాత వ్యక్తి, "చాలీసు(40) లేలో" అని ఆ డ్రైవర్‌తో చెప్పాడు. డ్రైవర్ ఆఘమేఘాల మీద మమ్మల్ని తీసుకెళ్ళి మన్మాడ్ స్టేషన్ వద్ద దింపాడు. మాకు అంతా ఒక కలలా అనిపించింది. స్టేషన్ లోపలికి అడుగుపెడుతుండగా మేము ఎక్కాల్సిన రైలు వస్తుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. ట్రైన్ ఎక్కి కూర్చున్నాక నెమ్మదిగా జరిగినదంతా తలుచుకొంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మాములు టాక్సీ అయితే ఎంత కాదన్నా ముగ్గురికి 250 రూపాయలు తీసుకోవాలి లేదా వేరేవాళ్లని అయినా ఎక్కించుకోవాలి. కానీ ఆ డ్రైవర్ అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా కేవలం మా ముగ్గురిని స్టేషన్‌లో దింపి, గంటకు పైగా ప్రయాణానికి ముగ్గురుకి కలిపి 120 రూపాయలు మాత్రమే తీసుకుని ఎందుకు వెళ్లిపోయాడు? ముఖ్యంగా మేము ఏ సహాయం అడగకపోయినా తనంతటతానే వచ్చి మమ్మల్ని ఆదుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించి, తలకి తెల్లని వస్త్రం చుట్టుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి రూపాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నిత్యం మేము పూజచేసే బాబా రూపం, చిన్న వయసులో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి రూపం ఒకేలా ఉన్నాయని అనిపించింది. దాంతో సమయానికి మా దగ్గరకొచ్చింది సాక్షాత్తు ఆ సాయిబాబానే అని, ఆ తండ్రి తమ బిడ్డలకోసం ఎల్లప్పుడూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవడానికి సదా మనతోనే ఉంటారని అర్థమైన క్షణంలో నా కళ్లనిండా ఆనందబాష్పాలు కమ్ముకున్నాయి. మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. అప్పటి ఆ శిరిడీ ప్రయాణ అనుభవం సదా నా మనస్సులో ఇప్పటికీ పదిలంగా నిలిచిపోయింది. ఆరోజు మేము చూసిన ఆ సాయి రూపం నేటికీ నా కళ్ల ముందు మెదులుతుంది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మా హృదయంలో, మనసులో ఉండి మమ్మల్ని ఆదుకోండి తండ్రీ. ఎప్పటికీ మమ్మల్ని మీ అడుగుజాడలలో నడిపించండి".


బాబా దయతో చాలావరకు తగ్గిన సమస్య


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రజనీకాంత్. కొన్ని సంవత్సరాలుగా నాన్-వెజ్ తింటే కడుపునొప్పి వచ్చి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుండేది. ఈ విషయం గురించి నేను ఒకరోజు ఒక అతనితో చెప్తే, "ఇది చాలా ప్రమాదకరం" అని కొన్ని టాబ్లెట్లు వ్రాసి, "వీటిని వాడు. తగ్గకపోతే స్కానింగ్ తీద్దామ"ని అని అన్నారు. నేను సరేనని ఆ టాబ్లెట్లు తీసుకోవడానికి ఒక మెడికల్ షాపుకి వెళ్లి, అక్కుడున్న అతనితో విషయం చెప్పి "ఈ టాబ్లెట్లు ఇవ్వండి" అని అన్నాను. అతను వేరే టాబ్లెట్లు ఇచ్చి, "ఇవి వాడండి. చూద్దాం" అని అన్నాడు. నేను ఇంటికి వెళ్లి, "బాబా! నాకు ఈ సమస్య చాలాకాలంగా ఉంది. ఇది కాస్త తగ్గితే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని ఆ టాబ్లెట్లు వాడాను. బాబా యవల్ల సమస్య చాలావరకు తగ్గింది. "చాలా ధన్యవాదాలు బాబా. నాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. వాటిని కూడా పరిష్కరించు బాబా".

18 comments:

  1. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu🙏🙏

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  7. ధన్యవాదాలు సాయి

    ReplyDelete
  8. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  9. sai baba eeroju madava etuvanti pechi pettakunda school ki vellali baba. madava phone chesi nenu school ki veltunnanu ani cheppali baba.

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  13. Baba ,maa samasya ni parisharinchandi baba please....mere naku dikku mammalni ee kastam nundi gattu ekkinchandi ....Mee Valle intha duram ragaligamu maa valla evari life lo ebbandi kalagakunda evarivi vallaki avasaram ki ichela anugrahinchandi please....naku mee padale dikku 🙏🙏🙏🙏🙏....inka thattukune opika ledu baba 🙏🙏🙏🥺❤️ mere nannu kadapadali

    ReplyDelete
  14. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  15. Om srisairam 💐💐🙏🙏

    ReplyDelete
  16. Sri samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo