1. బాబా దయ
2. ప్రతి అవసరాన్ని తీర్చే బాబా
బాబా దయ
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నా పేరు లలిత. ఈమధ్య నా భర్తకి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి నిద్రపట్టక చాలా ఇబ్బందిపడ్డారు. నేను వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకొని, ఊదీ ఆయన నుదుటన పెట్టి, మరికొంత ఊదీ ఆయన కడుపుకి రాసి, ఇంకాస్త ఊదీ ఆయన నోట్లో వేసి, "బాబా! ఆయనకి నొప్పి తగ్గి నిద్రపట్టినట్లు అనుగ్రహించండి" అని ప్రార్థించాను. బాబా దయవలన కొంచెం నొప్పి తగ్గి మావారికి నిద్రపట్టింది. మర్నాడు హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ ఎండోస్కోపీ చేయాలని అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! ఆయనకి ఎండోస్కోపీ చేసినట్లైతే రిపోర్టు నార్మల్‌గా వచ్చేలా చూడండి" అని ప్రార్థించడం మొదలుపెట్టాను. బాబా దయవలన ఎండోస్కోపీ చేశాక రిపోర్ట్ నార్మల్‌గా వచ్చింది. అప్పుడు డాక్టరు, "గ్యాస్ట్రిక్ సమస్య వలన అలా నొప్పి వచ్చింది" అని రెండు నెలలకి మందులు వ్రాశారు. ఆ మందులు వాడుతుంటే ఇప్పుడు నొప్పి తగ్గి కొంచెం బాగానే ఉన్నారు. ఇదంతా బాబా దయవలనే సాధ్యమైంది. అసాధ్యన్ని సుసాధ్యం చేయగలరు నా తండ్రిసాయి.
మా నాన్నవాళ్ళకు ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చింది కాని దాని తాలూకు పట్టా చాలారోజుల వరకు ఇవ్వలేదు. పట్టా ఇస్తేగానీ గృహ నిర్మాణం చేసేందుకు సాధ్యపడదు. అందువల్ల నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! నాన్నవాళ్ళకి పట్టా ఇచ్చేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. నాన్నవాళ్ళకి పట్టా ఇచ్చారు. 2024, ఫిబ్రవరి 11న శంకుస్థాపన చేశారు. అంతా నా బాబా దయ. "ధన్యవాదాలు సాయి. ఎల్లప్పుడూ నా మీద మీ ప్రేమ, దయ ఇలాగే ఉండాలి. మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, శ్రద్ధ, సబూరి కలిగి ఉండాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ".
ప్రతి అవసరాన్ని తీర్చే బాబా
నా పేరు అపర్ణ. శ్రీ సాయినాథుని పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ప్రతిరోజు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు తప్పక చదువుతాను. బాబా బోధించిన 'శ్రద్ధ-సబూరీ' భక్తులలో పెంపొందడానికి, బాబా చూపిన మార్గంలో భక్తులు నడవడానికి ఈ అద్భుతమైన బ్లాగ్ ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా ప్రతి అవసరాన్ని, కోరికను, ఆపదను తీర్చమని శ్రీసాయినాథుని వేడుకుంటాను. నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఒకసారి మేము మా మేనమామ గృహప్రవేశ వేడుకకు విజయవాడ వెళ్ళాము. అక్కడ గృహప్రవేశం, లక్ష్మీగణపతి హోమం, శ్రీసత్యనారాయణస్వామి వ్రతం తదితర కార్యక్రమాలన్నీ మంచిగా జరిగాక అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మా అమ్మ తన చెవి దిద్దులు ఎక్కడో పెట్టి మర్చిపోయానని ఆంది. వాటికోసం ఇల్లంతా వెతికినా అవి కనపడలేదు. శుభ సమయంలో ఇలా జరిగిందేమిటని మా మేనత్త చాలా బాధపడింది. ఆ ముందురోజే అక్కడినుండి వచ్చేసిన నాకు మా అమ్మ ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను తనతో, "సాయినాథుని వేడుకోమ"ని చెప్పాను. నేను కూడా, "అమ్మ చెవి దిద్దులు దొరికేలా దయచూపమ"ని బాబాని వేడుకున్నాను. కానీ ఆరోజు చెవి దిద్దులు దొరకలేదు. అందరూ తిరిగి రాజమండ్రి వచ్చేసిన రెండు రోజుల తర్వాత మా పిన్ని ఫోన్ చేసి, "దిద్దులు బీరువాలో దొరికాయి" అని చెప్పింది. అది విని మాకు చాలా ఆనందంగా అనిపించింది. అలా బాబా మా అమ్మ, మేనత్తల బాధను తీర్చేసారు.
మా అబ్బాయి నిత్యం సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటాడు. ప్రతివారం మహాపారాయణ చేస్తుంటాడు. తను బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు వ్రాసేటప్పుడు ఒక పరీక్ష విషయంలో చాలా ఆందోళన చెందాడు. ఎందుకంటే, ఆ సబ్జెక్ట్ పూర్తిగా తనకి కొత్త. చివరి సంవత్సరంలో ఆ సబ్జెక్ట్‌ని సిలబస్‌లో చేర్చారు. ఎంత బాగా పరీక్షకి ప్రిపేరైన కూడా అబ్బాయి పరీక్ష జరిగే రోజు చాలా ఆందోళన చెంది ముందుగా బాబా గుడికి వెళ్ళి, బాబా దర్శనం చేసుకున్న తర్వాత పరీక్షకి వెళ్లి పరీక్ష వ్రాసి వచ్చాడు. నేను తన గురించి బాబాని వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. అంతేకాదు, మా అబ్బాయి కోరుకున్న రంగంలోనే తనకి మంచి ఉద్యోగం కూడా ప్రసాదించారు బాబా. ప్రతినిత్యం బాబా తన వెన్నంట ఉండి కాపాడుతుంటారని నా ప్రగాఢ నమ్మకం. "థాంక్యూ బాబా. ఇది చాలా చిన్న మాట. నేను మీకు థాంక్స్ చెప్పాలంటే నా జీవితం మొత్తం సరిపోదు. సదా నన్ను నా కుటుంబాన్ని ఇలానే రక్షించండి తండ్రీ. మేము ఎప్పుడూ మీరు చూపిన బాటలో నడిచేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి".
లోకాసమస్తా సుఖినోభవంతు!!
ఓం సాయి రక్షక శరణం దేవ!!!
Om sai ram
ReplyDeleteSri sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai Ram
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam 🙏
ReplyDeleteOm sri sai karma dwamsine namaha 🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteBaba madava bharam antha meede baba. Tamuudiki kuda manchi udyogam achhetattu cheyandi baba
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba, baram antha mee mede vesthunna..... please situations ni sort chesi evaru ebbandi padakunda chudandi
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDelete